ఈవీ రైడర్లకు గుడ్‌న్యూస్.. 100 కు పైగా Ultraviolette SUPERNOVA ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు.. ఎక్కడంటే.?
ఎలక్ట్రిక్ వాహనదారులకు ప్రధాన సమస్యగా ఉన్న ఛార్జింగ్ ప్రాబ్లమ్‌కు ఇక చెక్ పడనుంది. అంతరాయం లేని ప్రయాణానికి దేశవ్యాప్తంగా త్వరలో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు రానున్నాయి. ఈ మేరకు ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ Ultraviolette.. సూపర్‌నోవా DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఎక్కడెక్కడా అంటే.?: దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో.. Ultraviolette సూపర్‌నోవా ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. 100 కు పై SUPERNOVA DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కంపెనీ ప్రారంభించగా.. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ఈ మూడు రాష్ట్రాల్లో 10 సూపర్‌నోవా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయి.

BIS ప్రమాణాలు: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తింపు పొందిన.. IS17017-2-6 (IEC 62196-6) ప్రమాణాల ఆధారంగా.. టైప్ 6 కనెక్టర్‌ను కలిగి ఉన్న 12 kW (2x6kW) మరియు 6 kW (2x3kW) DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను సంస్థ ఏర్పాటు చేసింది.
ఈ సూపర్‌నోవా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల ద్వారా అల్ట్రావైలెట్ F77 ఒరిజినల్ మరియు F77 రీకాన్ మోటార్‌సైకిళ్లను 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ చేయడానికి 40 నుండి 60 నిమిషాల సమయం పడుతుందని సంస్థ తెలిపింది. దీని ద్వారా సుదూర ప్రయాణాల్లో మెరుగైన రైడింగ్ అనుభవాన్ని పొందవచ్చు.

DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు: కాగా మొదటి దశలో, Ultraviolette 100 కు పైగా SUPERNOVA మరియు SUPERNOVA PLUS DC Fast Charging Stations విస్తరించింది. కాగా మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడులో ఇప్పటికే 10 స్టేషన్‌లు కస్టమర్లకు సేవలందిస్తున్నాయి. ప్రముఖ కేఫ్‌లు మరియు ప్రధాన రహదారులు, సహా కీలకమైన మోటార్‌సైక్లింగ్ మార్గాల వద్ద ఉన్న రైడర్లకు ఈ స్టేషన్లు అందుబాటులో ఉంటాయి.
SUPERNOVA డ్యూయల్ 3 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ గన్‌లను కలిగి ఉంటూ.. 6 kW ఎంపికతో వస్తుంది. కాగా SUPERNOVA PLUS డ్యూయల్ 6 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ గన్‌లతో 12 kW ఛార్జింగ్ సామర్థ్యాన్ని అందిస్తుందని సంస్థ వెల్లడింది. ఇక రెండు కాన్ఫిగరేషన్‌లు F77తో అందుబాటులో ఉన్న ఆప్షనల్ బూస్ట్ ఛార్జర్‌ను పూర్తి చేసి వేగవంతమైన మరియు సమర్థవంతమైన ఛార్జింగ్‌ను అందిస్తుంది.

Ultraviolette SUPERNOVA ఛార్జింగ్ స్టేషన్‌ల లాంచ్ గురించి Ultraviolette SUPERNOVA ఛార్జింగ్ స్టేషన్‌ల అరంగేట్రం సహ-వ్యవస్థాపకుడు మరియు CEO నారాయణ్ సుబ్రహ్మణ్యం సంతోషం వ్యక్తం చేశారు. రైడర్లకు అంతరాయం లేని ఫ్రెండ్లీ రైండిగ్‌ను అందించాలనే నిబద్ధతతో ఈ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఇది ఈవీ రంగంలో ఓ కీలక మైలు రాయి అని చెప్పారు.
సాహసోపేతమైన రైడింగ్: తద్వారా ఇంటర్ సిటీ, క్రాస్ కంట్రీ ప్రయాణాల్లో రైడర్ల ప్రయాణం సులభతరం అవుతుందని నారాయణ్ సుబ్రహ్మణ్యం అన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ వృద్ధిలో Supernova DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కస్టమర్లు నగరం, రాష్ట్ర సరిహద్దులను దాటి థ్రిల్లింగ్ సాహసాలను ఆస్వాదించవచ్చని వెల్లడించారు.
Ultraviolette SUPERNOVA మరియు Ultraviolette SUPERNOVA PLUS డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల లాంచ్‌పై కో ఫౌండర్ అండ్ CTO నీరాజ్ రాజ్‌మోహన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 6 kW మరియు 12 kW స్టేషన్లు రెండింటిలోనూ డ్యూయల్-గన్ కాన్ఫిగరేషన్ ద్వారా వేగవంతమైన మరియు సమర్థవంతమైన ఛార్జింగ్‌ని నిర్ధారిస్తాయని చెప్పారు. అత్యాధునిక సాంకేతికతను అందించడంలో నిబద్ధతను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications








