కొత్త ప్రొడక్ట్‌ను లాంచ్ చేయనున్న Ultraviolette.!!.. ఆ రోజే సస్పెన్స్ రివీల్.!!
దేశంలో ప్రముఖ బైక్‌ల తయారీ సంస్థ అల్ట్రావయోలెట్(Ultraviolette New Launch) త్వరలో కొత్త ప్రొడక్ట్‌ను లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 24 న ఈ కొత్త ఉత్పత్తి లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మార్కెట్లో Ultraviolette సంస్థ F77 బైక్‌ను మాత్రమే విక్రయిస్తోంది. అయితే వచ్చే నెలలో ఈ సంస్థ నుంచి విడుదల కానున్న ప్రొడక్ట్‌పై మార్కెట్లో అంచనాలు నెలకొన్నాయి.
ఏప్రిల్ 24 న Ultraviolette నుంచి విడుదల కాబోతున్న సంస్థ ఎలాంటి అధికార ప్రకటన విడుదల చేయననప్పటికీ.. సంస్థ విడుదల చేసిన ఫొటోల ద్వారా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని పరిశీలిస్తే దానిపై 'ఫ్లైట్ మోడ్(Flight Mode)' అని ఉంది. దీన్ని బట్టి ఇది F77 ఎలక్ట్రిక్ బైక్ కొత్త వేరియంట్ లేదా ప్రత్యేక ఎడిషన్‌గా తెలుస్తుంది.

కాగా Ultraviolette మోటార్‌సైకిల్ కోసం కొత్త OTA అప్‌డేట్‌లపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై పూర్తి సమాచారం వెలువడే అవకాశం ఉంది. కాగా Ultraviolette ఏవియేషన్, రేసింగ్‌ల నుంచి ప్రేరణ పొంది F99 ప్లాట్‌ఫామ్‌ను గతంలో ఆవిష్కరించింది. దీన్ని బట్టి చూస్తే 'ఫ్లైట్ మోడ్' క్లూ ద్వారా ఈవెంట్‌లో F99 కాన్సెప్ట్ లేదా ప్రొడక్షన్ రూపంలో ప్రదర్శించే అవకాశం ఉంది.
Ultraviolette F99 రేసింగ్ ప్రోగ్రామ్‌ను సంస్థ EICMA 2023లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. భారతదేశంలో తయారు చేయబడిన రేస్-స్పెక్ Ultraviolette F99 లిక్విడ్-కూల్డ్ మోటారును కలిగి ఉంటుంది. Ultraviolette F99 ఎలక్ట్రిక్ బైక్ భారతదేశపు అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ సూపర్ బైక్‌గా ఉండనుంది.
Ultraviolette F99 118 bhp గరిష్ఠ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ గరిష్ఠంగా 265 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని బరువు కేవలం 178 కిలోలుగా ఉంది. ఈ బైక్ కేవలం 3 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

ఈ బైక్ కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడిన బాడీవర్క్‌తో వస్తుండగా.. ఫ్రేమ్ స్టీల్ హైబ్రిడ్ నిర్మాణంతో దీన్ని రూపొందించారు. ఇంకా స్వింగ్ ఆర్మ్ అల్యూమినియంతో తయారైంది. ఇంకా 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ముందు భాగం 180/55, వెనుక భాగం 120/70 ఉంటుంది. వీల్‌బేస్ 1400 మి.మీ కాగా ఎత్తు 1050mm గా ఉంది.
కాగా EV తయారీదారు Ultraviolette F99 యొక్క ప్రొడక్షన్ వెర్షన్‌ను 2025లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేస్తుందని భావిస్తుండగా.. ప్రస్తుత ప్రకటన ద్వారా ఈ బైక్‌పై అంచనాలు నెలకొన్నాయి. ఊహాగానాలు నిజమైతే దాదాపు రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర ట్యాగ్‌తో ఈ బైక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








