CNG బైక్ లాంచ్ వాయిదా!.. కొత్త డేట్ ఇదే..
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) మార్కెట్లో CNG బైక్ లాంచ్ చేస్తామని గతంలోనే ప్రకటించింది. చేపినట్లుగానీ కంపెనీ ఈ నెల 18న ఆవిషకరించనున్నట్లు గత వారంలో పేర్కొంది. కానీ ఈ డేట్ కాస్త ఇప్పుడు జూలై 17 చేరింది. అంటే బజాజ్ కంపెనీ విడుదల చేయనున్న CNG చూడటానికి ఇంకా నెలరోజులు వేచి ఉండాలన్నమాట.. ఈ విషయాన్ని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'రాకేష్ శర్మ' ఈ తేదీని వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
త్వరలో లాంచ్ కానున్న కొత్త బజాజ్ CNG బైక్ పేరును బ్రూజర్ అనుకున్నారు. కానీ ఈ బైక్ పేరు బ్రూజర్ కాదని, దీని పేరు భిన్నంగా ఉంటుందని రాకేష్ శర్మ వెల్లడించారు. అయితే ఈ బైక్ లాంచ్ ఆలస్యం కావడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. మొత్తం మీద ఇది వచ్చే నెల 17 న లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కొత్త CNG బైక్.. దేశీయ విఫణిలో బైక్ కుటుంబంలో మొదటిది కావడం విశేషం. ఇది చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉండొచ్చని.. ఇప్పటి వరకు టెస్టింగ్ సమయంలో కనిపించిన చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఈ బైక్ 100 - 150 సీసీ కమ్యూటర్ బైక్ విభాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ బైకులో రెండు ఫ్యూయెల్ ట్యాంకులు ఉండనున్నట్లు సమాచారం.
బజాజ్ CNG బైకులోని ఫ్యూయెల్ ట్యాంక్లలో.. ఒకటి పెట్రోల్, మరొకటి CNG. ఈ రెండింటిలో పనిచేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే పెట్రోల్ నుంచి CNG మారేటప్పుడు ఎలాంటి ఆటంకం ఉండే అవకాశం ఉండదని సమాచారం. అయితే పవర్ మరియు టార్క్ గణాంకాలు ఎలా ఉంటాయనేది తెలియాల్సి ఉంది. ఈ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ మరియు పరిధి కూడా త్వరలోనే వెల్లడవుతాయి.

కొత్త బజాజ్ CNG బైక్ ప్రత్యేకించి రోజు వారీ వినియోగానికి నిర్దేశించబడింది. కాబట్టి తప్పకుండా ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుందని సమాచారం. డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇది దాని మునుపటి మోడల్స్ మాదిరిగా ఉండొచ్చని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. మొత్తం మీద ఇది తప్పకుండా వాహన వినియోదాగారులకు అనుకూలంగా ఉంటుందని మాత్రం తెలుస్తోంది.
నిజానికి కంపెనీ ప్రారంభంలో ఓ CNG బైకును లాంచ్ చేస్తుంది. ఆ తరువాత ఈ విభాగంలో మరిన్ని బైకులను లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఏ బైకులను ఈ CNG విభాగంలో లాంచ్ చేస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా 100 నుంచి 150 సీసీ మధ్యలో లాంచ్ చేయొచ్చని భావిస్తున్నాము. కాగా బజాజ్ CNG బైక్ ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇక లాంచ్ చేయడమే ఆలస్యం..
భారతదేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో కొందరు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక బైకుల విభాగంలో ఇప్పటి వరకు CNG బైక్స్ లేనేలేదు. కాబట్టి బజాజ్ ఓ సంచలన నిర్ణయం తీసుకుని బైక్ విభాగంలో కూడా CNG బైక్ ఉంటే బాగుంటుందని భావించి బజాజ్ CNG బైక్ తయారీకి సిద్ధమైంది. ఈ బైక్ నిర్వహణ సాధారణ పెట్రోల్ బైక్ నిర్వహణ కంటే తక్కువని తెలుస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








