Upcoming Electric Scooters: భారత్‌ మార్కెట్‌లోకి విడుదల కానున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. లిస్ట్‌ ఇదే!!

ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వినియోగం భారత్‌లో పెరుగుతోంది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఈవీల తయారీ సంస్థలు సరికొత్త మోడళ్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటి వరకు 7 ఎలక్ట్రిక్‌ సూటర్లు (Upcoming Electric scooters) ఈ సంవత్సరం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెసిఫికేషన్లు, విడుదల తేదీ వివరాలపై పూర్తి కథనం.

టీవీఎస్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ : టీవీఎస్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. టీవీఎస్‌ iQube ST వేరియంట్‌గా తెలుస్తోంది. అయితే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ స్పెసిఫికేషన్లు, ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

tvs-iqube-st-

ఏథర్‌ Rizta : ఏథర్‌ సంస్థ ఇటీవల Ather Rizta టీజర్‌ను ఆవిష్కరించింది. ఏథర్‌ 450X లైనప్‌ కంటే కాస్త భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. టీజర్‌ ఆధారంగా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ డిజైన్‌, ప్రాక్టికాలిటీ వినియోగదారులను ఆకట్టుకుంటుందని సంస్థ భావిస్తోంది. రానున్న ఆరు నెలల్లో ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ విడుదల కానుంది.

హోండా యాక్టివా ఆధారిత స్కూటర్‌ : హోండా త్వరలో యాక్టివా ఆధారిత ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది. CES 2024 వేదికగా విడుదల చేయనున్నారు. ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో వేగం కంటే రేంజ్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయించాలని హోండా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

 honda-sc-e-concept

ఓలా స్కూటర్‌ : ఓలా ఇటీవల వాణిజ్య అవసరాల కోసం కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ తక్కువ బాడీ వర్క్‌, సింగిల్‌ సీటర్‌ డిజైన్‌, మార్చుకోగలిగిన బ్యాటరీలను కలిగి ఉంటుంది. పూర్తి వాణిజ్య అవసరాల కోసం ఈ స్కూటర్‌ విడుదల కానుంది.

సుజుకి బర్గ్‌మన్‌ ఎలక్ట్రిక్‌ : ఈ సంవత్సరం టోక్యో మోటార్‌ షోలో సుజుకి బర్గ్‌మన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రోటోటైప్‌ను పరిచయం చేసింది. బర్గమన్‌ డిజైన్‌ను కలిగి ఉంది. మరియు మార్చుకొనే అవకాశం ఉన్న బ్యాటరీలతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను భారత్‌ రోడ్లపై అనేకసార్లు టెస్ట్‌ డ్రైవ్‌ చేశారు. ఈ సంవత్సరంలోనే ఈ సుజుకి స్కూటర్‌ను విడుదల చేయనున్నారు.

 hero-vida-sway-trike-concept-

Hero Vida : హీరో Vida తన ఎలక్ట్రిక్‌ స్కూటర్ల లైనప్‌ను విస్తరించాలని భావిస్తోంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో రెండు ఈవీలను అందుబాటులోకి తీసుకురానుంది. సంస్థ సీఈవో నిరంజన్ గుప్తా దీనిని ద్రువీకరించారు. మిడ్‌ రేంజ్‌ మోడల్‌, హై ఎండ్‌ మోడల్‌ను లాంచ్‌ చేయనున్నారు. అయితే పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 30, 2024, 12:11 [IST]
English summary
Upcoming electric scooters confirmed in indian market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+