ఈ పేదోడి మోటార్‌సైకిల్‌తో ఎన్నో ప్రయోజనాలు.. మీరు పెట్టే ప్రతి పైసాకు రెండింతలు లాభం..
భారతదేశంలో అందరికి పరిచయం ఉన్న బైకులలో టీవీఎస్ ఎక్స్‌ఎల్(TVS XL) ఒకటి. దీనిని పేదవాడి బైకుగా పిలుస్తారు. చాలా మంది దీనిని ఒక్కసారైనా నడిపే ఉంటారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న వారు వ్యవసాయ పనులకు టీవీఎస్ ఎక్స్‌ఎల్‌నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఇది ఎంత బరువు నైనా కూడా చాలా ఈజీగా మోసుకెళ్తుంది. ఎంత బరువు పెట్టిన కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది. పురుషులకు, స్త్రీలకు డ్రైవింగ్ చేయడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. దశాబ్ద కాలం నుంచి ఇండియాలో అమ్మకాల్లో ఈ బైక్ రారాజుగా నిలుస్తుంది.
ఈ మోడల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో అప్‌డేట్ అవుతూ సరికొత్త కలర్ వేరియంట్, డిజైన్స్‌లో మార్కెట్లోకి విడుదల అవుతుంది. ఎక్స్‌ఎల్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని టీవీఎస్ కంపెనీ గతంలో XL100ను తీసుకొచ్చింది. పేదోడి బైకుగా పేరున్న ఈ TVS XL 100 గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు క్రింది కథనంలో మీకోసం ఇవ్వబడ్డాయి.

తక్కువ దూర ప్రయాణాలకు అనువుగా ఉండే XL100 ధర రూ.44,999 గా ఉంది. పనితీరును బట్టి దీన్ని హెవీ డ్యూటీ మోపెడ్ అని కూడా పిలుస్తారు. సామాన్య మధ్యతరగతి వాళ్లతో పాటు, ఇంకా తక్కువ ఆదాయం కలవారు ఈ బైకును ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. దీన్ని నడపడం కూడా చాలా సులభం. మైలేజ్ పరంగా పెట్టిన ప్రతి రూపాయికి లాభం చేకూరుస్తుంది. లీటర్ పెట్రోల్‌కు 80 కి.మీ మైలేజీని ఇస్తుంది.
XL 100 హెవీ డ్యూటీ ఇంజిన్ కెపాసిటీ 99.7 cc. ఇది 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో 4.35 bhp పవర్ వద్ద 6.5 Nm గరిష్ట్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్లను చూసినట్లయితే, పెట్రోల్ రిజర్వ్ ఇండికేటర్, పాస్ స్విచ్, ఇంజిన్ కిల్ స్విచ్, హాలోజన్ హెడ్‌లైట్,పెద్ద ఫ్లోర్ బోర్డ్ స్పేస్, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆన్ బోర్డ్ డయాగ్నస్టిక్స్ ఇండికేటర్లు, డిటాచబుల్ సీట్లు వంటివి ఉన్నాయి.

ముఖ్యంగా ఈ బైకును ప్రధానంగా గ్రామాల్లో వ్యవసాయ పనులు, చిన్న వ్యాపారాలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అక్కడి రోడ్లకు అనుగుణంగా XL 100లో మెరుగైన సస్పెన్సన్ ఉంది. ముందు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ స్ప్రింగ్, వెనుక హైడ్రాలిక్ స్వింగ్ సస్పెన్షన్‌తో ఉంటుంది. దీంతో అన్ని రకాల రోడ్లపై కూడా రయ్ మంటూ దూసుకెళ్తుంది.
ఇది 670 మిమి వెడల్పు, 1895 మిమి పొడవు, 1077 మిమి పొడవును కలిగి ఉంది. తక్కువ వరద నీటిలో సైతం సాఫీగా వెళ్లేలా 158 మిమి గ్రౌండ్ క్లియరెన్స్, 1228 మిమి వీల్ బేస్‌ను దీనిలో అందించారు. రైడింగ్ చేసే సమయంలో సౌకర్యవంతంగా కూర్చోడానికి బ్యాక్‌రెస్ట్ బంపర్, ప్యాసింజర్ ఫుట్‌రెస్ట్ మరింత అప్‌డేట్‌గా వచ్చింది.

ఇది 4 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వచ్చింది. అదనపు లేటెస్ట్ ఫీచర్లలో USB ఛార్జింగ్ పోర్ట్, సెల్ఫ్ స్టార్ట్ బటన్, ఇంజిన్ కిల్ స్విచ్ ఆఫ్ వంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశం అంతటా పండుగల సీజన్‌లో నడుస్తుంది. దీంతో సాధారణ రోజుల్లో కంటే తక్కువ ధరలో XL 100 హెవీ డ్యూటీ అందుబాటులో ఉంది. షోరూమ్ తగ్గింపులు, డిస్కౌంట్లతో మరింత తక్కువ ధరలో బైకును ఇంటికి తీసుకెళ్లవచ్చు.
ఈ బైకు ప్రారంభ ధర రూ .44,999 నుంచి ఉండగా, దీని టాప్ వేరియంట్ మాత్రం కొంచెం ఎక్కువగా రూ .60,905 ధరకు అందుబాటులో ఉంటుంది. ఇవి అన్ని ఎక్స్-షోరూమ్ ధరలు. కొత్త TVS XL 100 హెవీ డ్యూటీని కొనుగోలు చేయాలనుకునే ఆసక్తి ఉన్నవారు సమీపంలోని డీలర్‌లను సంప్రదించవచ్చు.


Click it and Unblock the Notifications








