నవంబర్‌లో ఎక్కువగా ఆ కంపెనీ టూవీలర్స్‌ని మాత్రమే కొన్న జనాలు.. రోజుకు ఎన్ని బైకులు కొంటున్నారో తెలుసా?

భారత్‌లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పండుగ సీజన్‌ ముగిసిన తర్వాత కూడా ఆఫర్లు, డిస్కౌంట్లతో ప్రజలను కంపెనీలు ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. దీంతో నవంబర్‌లోనూ టూవీలర్స్‌ అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరిగాయి. తాజాగా విడుదలైన నవంబర్‌ 2024 సేల్స్ రిపోర్ట్‌ ప్రకారం బజాజ్, టీవీఎస్ మోటార్ కంపెనీ, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) వంటి కంపెనీలు సేల్స్‌ పెంచుకోగా.. హీరో మోటోకార్ప్ అమ్మకాలు 2023 నవంబర్‌తో పోలిస్తే క్షీణించాయి. 2024 నవంబర్‌ నెలకు సంబంధించిన మొత్తం సేల్స్‌ వివరాలు ఈ కథనంలో..

2024 నవంబర్‌ అమ్మకాల్లోనూ హీరో మోటోకార్ప్ అదరగొట్టింది. గత నెలలో మొత్తం 4,39,777 యూనిట్ల టూవీలర్స్‌ సేల్‌ అయ్యాయి. 2023 నవంబర్‌ అమ్మకాల సంఖ్యతో పోలిస్తే 7.66 శాతం సేల్స్‌ తగ్గాయి. మొత్తం అమ్మకాల్లో 4,25,856 యూనిట్ల మోటారుసైకిళ్లు 3.5 శాతం క్షీణతను చవి చూశాయి. ఇక కేవలం 33,949 స్కూటర్ల అమ్మకాలతో ఏకంగా 32 శాతం సేల్స్ పడిపోయాయి.

Hero MotoCorp Sales November 2024

అయితే ఎగుమతుల పరంగా హీరో మోటోకార్ప్ అదరగొట్టింది. గత ఏడాదితో పోల్చితే 20,028 యూనిట్లతో 36 శాతం ఎగుమతులు పెరిగాయి. ఇక మొత్తం (దేశీయ సేల్స్ + ఎగుమతులు) కలిపి మొత్తం 4,59,805 యూనిట్లు సేల్‌ అయ్యాయి. ఓవరాల్‌గా 6.4 శాతం సేల్స్ క్షీణించాయి. హీరో మార్కెటింగ్‌, స్ట్రాంగ్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా చూస్తే త్వరలోనే మళ్లీ సేల్స్‌ పుంజుకునే అవకాశం ఉంది.

ఇక ఈ తర్వాతి స్థానంలో హోండా మోటార్‌సైకిల్‌ ఇండియా ఉంది. నవంబర్‌ 2024లో మొత్తం 4,32,888 యూనిట్లను హోండా మోటార్స్‌ విక్రయించింది. గత ఏడాది 4,20,677 యూనిట్లతో పోల్చితే సేల్స్‌ 2.9 శాతం పెరిగాయి. ఇక ఎగుమతుల పరంగా హోండా అదరగొట్టింది. 2023 నవంబర్‌లో 27,172 కేవలం యూనిట్లను ఎగుమతి చేయగా.. గత నెలలో 39,861 యూనిట్లను ఎగుమతి చేసింది.

Honda Motorcycle November 2024

ఎగుమతుల పరంగా హోండా మోటార్‌సైకిల్స్‌ ఇండియా 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక హోండా ఓవరాల్‌గా 4,72,749 యూనిట్లను సేల్‌ చేసింది. గత ఏడాదితో పోల్చితే 5.55 శాతం సేల్స్‌ పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా హీరో మోటోకార్ప్‌ కంటే అధికంగా ఈ కంపెనీ టూవీలర్స్‌ సేల్‌ అయ్యాయి. ఇదే ట్రెండ్‌ కొనసాగితే దేశంలోనూ హోండా టూవీలర్స్‌ హీరో మోటోకార్ప్‌ని బీట్‌ చేయనుంది.

ఇక టీవీఎస్ మోటార్ కంపెనీ 2024 నవంబర్‌లో 3,92,473 ద్విచక్ర వాహనాల అమ్మకాలను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే 12 శాతం అమ్మకాలు పెరిగాయి. ఇందులో 3,05,323 యూనిట్లు భారత్‌లో సేల్‌ అయ్యాయి. గత ఏడాది 2,87,017 యూనిట్లతో పోల్చితే సేల్స్‌ 6 శాతం పెరిగాయి. మొత్తం సేల్స్‌లో బైక్స్‌తో పోల్చితే స్కూటర్లు ఎక్కువగా అమ్ముడువుతున్నాయి.

Suzuki Sales November 2024

ఆ తర్వాతి స్థానంలో సుజుకి ఉంది. 2024 నవంబర్‌లో 94,370 యూనిట్లను సుజుకి విక్రయించింది. గతే ఏడాదితో 87,096 యూనిట్ల అమ్మకాలతో పోల్చితే సేల్స్‌ 8 శాతం పెరిగాయి. ఇందులో దేశీయ అమ్మకాలు 78,333 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది దేశీయంగా అమ్మకాలు 73,135 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో సేల్స్‌ 7 శాతం పెరిగాయి. 16,037 యూనిట్లతో ఎగుమతులు 15 శాతం పెరిగాయి.

నవంబర్‌ 2024లో బజాజ్‌ ఆటో 3,68,076 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది 3,49,048 యూనిట్లను మాత్రమే సేల్‌ చేసింది. అమ్మకాలు 5% పెరిగాయి. దేశంలో గత ఏడాది 2,18,597 యూనిట్లు అమ్ముడవగా.. ఈ ఏడాది కేవలం 2,03,611 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. దీంతో అమ్మకాలు 7 శాతం పడిపోయాయి. దీని ఎగుమతులు మాత్రం 26 శాతం పెరిగాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఇటీవలె తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ను ప్రదర్శించింది. అలాగే బేర్ 650, గోవాన్‌ క్లాసిక్ 350 లను విడుదల చేసింది. అదే సమయంలో స్క్రామ్ 440, క్లాసిక్ 650 లను కూడా ఆవిష్కరించి మంచి జోష్‌లో ఉంది. త్వరలోనే మరిన్నీ ఉత్పత్తులు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్‌గా 2024 నవంబర్‌లో 82,257 యూనిట్లను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ విక్రయించింది.

గత ఏడాది 2023 నవంబర్‌లో విక్రయించిన 80,251 యూనిట్లతో పోల్చితే లాభాలు స్వల్పంగా పెరిగాయి. ఇక దేశీయంగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు 4 శాతం క్షీణించాయి. గత ఏడాది 75,137 యూనిట్లతో పోల్చితే ఈ ఏడాది కేవలం 72,236 యూనిట్లు మాత్రమే సేల్‌ అయ్యాయి. నవంబర్‌ 2023లో 5,114 యూనిట్లు సేల్‌ అవ్వగా.. 10,021 యూనిట్లతో 96 శాతం ఎగుమతులు పెరిగాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 4, 2024, 11:39 [IST]
English summary
Two wheeler sales in november 2024 check
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+