323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
అల్ట్రావైలెట్ ఎఫ్-77 అప్‌డేటెడ్ వెర్షన్‌ని భారత మార్కెట్లో ఆ సంస్థ లాంచ్ చేసింది. ఈ ఎఫ్77 బైక్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి ఎఫ్77 మ్యాక్ 2 (F77 Mach), ఎఫ్77 మ్యాక్ 2 రెకాన్ అనే రెండు వేరియంట్లుగా ఉన్నాయి. ఈ బైక్స్ కావాలనుకునే వారు రూ.5,000 చెల్లిస్తే సరిపోతుంది. ఆ తర్వాత దశలవారీగా మే 2024 లో డెలివరీలు ప్రారంభమవుతాయి.
F77 Mach 2కు 27kW మోటార్ శక్తిని అందిస్తుంది. అలాగే రీకాన్ 30kW మోటార్ ద్వారా పనిచేయనుంది. ఈ బైక్స్ సాధారణంగా 7.1kWh బ్యాటరీని పొందుతాయి. ఇవి 211KM రేంజ్‌ని అందిస్తుంది. అదే విధంగా రీకాన్ వేరియంట్ 10.3kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 323km రేంజ్‌ని అందిస్తుంది. ప్రీమియమ్ బైక్‌లలో అధిక రేంజ్ అందించే విధంగా ఈ బైక్ పోటీపడనుంది.

రీకాన్ వేరియంట్‌లో 10 స్థాయిల స్విచ్ చేయగల రీజనరేటివ్ బ్రేకింగ్ లెవల్స్ స్టాండర్డ్‌తో వస్తుంది. బేస్ మోడల్ మాత్రం మూడు బ్రేకింగ్ లెవల్స్‌ని మాత్రమే పొందుతుంది. తాజాగా విడుదల చేసిన అప్‌డేటెడ్ బైక్‌లో మెరుగైన పనితీరు, ఫీచర్లు, హార్డ్‌వేర్ తదితర అప్‌డేట్స్‌ని సంస్థ మార్పులు చేసింది. ఈ బైక్స్ వరుసగా ఇది 40బిహెచ్ పి పవర్ మరియు 100ఎన్ఎమ్ టార్క్ అవుట్ పుట్ ని అందిస్తాయి.
ఈ బైక్ కొనుగోలు చేసే వినియోగదారులు మూడు ఛార్జింగ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. స్టాండర్డ్ ఛార్జర్ మరియు బూస్ట్ ఛార్జర్స్ ఉన్నాయి. దీనితో పాటు సూపర్‌నోవా ఛార్జర్ ఆప్షన్ కూడా ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ కేవలం గంటలో 20 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జింగ్ పూర్తి చేయవచ్చు. ఈ మోటార్ సైకిల్ గ్లైడ్, కాంబాట్ మరియు బాలిస్టిక్ అనే మూడు రైడింగ్ మోడ్‌లలో వస్తుంది.

ఇక ఈ బైక్ 0-60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలో అందుకుంటుంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 7.7 సెకన్ల సమయం తీసుకుంటుంది. వయోలెట్ ఏఐ ద్వారా మూవ్ మెంట్, ఫాల్ అండ్ టోవింగ్ అలర్ట్స్, రిమోట్ లాక్ డౌన్, క్రాష్ అలర్ట్, డైలీ రైడ్ స్టాట్స్, యాంటీ కొలిజన్ వార్నింగ్ సిస్టం వంటి ఫీచర్లను అల్ట్రావియోలెట్ అందిస్తుంది.
F77 Mach 2 పాత డిజైన్‌ను కలిగి ఉండనుంది. అయితే బైక్ ఇప్పుడు వివిధ రంగుల్లో (9) లభ్యం కానుంది. అవి ఇది లైటింగ్ బ్లూ, ఆస్టరాయిడ్ గ్రే, టర్బో రెడ్, ఆఫ్టర్‌బర్నర్ ఎల్లో, స్టెల్త్ గ్రే, కాస్మిక్ బ్లాక్, ప్లాస్మా రెడ్, సూపర్‌సోనిక్ సిల్వర్ మరియు స్టెల్లార్ వైట్ రంగులలో వస్తుంది. ఛార్జింగ్ పోర్ట్ క్యాప్ మునుపటి ప్లాస్టిక్ యూనిట్ లా కాకుండా ఇప్పుడు అల్యూమినియంతో వచ్చింది.

ఫ్రంట్ ఫోర్క్స్‌లోని F77 గ్రాఫిక్స్ కూడా కొత్త కలర్స్‌తో జోడించబడ్డాయి. ఇక 17-అంగుళాల చక్రాలపై మౌంట్ చేయబడిన ఒకే 320mm ఫ్రంట్ మరియు 230mm వెనుక డిస్క్ ఉన్నాయి. ఎఫ్77 మ్యాక్ 2 (F77 Mach), ఎఫ్77 మ్యాక్ 2 రెకాన్ ధరలు రూ.2.99 లక్షలు, రూ.3.99 లక్షలుగా ఉన్నాయి. ఈ ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి. అయితే ఈ ధరలు మొదటి 1,000 వినియోగదారులకు మాత్రమే వర్తిస్తాయి.


Click it and Unblock the Notifications








