ఖండాంతరాలు దాటిన Ultraviolette F77.. ఇది కదా ఇండియన్ బైక్ క్రేజ్ అంటే..
బెంగళూరుకు చెందిన ప్రముఖ బైక్ తయారీ స్టార్టప్ 'ఆల్ట్రావయొలెట్'(Ultraviolette) దేశీయ మార్కెట్లో 'ఎఫ్77' (F77) ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కంపెనీ ఈ బైకులను టర్కీలో కూడా విక్రయించడానికి సన్నద్ధమవుతోంది. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపించే ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 (Ultraviolette F77) బైకుని కంపెనీ ఇటీవల ఇస్తాంబుల్ 2024 ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించింది. కాగా త్వరలోనే టర్కీలో విక్రయించనున్నట్లు సమాచారం. కంపెనీ టర్కీలోని మోటార్‌సైకిల్ డిస్టిబ్యూటర్ కే-రైడ్స్ ద్వారా విక్రయించడానికి సన్నద్ధమవుతోంది. కే-రైడ్స్ అనేది కిబార్ హోల్డింగ్‌లో భాగం. ఇది టర్కీలో ఉన్న ఒక పారిశ్రామిక సమ్మేళనం అని తెలుస్తోంది.

ఎగ్జిబిషన్‌లో కంపెనీ తన ఎఫ్77 టాప్ స్పెక్ మోడల్ రీకాన్‌ను ప్రదర్శించింది. ఈ 1వేరియంట్ 0.3 కిలోవాట్ బ్యాటరీతో లభిస్తుంది. ఇది ఒక సింగిల్ చార్జితో ఏకంగా 307 కిమీ పరిధిని అందిస్తుందని సమాచారం. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 152 కిమీ కావడం గమనార్హం. ఇది కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 కిమీ/గం వరకు వేగవంతం (యాక్సిలరేషన్) అవుతుంది.
బైక్ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందించే ఈ ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ పొందుతుంది. మూడు రైడింగ్ మోడ్‌లతో (గ్లైడ్, కంబాట్ మరియు బాలిస్టిక్) కూడిన TFT డాష్‌ను కూడా ఇందులో చూడవచ్చు. డిజైన్ కూడా చూడగానే ఆకర్శించబడే విధంగా ఉంటుంది. కావున ఈ బైక్ టర్కీలో కూడా తప్పకుండా మంచి అమ్మకాలను పొందగలదని భావిస్తున్నాము.

భారతీయ విఫణిలో ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 3.80 లక్షలు కాగా.. రీకం వేరియంట్ ధర రూ. 4.55 లక్షలు. ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో ఉన్న 300 సీసీ మరియు 400 సీసీ విభాగంలోని బైకులైన కేటీఎం 390 డ్యూక్, కవాసకి నింజా 500 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది. కంపెనీ ఇటీవలే సూపర్‌నోవా ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రవేశపెట్టింది.
టర్కిష్ మార్కెట్లో ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 ఆవిష్కరించిన సందర్భంగా.. కంపెనీ కో అండ్ కో ఫౌండర్ 'నారాయణ్ సుబ్రహ్మణ్యం' మాట్లాడుతూ.. 'కే-రైడ్స్'తో కలిసి టర్కీ మార్కెట్లో ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది. కంపెనీ ఈ బైకును భారతీయ మార్కెట్లో లాంచ్ చేసినప్పుడే 190 కంటే ఎక్కువ దేశాలు ఈ బైక్ కోసం ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.

టర్కీలో డిమాండును దృష్టిలో ఉంచుకుని విక్రయించడం జరుగుతుందని తెలుస్తోంది. అంతే కాకుండా మోటోబైక్ ఇస్తాంబుల్ 2024లో ఎఫ్77 యొక్క ప్రదర్శన గ్లోబల్ విస్తరణ వ్యూహంలో పురోగతిని సూచిస్తోందని నారాయణ్ సుబ్రహ్మణ్యం అన్నారు. రాబోయే రోజుల్లో కంపెనీ ఈ బైకును మరిన్ని దేశాల్లో విక్రయించే అవకాశం ఉంది. అయితే టర్కీ తరువాత కంపెనీ దేశంలో విక్రయించనుందనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు.
నిజానికి బెంగళూరులో ఆల్ట్రావయొలెట్ తన ఎఫ్77 ఎలక్ట్రిక్ బైకుని ప్రారంభించినప్పటి నుంచి బైక్ ప్రేముకుల మనసు దోచేసింది. అద్భుతమైన డిజైన్.. అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ బైక్ పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగి ఎక్కువ రేంజ్ అందిస్తున్న కారణంగా ఎక్కువ మంది ఈ బైక్ కొనటానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్నిబట్టి చూస్తే మార్కెట్లో ఈ బైకుకి ఉన్న డిమాండ్ ఇట్టే అర్థమైపోతుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








