మార్కెట్‌లోకి ఎన్ని కొత్త బండ్లు వచ్చినా ఇది అందరీ ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌.. షాకింగ్‌ సేల్స్‌ రిపోర్ట్‌!

గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మోపెడ్లలో టీవీఎస్ ఎక్స్‌ఎస్‌ 100 (TVS XL 100) ఒకటిగా ఉంది. ఈ టీవీఎస్ ఎక్స్ఎల్ 100ని పిల్లలు, పెద్దలు డ్రైవ్‌ చేసేలా అనువుగా ఉంటుంది. దీంతో జనాలు ఎక్కువగా ఈ మోపెడ్‌ని కొనడానికి ఇష్టపడతారు. గ్రామీణ ప్రాంతాల్లో స్కూటర్ల కంటే ఎక్కువగా ఈ టీవీఎస్ ఎక్స్ఎల్‌ 100 మోపెడ్‌లపై మహిళలు, పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు దీనిపై దర్శనమిస్తూ ఉంటారు. ఈ మోపెడ్‌ని నడపడం అత్యంత సులభం. అందరూ దీని బరువుని సులువుగా మోయగలరు. దీనిపై భారీ వస్తువులను సైతం సులభంగా తీసుకెళ్లవచ్చు. ఎక్కువగా వ్యాపారం చేసే వాళ్లు, సిటీల్లో డెలివరీ బాయ్స్‌ ఈ మోపెడ్‌ని విరివిగా వినియోస్తారు. అందువల్ల దాని నెలవారీ అమ్మకాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

ఈ టీవీఎస్‌ మోపెడ్‌ ఆగస్టు 2024 నెలకు సంబంధించిన సేల్స్‌ రిపోర్ట్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఆగస్టు 2024 మొత్తం 44,546 యూనిట్ల అమ్మకాలతో టీవీఎస్‌ ఎక్స్ఎల్‌ దుమ్మురేపింది. గత ఏడాది 2023 ఆగస్టులో టీవీఎస్ మోటార్ కంపెనీ కేవలం 36,495 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గత సంవత్సరం ఆగస్టు నెలతో పోల్చితే 8,051 ఎక్స్ఎల్ 100 మోపెడ్లను ఎక్కువగా విక్రయించింది.

TVS XL100 Price

గత ఏడాదితో పోల్చితే ఈ ఎక్స్‌ఎల్‌ సేల్స్‌ 22.06 శాతం ప్రాఫిట్‌ని సాధించింది. ఈ టీవీఎస్‌ మోపెడ్‌ నేరుగా పోటీదారులు లేవు. ప్రస్తుతం ఇదే మార్కెట్‌లో నంబర్‌ 1గా కొనసాగుతుంది. టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మోపెడ్ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటకీ ఎక్కువ అమ్మకాలను నమోదు చేస్తుంది. దీనిని ముఖ్యంగా రైతులు, పాడి వ్యాపారులు, ఇతర అవసరాల కోసం ఎక్కువగా కొంటున్నారు.

ఈ ఎక్స్‌ఎల్‌ని ఎక్కువగా కొనడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి దీని ధర, రెండోది మైలేజీ. భారత మార్కెట్‌లో టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మోపెడ్ ధర ప్రస్తుతం రూ .44,999 ప్రారంభ ధర నుంచే కొనుగోలుకి అందుబాటులో ఉంది. అదే సమయంలో, దీని టాప్ వేరియంట్ ధర రూ .60,905 గా ఉంది. ఇవి అన్ని ఎక్స్-షోరూమ్ ధరలు.

TVS XL100

ఇక టీవీఎస్ ఎక్స్ఎల్100 మోపెడ్ బైక్‌ 99.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 4.4 ps గరిష్ట శక్తిని 3,500 rpm వద్ద 6.5 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మోపెడ్ 158 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలగి ఉంది.

ఇది 4 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఈ టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మోపెడ్‌లో USB ఛార్జింగ్ పోర్ట్, సెల్ఫ్‌ స్టార్ట్‌ బటన్, ఇంజిన్ కిల్ స్విచ్ ఆఫ్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. స్పీడోమీటర్‌, ఫ్యూయల్‌ ఇండికేటర్‌ టర్న్‌ ఇండికేటర్స్‌ డిస్ప్లే వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో కలవు. ఇది లీటర్‌కి 80 కి.మీ భారీ మైలేజీని అందిస్తుంది.

TVS XL100 Sales Report August 2024

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, September 23, 2024, 9:16 [IST]
English summary
Tvs xl100 sales increased 22 percent in august 2024
Read more on: #tvs #bike sales #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+