వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..

ఇటాలియన్ స్కూటర్ బ్రాండ్ వెస్పాకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. భారత్‌లో కూడా ఈ కంపెనీ దశాబ్ధాల కాలం నుంచి కస్టమర్లకు సేవలందిస్తోంది. కొంత కాలం పాటు దేశీయ OEMల భాగస్వామ్యంతో పనిచేసిన వెస్పా.. గత దశాబ్ద కాలంగా స్వతంత్ర సంస్థగా పనిచేస్తోంది. ఈ క్రమంలో వెస్పా.. ఓ గుడ్‌ న్యూస్‌ తీసుకువచ్చింది.

వెస్పా మాతృ సంస్థ పియాజియో ప్రపంచవ్యాప్తంగా తన 140వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకొంటుండగా.. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని పియాజియో వెస్పా స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను మార్కెట్లో లాంచ్‌ చేసింది. 'Vespa 140th Piaggio' పేరుతో ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. కేవలం 140 యూనిట్లు మాత్రమే గ్లోబల్‌ మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంటాయి.

Vespa-Piaggio-Special-Edition-Launched

వెస్పా పియాజియో స్పెషల్‌ ఎడిషన్ స్కూటర్‌ బుకింగ్‌లు ఏప్రిల్ 18న ప్రారంభమయ్యాయి. 66 దేశాల్లో 21 ఏప్రిల్ 2024 వరకు ఈ బుకింగ్‌లను చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే భారత్‌ నుంచి మాత్రం ఏ యూనిట్లు కూడా రిజర్వ్ చేయలేదని సంస్థ తెలిపింది.

కాగా వెస్పా స్పెషల్ ఎడిషన్‌ స్కూటర్‌ను ఆకట్టుకునేలా రూపొందించారు. ఇందులో బాడీ గ్రాఫిక్స్‌ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇవి స్కూటర్‌‌కు ఆకర్షణీయమైన లుక్‌ను ఇవ్వడంతో పాటు.. వైట్ పెయింట్ స్కీమ్‌తో పాటు, స్కూటర్‌కు ప్రత్యేకమైన బ్లూ యాక్సెంట్‌లు అదనపు స్టైల్‌ లుక్‌ను జోడిస్తాయి.

Vespa-Piaggio-Special-Edition-Launched

ఈ ప్రత్యేకతలు వెస్పా స్పెషల్‌ ఎడిషన్‌ స్కూటర్‌కు స్పోర్టీ, యూత్‌ఫుల్ లుక్‌ను జోడిస్తుంది. ఇందులో రియర్‌ ఫెండర్‌పై '140' బ్రాండింగ్‌ను చూడవచ్చు. కాగా ఇది వెస్పా వరల్డ్ డేస్ 2024 ర్యాలీలో ప్రదర్శించబడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక వెస్పా స్పెషల్‌ ఎడిషన్‌లో ఫీచర్ల పరంగా లేటెస్ట్ టెక్నాలజీని చూడవచ్చు.

వెస్పా స్పెషల్‌ ఎడిషన్‌ స్కూటర్‌లో రెట్రో ఎలిమెంట్‌లు, క్లాసిక్ డిజైన్ ఉండేలా.. Vespa 300 300 GTV ఆధారంగా రూపొందించారు. దీని ఫ్రంట్ ఫెండర్‌పై రౌండ్ హెడ్‌ల్యాంప్ అమర్చబడి ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఆప్రాన్ మౌంటెడ్ పొజిషన్ ల్యాంప్స్, సింగిల్ పీస్ రేసింగ్ సీట్, సైడ్ ఫెండర్‌లపై ఎయిర్ ఫిన్స్, బ్లూ అల్లాయ్ వీల్ రిమ్‌లతో ఆకర్షణీయంగా ఉంటుంది.

Vespa-Piaggio-Special-Edition-Launched

ఇక వెస్పా 140 వ స్పెషల్‌ ఎడిషన్‌ స్కూటర్‌లో ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 278 సీసీ సింగిల్ సిలిండర్‌తో పనిచేస్తుంది. ఇందులో 4 స్ట్రోక్, 4 వాల్వ్ ఉండగా.. 8,250 rpm వద్ద 23.8 bhp పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. 5250 rpm వద్ద 26 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

వెస్పా 140 వ స్పెషల్‌ ఎడిషన్‌ స్కూటర్‌ లీటర్‌కు 30.3 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. ఫీచర్ల పరంగా ఇందులో పూర్తి LED ఇల్యూమినేషన్, పూర్తి-డిజిటల్ సర్క్యులర్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇంకా కీలెస్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి రైడర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లను చూడవచ్చు.

Vespa-Piaggio-Special-Edition-Launched

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, April 19, 2024, 20:03 [IST]
English summary
Vespa piaggio launches vespa special edition model to celebrate 140th anniversary
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+