భారత్‌లో సేల్స్ పరంగా టూ వీలర్స్ దూకుడు.. ఎక్కువగా ఆ బైక్‌నే ఇష్టపడుతున్నారట.!!
గత ఆర్థిక సంవత్సరం 2023-24లో భారతదేశంలో విక్రయించిన ద్విచక్ర వాహనాల(Two Wheeler Sales In 2023-24) డేటాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ అసోసియేషన్స్ విడుదల చేసింది. మరి ఏయే కంపెనీ ఎన్ని వాహనాలను విక్రయించింది.. పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం..
ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటోకార్ప్(Hero Motocorp Sales) ప్రతి నెలా సగటున 4 నుంచి 5 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద 2-వీలర్ కంపెనీ అయిన హీరో మోటోకార్ప్(Hero Motocorp) గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 53,95,924 ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

అంటే, గత 1 సంవత్సరంలో, హీరో(Hero Motocorp sales 2023-24) నుండి భారతదేశంలో దాదాపు 54 లక్షల 2-వీలర్లు అమ్ముడయ్యాయి. అయితే, మునుపటి ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2022 - మార్చి 2023), హీరో మోటోకార్బ్ నుండి 51,35,129 ద్విచక్ర వాహనాలు మాత్రమే సేల్ అయ్యాయి.
ఈ విభాగంలో హీరో మోటోకార్ప్ విక్రయాలు 5.08 శాతం పెరిగాయి. ఇక హోండా మోటార్స్ రెండో స్థానంలో ఉంది. హోండా నుంచి 2023-24లో భారతదేశంలో మొత్తం 40,92,126 ద్విచక్ర వాహనాలు విక్రయాలు నమోదు అయ్యాయి. అయితే, FY 2022-23లో హోండా టూ-వీలర్ విక్రయాలు 40 లక్షలకు చేరుకోలేదు. ఈ నేపథ్యంలో, హోండా గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 1,18,940 ద్విచక్ర వాహనాలను ఎక్కువగా విక్రయించింది.

హోండా తర్వాత టీవీఎస్ మోటార్స్(TVS Motors Sales 2023-24) 3వ స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ బ్రాండ్ నుంచి మొత్తం 29,65,744 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. TVS మోటార్స్ నుంచి 3-వీలర్లు కూడా విక్రయించబడుతున్నప్పటికీ, ఈ విక్రయాల సంఖ్య 29,65,744 TVS 2-వీలర్లకు మాత్రమే నమోదయ్యాయి.
TVS మోటార్ కంపెనీ(TVS Motors) మునుపటి ఆర్థిక సంవత్సరం అంటే 2022-23లో 24,89,121 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఈ నేపథ్యంలో టీవీఎస్ 2-వీలర్ల అమ్మకాలు దాదాపు 4,76,623 మేర పెరిగాయి. హీరో మోటోకార్ప్ విక్రయాలు కూడా ఈ మేరకు పెరగలేదని నివేదికల ద్వారా వెల్లడవుతుంది.

ఇక చివరగా బజాజ్ ఆటో ఇండియా(Bajaj Auto India) 4వ స్థానంలో ఉంది. బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 21 లక్షల 8,049 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. కానీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో బజాజ్ నుండి 17 లక్షల 4,445 ద్విచక్ర వాహనాలు మాత్రమే సేల్ అయ్యాయి. ఆ తర్వాత సుజుకి మోటార్‌సైకిల్ (8,46,991), రాయల్ ఎన్‌ఫీల్డ్ (7,80,904) అమ్మకాలత 5వ మరియు 6వ స్థానాల్లో నిలిచాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








