Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలంటే చాలా ఆలోచిస్తాం. మైలేజ్, ధర, పర్ఫామెన్స్ ఇలా చాలా రకాలుగా పరిశీలించి.. టెస్ట్ రైడ్ అనంతరం సంతృప్తి చెందితే కస్టమర్లు కొనగోలు చేస్తారు. కానీ ఇక్కడ ఆంపియర్(Ampere) అనే ఈవీ కంపెనీ మాత్రం.. కస్టమర్లకు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. 10,000 కి.మీ టెస్ట్ రైడ్ దిగ్విజయంగా పూర్తి చేసుకుని శభాష్ అనిపించుకుంది.
భారత్‌లో ఇప్పటివరకూ ఎన్నో రకాల మోడళ్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలయ్యాయి. ఒక్కో మోడల్ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. డిజైన్, ఫీచర్లు, ముఖ్యంగా సరసమైన ధరలో బ్యాటరీ రేంజ్‌కు ప్రాధాన్యతనిస్తూ యువ రైడర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పటిదాకా మార్కెట్లో ఉన్న ఈవీలతో పోలిస్తే చాలా ప్రత్యేకం ఈ ఇ స్కూటర్..

గత కొంతకాలంగా ఈవీ సెగ్మెంట్‌లో అత్యధికంగా వినిపిస్తున్న పేరు ఆంపియర్ నెక్సస్(Ampere Nexus E Scooter) ఎలక్ట్రిక్ స్కూటర్. ఇంతవరకూ ఏ ఈవీ కంపెనీ తలపెట్టని ఓ వినూత్న ప్రయత్నాన్ని ఆంపియర్ దిగ్విజయంగా పూర్తి చేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ 10,000 కి.మీ టెస్ట్ రైడ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
వేల కి.మీల టెస్ట్ రైడ్‌తో భారత కస్టమర్లలో భారీ అంచనాలను కలిగి ఉన్న ఆంపియర్ నెక్సస్ ఇ స్కూటర్‌ను సంస్థ త్వరలో లాంచ్ చేయనుంది. ఈ క్రమంలో Nexus పనితీరును ప్రదర్శించేందుకు కశ్మీర్ నుంచి టెస్ట్ రైడ్‌ను జనవరి 16 న మొదలుపెట్టింది. 10,000 కి.మీ ప్రయాణించి తాజాగా కన్యాకుమారిలో ఈ రైడ్‌ను ముగించింది.

ఆంపియర్ జనవరి 16న జమ్మూ కాశ్మీర్‌లోని సలాల్ డ్యామ్ నుంచి ఈ యాత్రను ప్రారంభించింది. మార్చి 18 న తమిళనాడులోని కన్యాకుమారిలో టెస్ట్‌రైడ్‌ను ముగించింది. అప్‌కమింగ్ Nexus E Scooter రైడ్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జర్నీ అప్‌డేట్లను.. ఆంపియర్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ ప్రయాణంలో ఆంపియర్ నెక్సస్ ఇ స్కూటర్ 115 పట్టణాలు మరియు నగరాలను తాకుతూ సాహసోపేతమైన రైడింగ్‌ను పరిచయం చేసింది. కాగా ఆంపియర్.. నెక్సస్ ఇ స్కూటర్ ఏడాది క్రితం ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. NXG కాన్సెప్ట్ యొక్క ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్ నెక్సస్ ఇ స్కూటర్.
ఇక ఆంపియర్ నెక్సస్ ఇ స్కూటర్ విషయానికొస్తే.. ఇందులో LFP (లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్) బ్యాటరీని ఉపయోగించారు. ఇందులో నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఫీచర్ల పరంగా నెక్సస్‌లో పెద్ద డిజిటల్ డిస్‌ప్లే, ఫ్లష్-మౌంటెడ్ పిలియన్ ఫుట్ పెగ్‌లు, ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్ మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి.
కాగా ఆంపియర్ నెక్సస్ K2K ఎడిషన్ ఇ-స్కూటర్ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఆసక్తి గల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రూ. 499 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుతో FAME సబ్సిడీ గడువు ముగియనుంది. FAME 3 పథకం అమలులోకి రానుంది. ధరలు పెరిగే అవకాశాలు ఉండటంతో.. నెక్సస్ ఇ స్కూటర్‌ను సంస్థ ఏ ధరతో లాంచ్ చేస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








