టాప్‌ కంపెనీల నుంచి త్వరలో విడుదల కాబోతున్న 5 స్కూటర్లు.. ఈ స్కూటీలకు రావేవి సాటి!!

త్వరలో మార్కెట్‌లోకి సరికొత్త స్కూటర్లు విడుదల కానున్నాయి. 2024-25 సంవత్సరంలో హీరో మోటోకార్ప్, టీవీఎస్, బజాజ్ ఆటో మరియు హోండా నుంచి సరసమైన ధరలో ఇవి రానున్నాయి. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్కూటర్లకు గట్టి సవాల్‌ని విసిరేందుకు సిద్ధం అవుతున్నాయి. టాప్‌ కంపెనీల నుంచి రాబోతున్న టాప్‌-5 స్కూటర్ల జాబితా మీకోసం..

హీరో జూమ్‌ 125R & జూమ్‌ 160: ఎక్స్‌ట్రీమ్‌ 125R, మావ్రిక్ 440ల తరువాత హీరో మోటోకార్ప్ నుంచి జూమ్ 125R మరియు జూమ్‌ 160ల స్కూటర్లను త్వరలోనే ప్రవేశపెట్టనుంది. ఈ స్కూటర్లు 125సీసీ విభాగంలోని స్పోర్టీ స్కూటర్లకు గట్టి పోటీని ఇవ్వనున్నాయి. ఇక ఇవి బెస్ట్ అడ్వెంచర్ స్కూటర్‌గా కూడా సత్తా చాటనున్నాయి. రెండు మోడళ్లు ఆకర్షణీయమైన స్టైలింగ్‌తో రానున్నాయి.

Hero-Xoom125R-Xoom-160

ఈ రెండు స్కూటర్లు 156 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రానున్నాయి. ఇది 15.2 bhp వద్ద 14.1nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. హీరో జూమ్ 125ఆర్ & జూమ్ 160 మెరుగైన ఫ్యూయెల్‌ ఎఫిసెన్సీ కోసం ఐ3ఎస్ టెక్నాలజీని కలిగి ఉండనుంది. ఈ స్కూటర్లు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్‌ సస్పెన్షన్‌తో రానున్నాయి.

ఇక ఈ స్కూటర్లు ఫ్రంట్, రియర్ డిస్క్ బ్రేకులు, బ్లాక్ ప్యాటర్‌ టైర్లతో 14 అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్విన్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, పొడవైన విండ్‌స్క్రీన్‌, స్మార్ట్ కీ వంటి ఫీచర్లు జూమ్‌ 160 ప్రత్యేకతలు. ఇక హీరో జూన్‌ 125ఆర్ స్టైలింగ్ పరంగా జూమ్‌ 110 ఆధారంగా రూపొందించబడింది. మార్కెట్‌లోకి ఈ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాక హోండా స్కూటర్స్‌కి గట్టి పోటీని ఇవ్వనున్నాయి.

Honda-Electric-Scooter

హోండా ఎలక్ట్రిక్ స్కూటర్: హోండా ఇండియా మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసుకురానుంది. భారత్‌లో తొలిసారిగా కర్ణాటకలోని ఉత్పత్తి కేంద్రంలో దీనిని రూపొందించనుంది. యాక్టివా స్ఫూర్తితోK4BA కోడ్ నేమ్‌తో దీనిని విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి కంపెనీ అడుగు పెట్టింది. భారత మార్కెట్ కోసం హోండా ప్రత్యేకంగా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను అభివృద్ధి చేస్తోంది. ఫిక్స్డ్‌, స్వాపబుల్ బ్యాటరీ ఆప్షన్లతో వీటిని తీసుకువస్తున్నారు.

హీరో విడా: హీరో విడా సిరీస్‌లో మరో సరసమైన కొత్త స్కూటర్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. విడా వి1, విడా వి1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల దిగువన ఈ మోడల్ ఉండనుంది. హెడ్ లైట్, సీటు క్రింద విశాలమైన స్టోరేజీ (బూట్‌ స్పేస్‌)తో రానుంది. వీ1 మాదిరిగానే ఇవి కూడా అదే ప్లాట్ ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.

Bajaj-Chetak-Electric-Scooter

న్యూ బజాజ్ చేతక్: బజాజ్ ఆటో చేతక్ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ 2025 ప్రారంభంలో విడుదల చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం, చేతక్ ప్రీమియం మరియు అర్బనే అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ .1.47 లక్షలు మరియు రూ .1.23 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. కొత్త తరం చేతక్‌లో పెద్ద బ్యాటరీ ప్యాక్, అధునాతన ఫీచర్లు మరియు మెరుగైన రైడింగ్ రేంజ్ ఉంటుందని భావిస్తున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, May 24, 2024, 14:37 [IST]
English summary
Upcoming scooters in 2024 25 hero motocorp to bajaj chetak
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+