2025లో మార్కెట్లో ఇక జాతరే.. దడ పుట్టించడానికి వస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650cc బైక్స్ ఇవే
ఇండియాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ బైకులకు ఇప్పటికి మంచి క్రేజ్ ఉంటుంది. గత దశాబ్ద కాలంగా ఎన్నో కంపెనీలు తమ టూవీలర్లను లాంచ్ చేస్తున్నప్పటికి కూడా డుగ్ డుగ్ అనే సౌండ్‌కే అందరు పడిపోతుంటారు. ఎన్‌ఫీల్డ్ బైకులకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ కంపెనీ నుంచి వచ్చిన 350 సీసీ మోడళ్లకు మంచి డిమాండ్ ఉండటంతో అమ్మకాల పరంగా ఇవి ఇతర కంపెనీల బైకుల కంటే కూడా ముందు వరుసలో ఉంటాయి. ఎన్‌ఫీల్డ్ బైకులు దేశంలోని అన్ని నగరాల నుంచి మొదలుకుని పట్టణాలు, గ్రామాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఇవి చాలా వరకు అందుబాటు ధరలో లభించడం, అలాగే వీటి ధృడమైన బాడీ, స్టైలీష్ డిజైన్ కారణంగా చాలా మంది ఈ కంపెనీ నుంచే వచ్చే వాటిని బాగా ఇష్టపడుతుంటారు. రోడ్లపై పెద్ద సౌండ్‌తో వెళ్తుంటే అందరి చూపు కూడా బైక్‌పైనే ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులంటే ఒక్క 350 సీసీనే కాకుండా 450 సీసీ బైకులను కూడా విడుదల చేసి భారత్‌లో టూవీలర్ విభాగంలో తిరుగులేని రారాజుగా నిలిచింది. ఇదిలా ఉంటే కంపెనీ ఈ ఇంజిన్ విభాగాలపై దృష్టి పెడుతూనే, 650 సీసీ భారీ ఇంజిన్ కెపాసిటీతో కూడా తన బైకులను విడుదల చేస్తుంది. ఇప్పటికే ఈ కేటగిరీలో కాంటినెంటల్ GT 650, ఇంటర్‌సెప్టర్ 650, షాట్‌గన్ 650 మోడళ్లను తీసుకువచ్చింది.

అలాగే, ఇటీవల బేర్ 650ని కూడా మార్కెట్లోకి విడుదల చేసిన 650 సీసీ ఇంజిన్ విభాగంపై తన పట్టు సాధించడానికి ప్రయత్నించగా, ఇదే సెగ్మెంట్‌లో కంపెనీ నాలుగు 650 సీసీ బైక్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. రానున్న నెలల్లో ఇవి మార్కెట్లోకి ఘనంగా లాంచ్ కాబోతున్నాయి. కొత్త ఏడాదిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు ఇది సంతోషం కలిగించే న్యూస్. అయితే ఏ మోడళ్లు రాబోతున్నాయో క్రింది కథనంలో చూద్దాం.
Royal Enfield Bullet 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 బైక్ 2025 ఏడాదిలో మధ్య భాగంలో విడుదల కాబోతుంది. బుల్లెట్‌కు ప్రజల్లో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ మోడల్‌ను తీసుకువస్తుంది. ఇది శక్తివంతమైన 648cc ట్విన్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, ఇది రూ.3 లక్షల ధరలో కొనుగోలుకు ఉండవచ్చు.
Royal Enfield Interceptor 650: 2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 డిజైన్ సరికొత్తగా ఉంటుంది. ఇది 648cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. రౌండ్ LED హెడ్‌లైట్, టియర్‌డ్రాప్ షేపులో ఉండే పెట్రోల్ ట్యాంక్‌తో వస్తుంది. సస్పెన్షన్ సెటప్ అప్‌డేటడ్‌గా వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇతర అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కూడా ఈ బైకులో అందించారు. అంచనాల ప్రకారం ధర రూ.3.20 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
Royal Enfield Himalayan 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 అడ్వంచర్స్‌కు పెట్టింది పేరుగా ఉంటుంది. ఇప్పటికే హిమాలయన్ 450 బైకు ఇండియాలో బాగా డిమాండ్ ఉన్న బైకుగా ఉంది. పర్వత ప్రాంతాల్లో ఈజీగా రైడ్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఇప్పుుడు ఇదే సెగ్మెంట్‌లో 650 సీసీని తీసుకువస్తున్నారు. ఈ బైక్ 2025 అక్టోబర్-నవంబర్ దీపావళి పండుగ సమయంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Royal Enfield Classic 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇది 2025 మొదటి త్రైమాసికంలో దేశీయ మార్కెట్లో విడుదల కాబోతుంది. ఇది చూడటానికి క్లాసిక్ 350 లాగా కనిపిస్తుంది. కాకపోతే ఇంజిన మాత్రం భారీగా ఉంటుంది. క్లాసిక్ మోడల్ దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్‌గా ఉండగా, ఇప్పుడు ఇదే సెగ్మెంట్‌లో 650 సీసీ మార్కెట్లో సందడి చేయడానికి రాబోతుంది.


Click it and Unblock the Notifications








