DR EV రూ.70 వేలకే 120 కి.మీ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. స్మార్ట్ బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీ సహా..!!
ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు సరికొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా Vegh ఆటోమొబైల్స్ సంస్థ తన వాహన శ్రేణి విస్తరణలో భాగంగా మల్టీ పర్పస్ స్కూటర్ DR EV ను లాంచ్ చేసింది.
వాణిజ్య ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ అవసరాలు తీర్చడంలో భాగంగా Vegh ఆటోమొబైల్స్ సంస్థ కీలక అడుగులు వేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు నిర్వహించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 లో ఈ కొత్త ఈవీని లాంచ్ చేశారు.

DR EV ధర : ఈ DR EV దేశవ్యాప్తంగా సంస్థ డీలర్‌షిప్‌లలో మార్చి నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఈవీ ధర రూ.70,000 నుంచి రూ.80,000 గా ఉంది. ఈ DR EV మూడు రైడింగ్ మోడ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఎకో, పవర్, స్పోర్ట్ మోడ్‌లలో మెరుగైన పనితీరును కలిగి ఉంటుంది.
ఈ ఈవీ పట్టణ రోడ్లు సహా కష్టమైన భూభాగాల్లో వివిధ వ్యాపార అవసరాలను తీర్చే విధంగా ఉంటుంది. రానున్న రెండు సంవత్సరాల కాలంలో B2B (బిజినెస్ 2 బిజినెస్) సెగ్మెంట్‌లో తమ తయారీ సామర్థ్యాలను పెంచుకోవడం, కొత్త వాహనాలను ఆవిష్కరించడం ద్వారా 15-20 శాతం ఆదాయాన్ని పొందాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
కి.మీ నుంచి 140 కి.మీ రేంజ్ : Vegh ఆటోమొబైల్స్ DR EV సమర్థవంతమైన రవాణా సహా ఇతర అవసరాలకు సరైన ఎంపికగా ఉంటుంది. ఈ ఈవీ గరిష్ఠంగా 120 కి.మీ నుంచి 140 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. 48V వోల్జేజ్ ఆర్కిటెక్చర్‌తో గరిష్ఠంగా 1.9KW శక్తిని అందిస్తుంది. లిథియం అయాన్ NMC బ్యాటరీలను కలిగి ఉంటుంది.
4 గంటల్లో 80 శాతం ఛార్జింగ్ : DR EV స్మార్ట్ బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా 0-80 శాతం ఛార్జింగ్‌ను 3.5 నుంచి 4 గంటల్లో ఛార్జింగ్ చేయవచ్చు. ఈ వాహనం ఎక్కువ మన్నిక మరియు భద్రతను ఇస్తుంది. బ్యాటరీ, మోటార్, ఛార్జర్ మరియు కంట్రోలర్‌కు వారంటీలను కలిగి ఉంటుంది.
వేగ్ ఆటోమొబైల్ DR EV తమ ఫోర్ట్‌ఫోలియోను మెరుగుపరుస్తుందని సీఈవో, కో ఫౌండర్ ప్రగ్యా గోయల్ తెలిపారు. ఈ కొత్త వాహనం విడుదల తమ B2B ఎలక్ట్రిక్ వాహన రంగంలో తమ ముందడుగును సూచిస్తుందని పేర్కొన్నారు. ఎంటర్‌ప్రైజస్ యొక్క వ్యాపార అవసరాలను తీర్చేందుకు ఈ వాహనం ప్రత్యేకంగా రూపొందించబడినట్లు చెప్పారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








