కైనెటిక్ E లూనాకు పోటీగా వస్తున్న టీవీఎస్ XL 100 ఎలక్ట్రిక్.. మార్కెట్‌ను కైవసం చేసుకుంటుందా.??
భారత మార్కెట్లో టూ వీలర్ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో తన ఉనికిని ప్రదర్శిస్తోంది. టీవీఎస్ iQube స్కూటర్లకు దేశంలో భారీగానే డిమాండ్ ఉంది. ఈ క్రమంలో తన ఎలక్ట్రిక్ లైనప్‌ను విస్తరించే యోచనలో ఉన్న టీవీఎస్.. త్వరలో మరో ఈవీని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ట్రేడ్‌మార్క్ దరఖాస్తును దాఖలు చేసినట్లు సమాచారం.
టీవీఎస్ మోటార్స్(TVS Motors).. తన ఫేమస్ పెట్రోల్ స్కూటర్ టీవీఎస్ ఎక్స్ 100 ను త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయబోతోంది. కాగా ప్రస్తుతం మార్కెట్లో ఈ తేలికపాటి మోటార్‌సైకిల్ TVS XL 100 పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా.. మార్కెట్లో దీని ధర రూ. 44,999 నుండి రూ. 59,695 మధ్య ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర.

ఈ క్రమంలో త్వరలో టీవీఎస్ XL 100(TVS XL 100) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ TVS XE-XL లేదా TVS XL EV పేరుతో విడుదల కానున్నట్లు సమాచారం. TVS E-XL మరియు TVS XL EV పేరుతో కంపెనీ ఇప్పటికే ట్రేడ్‌మార్క్ దరఖాస్తును దాఖలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కంపెనీ ఇంకా ధ్రువీకరించలేదు.
కాగా ICE మోడల్‌తో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ ధర కొంచెం ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. అధునాతన, స్ట్రాంగ్ ఫీచర్లు, అధిక రేంజ్‌తో టీవీఎస్ ఎక్స్‌ఎల్(TVS XL Electric Moped) ఎలక్ట్రిక్ మోపెడ్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ మోపెడ్ మార్కెట్లోకి విడుదలైనట్లయితే ఇది కైనెటెక్ ఇ లూనాకు గట్టి పోటీనివ్వనుంది.

మార్కెట్లో ద్విచక్ర వాహనాలతో పోటీ తట్టుకోలేక కైనెటిక్ లూనా గత కొన్నేళ్ల క్రితం నిలిపివేయబడిన సంగతి తెలిసిందే. తాజాగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఈ మోపెడ్ విడుదలైంది. కాగా పెట్రోల్‌తో నడిచే టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ కారణంగా గరిష్ఠంగా రోజుకు ఆన్‌లైన్‌లో 5 మోపెడ్‌లు సేల్ అవుతున్నట్లు సమాచారం.
అధిక మైలేజ్, మంచి పనితీరు, లాస్ట్- మైల్ డెలివరీ టాస్క్‌ల్లో భాగంగా.. వాణిజ్య పరిశ్రమలో ఈ స్కూటర్ అత్యంతగా ఆదరణ పొందింది. ఇందులో 99.7 cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది గరిష్ఠంగా 4.3 PS పవర్ మరియు 6.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠంగా 80 కి.మీ మైలేజ్‌ని అందిస్తుంది.

ఈ నేపథ్యంలో మార్కెట్లో టీవీఎస్ ఎక్స్‌ఎల్(TVS XL 100) ఎలక్ట్రిక్ మోపెడ్‌కు పోటీగా కైనెటిక్ ఇ లూనా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ రూ. 64,990 నుంచి రూ. 74,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ధరలో అందుబాటులో ఉంది.
కైనెటిక్ ఇ లూనా.. విభిన్న బ్యాటరీ సెటప్‌లతో వస్తుంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీనిని 1.2 kW ఎలక్ట్రిక్ మోటార్ లేదా 2 kWh బ్యాటరీ సెటప్‌తో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ఐదు కలర్ ఆప్షన్లలో స్పార్క్లింగ్ గ్రీన్, నైట్ స్టార్ బ్లాక్, ఓషన్ బ్లూ, పెర్ల్ ఎల్లో మరియు మల్బరీ రెడ్‌లలో కస్టమర్లు తమకు నచ్చిన కలర్‌ను ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








