భారత్‌లోకి వచ్చేస్తోంది మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. పేరు టెన్నిస్‌.. ఊరు ఇటలీ!

ఆటోమోబైల్ రంగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న దేశంలో భారత్‌ ఉంది. ప్రస్తుతం చైనా, జపాన్‌ తొలి రెండు స్థానాల్లో ఉండగా వాటిని అధిగమించేలా ఇప్పుడు భారత్ దూసుకెళ్తుంది. మన దేశంలో టూవీలర్స్‌, కార్లు, ఇతర వాణిజ్య వాహనాలను విరివిగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లలో భారతదేశం ఒకటి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే వారి సంఖ్య మన దేశంలో పెరుగుతోంది. ఈ కారణంగా, కొత్త మరియు కొత్త విదేశీ ఎలక్ట్రిక్ వాహనాలు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇటలీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ భారత్‌లో తన ఉత్పత్తులను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అది ఏ కంపెనీ? దాని ఉత్పత్తులు ఎలా ఉంటాయి? ఆ వివరాలను మీరు ఈ కథనంలో చూడవచ్చు.

ప్రస్తుతం విదేశీ టూవీలర్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీలు భారత గడ్డపై కాలు మోపేందుకు యత్నిస్తున్నాయి. ఈ విభాగానికి దేశంలో మంచి భవిష్యత్తు ఉండటంతో చాలా కంపెనీలు భారతీయ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లు, మంచి రేంజ్‌తో కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఇటలీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ భారతీయ మార్కెట్‌పై కన్నేసింది.

VLF-Tennis-Electric-Scooter-Launch

ఆ కంపెనీ పేరే VLF. 1993లో అలెస్సాండ్రో టాల్టారినిచే స్థాపించబడిన ఈ ఈవీ కంపెనీ ఇటాలియన్ మార్కెట్‌లోని టూవీలర్ సెగ్మెంట్‌లో మంచి వాటాను కలిగి ఉంది. కేవలం ఇటలీకి మాత్రమే పరిమితం కాకుండా ఐరోపా దేశాలలో సైత గణనీయమైన సంఖ్యలో వినియోగదారులను కలిగి ఉంది. ఈ పరిస్థితుల్లో వీఎల్ఎఫ్ భారత ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది.

ఇందుకోసం ఆ సంస్థ కా వెలోజ్ మోటార్స్ (KAW Veloce Motors) అనే ప్రైవేట్ మోటార్‌ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పంద ప్రకారం భారతదేశంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఫెసిలిటీ సెంటర్‌ని ప్రారంభించారు. ఈ ప్లాంట్ కార్యకలాపాలతో పాటు ఉత్పత్తి అయ్యే ప్రతీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కౌ వెలోస్ సహాయం VLF తీసుకోనుంది.

VLF-Tennis-Electric-Scooter-Price-And-Expected-Launch-Date

వాహనాల తయారీలో ఈ వెలోజ్‌ సంస్థకు 60 ఏళ్ల అనుభవం ఉంది. ఇటాలియన్ తరహా స్కూటర్లు కాస్త డిఫరెంట్‌గా, ఇన్నోవేటిట్‌గా ఉంటాయి. ఇప్పటికే ఇటాలియన్‌ బ్రాండ్స్‌ అయినా అప్రిలియా, వెస్పా స్కూటర్‌ డిజైన్‌ వాటి మార్క్‌ స్టైలింగ్‌ని చూస్తే అర్థం అవుతుంది. ఈ వీఎల్ఎఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు వాటికి ఏమాత్రం తీసిపోవని తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన చిత్రాలు అలాంటి సంకేతాలనే ఇస్తున్నాయి.

ఇటలీలో మంచి మార్కెట్‌ని కలిగి ఉన్న ఈ బ్రాండ్‌.. భారత్‌లో అత్యంత పోటీ మరియు ఇతర కంపెనీలకు సవాల్‌ విసురుతుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్‌లో స్టైలిష్ మరియు మంచి బిల్డ్ క్వాలిటీపై జనాలు దృష్టి సారిస్తున్నారు. అందుకు తగినట్లుగా ఈ స్కూటర్లు ఉండనున్నాయి. ఈ పండుగ సీజన్‌లో ఈ సంస్థ నుంచి తొలి స్కూటర్‌ని మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు.

భారత్‌లో విడుదల కాబోయే తొలి స్కూటర్‌కి 'టెన్నిస్' అని పేరు పెట్టింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని రానున్న పండుగ సీజన్‌లోనే భారతదేశంలో విడుదల చేయాలని VLF యోచిస్తోంది. దీనికంటే ముందే VLF భారత్ అంతటా తమ బ్రాండ్‌ని ప్రమోట్ చేసే పనిలో ఉండనుంది. కావ్‌ వెలోజ్‌ మోటార్స్‌తో కలిసి రోడ్ షోలు, ఆటో ఎక్స్ పో వంటి కార్యక్రమాల్లో VLF పాల్గొంటుంది.

అదేవిధంగా భారతదేశం అంతటా డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ని విస్తరించడంపై ఆ కంపెనీ సీరియస్‌గా దృష్టి సారించనుంది. వీలైనంత వరకు 2024 నాటికి 15 డీలర్‌ప్ సెంటర్లను ఏర్పాటు చేయాలని VLF భావిస్తోంది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి దీన్ని 50కి పెంచాలని వీఎల్ఎఫ్ యోచిస్తోంది. దీనికి కావ్‌ వెలోజ్‌ మార్కెట్‌ వాటా కలిసి వస్తుందని భావిస్తోంది.

డ్రైవ్స్‌పార్క్ వ్యాఖ్య: స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించేలానే ఉద్దేశ్యంతో వీఎల్‌ఎఫ్ మార్కెట్‌లోకి రానుంది. అందువల్ల ఈ స్కూటర్లు భారతీయ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తాయని మేము భావిస్తున్నాము. సాధారణంగా ఇటలీ కంపెనీలకు చెందిన స్కూటర్లు భారత్‌లో కొద్దిగా ఖరీదైనవిగా ఉన్నాయి. అయితే ఈ విషయంలో వీఎల్ఎఫ్ సరైన నిర్ణయం తీసుకుంటేనే భారత మార్కెట్‌లో మనుగడ సాగించగలదు. లేదంటే దాని ప్రమోషన్స్‌ ఇతర ఖర్చులకే కార్యకలాపాల వరకే కంపెనీ సేల్స్‌ పరిమితం అవుతాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, July 9, 2024, 9:40 [IST]
English summary
Vlf tennis electric scooter hits indian market in upcoming festive season
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+