లాంచ్‌కు సిద్దమవుతున్న సరికొత్త రాయల్ బండి ఇదే!.. ఇదిగో ఫోటోలు

దశాబ్దాల చరిత్ర కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఒకప్పటి నుంచి బైక్ విభాగంలో రారాజుగా కొనసాగుతూ.. ఎప్పటికప్పుడు కొత్త బైకులు లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పటికే హంటర్, మీటియోర్, క్లాసిక్ మొదలైన మోడల్స్ లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో కొత్త బైక్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ సరికొత్త 'రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450' (Royal Enfield Guerrilla 450) లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ లాంచ్ చేయబోయే ఈ కొత్త బికా గురించి మరిన్ని ఆసక్తికర విషయలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేయనున్న కొత్త గెరిల్లా 450 బైక్ ఈ నెల 17న (జులై 17) లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు కంపెనీ ఈ బైకుకు సంబంధించిన టీజర్లు కూడా లాంచ్ అవుతున్నాయి. రాబోయే ఈ కొత్త బైక్ హిమాలయన్ ప్లాట్‌ఫారమ్ ఆధారపడి ఉంటుందని సమాచారం. కాబట్టి ఫీచర్స్ కొన్ని సారూప్యంగా ఉండే అవకాశం ఉంది.

Royal Enfield Guerrilla 450 Details

రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ సెమీ డిజిటల్ డిస్‌ప్లేతో వస్తుందని తెలుస్తోంది. ఇది ఇప్పటికే కంపెనీ యొక్క హంటర్, మీటియోర్, స్క్రామ్, షాట్‌గన్ మరియు సూపర్ మీటియార్ వంటి వాటిలో కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా TFT డిస్‌ప్లే పొందుతుందని తెలుస్తోంది. ఇది చూడటానికి ఇప్పటికే మార్కెట్లో ఉన్న హిమాలయన్ మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది.

గెరిల్లా 450 బైక్ మల్టిపుల్ వేరియంట్లలో లభించే అవకాశం ఉంది. టాప్ వేరియన్త TFT పొందనుంది. లో వేరియంట్స్ చిన్న ట్రిప్పర్ పాడ్‌తో డిజి అనలాగ్ డాష్‌ పొందనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇందులో ఒకటి.. రాబోయే బైక్ ధర. కంపెనీ యొక్క ఈ గెరిల్లా ధరలను లాంచ్ సమయంలో అధికారికంగా కంపెనీ వెల్లడిస్తుంది.

Royal Enfield Guerrilla 450 Details

TFT అమర్చబడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ డ్యూయెల్ టోన్ ఆప్షన్ పొందుతుంది. ఇది రెడ్ అండ్ గ్లోడ్ పెయింట్ స్కీమ్. ఇప్పటికే కంపెనీ ఈ కలర్ ఎంపికలలో బైకులను లాంచ్ చేసింది. అయితే ఈ కలర్ ఆప్షన్ కలిగిన బైకులు అన్నీ కూడా టాప్ వేరియంట్స్ అని తెలుస్తోంది. కాబట్టి రాబోయే బైక్ కూడా టాప్ వేరియంట్ ఈ కలర్ ఆప్షన్ పొందినట్లు తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి ఇంక రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ బైక్ ధర అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ ఇది రూ. 2.30 లక్షల నుంచి రూ. 2.70 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉండొచ్చని అంచనా. కంపెనీ ఈ బైక్ యొక్క ధరలను లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడించనుంది.

కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ డిజైన్ మరియు ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికి ఈ బైక్ టెస్టింగ్ దశలో ఉంది. కాబట్టి త్వరలోనే లాంచ్ అవుతుంది. ఈ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ ఎప్పుడు స్వీకరిస్తుంది. డెలివరీలు ఎప్పుడు ఉండవచ్చు అనే మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో తెలుస్తాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 3, 2024, 17:00 [IST]
English summary
Upcoming royal enfield guerrilla 450 details ahead of launch
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+