75 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ బైక్‌ స్టార్టింగ్‌ EMI కేవలం రూ. 2,302 మాత్రమే!!

దేశంలో టీవీఎస్‌ టూ-వీలర్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. ఈ సంస్థ నుంచి అందుబాటులో ఉన్న టూ-వీలర్స్‌ మంచి మైలేజీని అందిస్తున్నాయి. అందుకే జనాలు వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా డెలివరీ, వాణిజ్య అవసరాలకు టీవీఎస్‌ టూవీలర్స్‌ ఎక్కువగా వినియోగిస్తున్నారు. టీవీఎస్ స్పోర్ట్‌ లైనప్‌ బైక్స్‌ అధిక మైలేజీ అందించే మోటార్‌సైకిల్స్‌గా ఉన్నాయి. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన పలు మోటార్ సైకిల్స్‌ కస్టమర్లకు మంచి మైలేజీ, మెయింటైనన్స్‌ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్స్‌ని సామాన్యులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ధరల్లో ఉన్నాయి. ఈ బైక్‌లోని ఇంజిన్‌, ఫీచర్లు, ఫర్ఫామెన్స్‌ వంటి ఇతర ఫీచర్లు ఈ కథనంలో..

ఈ టీవీఎస్ స్పోర్ట్ (టీవీఎస్ స్పోర్ట్) సెల్ఫ్‌ స్టార్ట్‌ అల్లాయ్ వీల్‌ న్యూ, సెల్ఫ్‌ స్టార్ట్‌ అల్లాయ్ వీల్‌ అనే రెండు వేరియంట్లలో కొనుగోలుకి అందుబాటులో ఉంది. హైదరబాద్‌లో దీని సెల్ఫ్ స్టార్ట్ అల్లాయ్‌ వీల్‌ న్యూ మోడల్ ఆన్‌ రోడ్‌ ధర రూ.81,661 గా ఉంది. ఈ బైక్‌ని రూ .10,000 డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేయవచ్చు.

TVS-Sports-Bike-On-Road

డౌన్‌ పేమెంట్‌ తర్వాత మిగిలిన రూ .71,661 లోన్‌ అమౌంట్‌కి ఉంటుంది. మొత్తానికి 3 సంవత్సరాల పాటు 9.7% వడ్డీ రేటుతో నెలకు రూ .2,302 EMI చెల్లిస్తే సరిపోతుంది. మరో సెల్ఫ్ స్టార్ట్ అల్లాయ్ వెర్షన్‌ ఆన్ రోడ్ ధర రూ. 87,028గా ఉంది. రూ.10,000 డౌన్ పేమెంట్‌ చెల్లించి ఇంటికి తీసుకువెళ్లవచ్చు.

మిగిలిన రూ. 77,028 గా 36 నెలల పాటు 9.7 శాతం వడ్డీ రేటుతో నెలకు రూ.2,475 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ బైక్ కొనుగోలు చేయడానికి ముఖ్య కారణం 75 కి.మీ మైలేజీ అదించడమే అని చెప్పాలి. ఈ బైక్‌లో బల్బ్ హెడ్ లైట్,LED DRLలు, అనలాగ్ ఇన్‌స్ట్రూమెంట్ ప్యానెల్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

TVS-Sports-Bike-EMI-Amount

112 కిలోల బరువున్న ఈ బైక్ 10 లీటర్ల కెపాసిటీతో ఫ్యూయెల్ ట్యాంక్ ఉంది. టీవీఎస్ స్పోర్ట్ 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 8.19 PS శక్తిని మరియు 8.7 NM గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంది. ఇది గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

టీవీఎస్ స్పోర్ట్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో ట్విన్‌షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్‌ని కలిగి ఉంది. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, ఇది ముందు భాగంలో 130 మిమీ మరియు వెనుక భాగంలో 110 మిమీ డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌ని అందిస్తుంది. ఈ బైక్‌ మంచి స్పోర్టీ లుక్స్‌తో వస్తుంది. అందువల్ల కస్టమర్లు కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

TVS-Sports-Bike-On-Road

ఇక ఈ బైక్‌ హీరో HF డీలక్స్, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 110, హీరో స్ప్లెండర్ ప్లస్ మరియు బజాజ్ సిటీ 110 ఎక్స్ వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇస్తుంది. టీవీఎస్ స్పోర్ట్ మోటార్ సైకిల్ ఆన్-రోడ్ ధరలు మరియు లోన్‌ ఆప్షన్స్‌ రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కావున కచ్చితమైన సమాచారం కోసం సమీప షోరూమ్‌ని సందర్శించండి.


డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, June 15, 2024, 10:26 [IST]
English summary
Tvs sprots bike gives best mileage at lowest price here are the emi options
Read more on: #tvs motors #bikes #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+