కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. పేరు టెన్నిస్ ఊరు ఇటలీ, 130 కి.మీ రేంజ్, 88 కిలోల బరవు, డిస్క్ బ్రేక్స్
భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ పెరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను జనాలు కొంటున్నారు. ఈ మార్కెట్‌ని ఒడిసిపట్టుకునేందుకు ప్రతీ స్టార్టప్ కంపెనీ ఎలక్ట్రిక్ టూవీలర్స్ ఉత్పత్తిపై దృష్టి సారించాయి. ప్రతీ సంస్థ తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ అందించే స్కూటర్లను మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నాయి. దేశీయ కంపెనీలతో పాటు విదేశీ సంస్థలు సైతం భారతీయ మార్కెట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. తాజాగా ఇటలీకి చెందిన వీఎల్‌ఎఫ్ (Velocifero) భారత్‌లో కా వెలోస్ మోటార్స్ (Kaw Veloce Motors) ద్వారా కొత్త స్కూటర్ టెన్నిస్ (VLF Tennis Electric Scooter)ని విడుదల చేసింది. ఈ సరికొత్త స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
టెన్నిస్ పేరుతో మార్కెట్‌లో దీనిని ప్రవేశపెట్టారు. ఈ స్కూటర్‌ని భారతీయ మార్కెట్‌లో ఇతర లైనప్స్‌కి గట్టి పోటీని ఇచ్చేందుకు కేవలం రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో తీసుకురావడం గమనార్హం. కా వెలోస్ మోటార్స్ ద్వారా ఈ కంపెనీ టూవీలర్స్ అమ్మకాలు సాగనున్నాయి. కా వెలోస్ మోటార్స్ దేశంలోని మోటోహస్ (MotoHaus) ఔట్‌లెట్స్ ద్వారా VLF, బ్రిక్స్‌టన్ (Brixton) టూవీలర్స్‌ని మార్కెటింగ్ చేస్తోంది.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో గల కా వెలోస్ ప్లాంట్‌లో 20,000 యూనిట్ల వార్షిక సామర్థ్యంతో టెన్నిస్ స్కూటర్లను అసెంబుల్ చేయనున్నారు. ఈ స్కూటర్లకు సంబంధించిన డెలివరీ తేదీలను సైతం కంపెనీ ప్రకటించింది. నవంబర్ 25 నుంచి టెన్నిస్ స్కూటర్లు డెలివరీలు ప్రారంభమవుతాయని ఆ సంస్థ స్పష్టం చేసింది. ముందుగా ముంబయి, పుణె, బెంగళూరు, గోవా, చెన్నై, జైపూర్, అహ్మదాబాద్ సహా టైర్ 1, టైర్ 2 నగరాల్లో వీటిని డెలివరీ చేయనున్నారు.
ఇక 2025 జూన్ నాటికి దేశంలోని మొత్తం 20కి పైగా డీలర్‌షిప్స్‌ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు KAW వెలోస్ మోటార్స్ తెలిపింది. స్కూటర్ మార్కెట్‌లోని ఇతర స్కూటర్లకు ఏమాత్రం తీసిపోని ఫీచర్లతో దీనిని తీసుకువచ్చారు. ధరకు తగినట్లుగానే దీనిని ప్రత్యేక డిజైన్, రేంజ్‌తో దీనిని తీసుకువచ్చారు. 12 ఇంచెస్ వీల్స్‌తో నడిచే ఈ స్కూటర్‌ని కేవలం 88 కిలోలు బరువుతో అందించడం విశేషం.

తక్కువ బరువు కలిగిన స్కూటర్ కొనాలని భావిస్తే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ స్కూటర్‌లో అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, 780 మిమీ ఎత్తున్న సీట్, 140 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. అలాగే ఇందులోని టెలిస్కోపిక్ ఫోర్క్, కాంటిలివర్డ్ మోనోషాక్ మంచి సస్పెన్షన్‌ని అందిస్తుంది. ఇక ముఖ్యంగా దీని బ్రేకింగ్ బేష్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ బైక్‌లో రెండు వైపులా డిస్క్ బ్రేక్స్‌ని అందించారు.
అయితే ఈ బైక్‌లో అండర్ సీట్ స్టోరేజ్ చాలా తక్కువ. కేవలం హాఫ్ ఫేస్ హెల్మెట్‌ని మాత్రమే ఇందులో అమర్చేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువ వెయిట్ లేకుండా స్కూటర్‌ని తీసుకువచ్చే క్రమంలో కొన్ని ఫీచర్లను కంపెనీ తగ్గించింది. ఇందులో రిమూవబుల్ 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలదు. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌పై 130 కిలోమీటర్ల (IDC) రేంజ్‌ని అందిస్తుందని KAW వెలోస్ మోటార్స్ తెలిపింది.

ఇందులోని 1.5 కిలోవాట్ల పవర్ అవుట్ పుట్‌ని అందించే హబ్ మోటార్‌ని అమర్చారు. ఇది గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అనుమతిస్తుంది. దీనిని 720 కిలోవాట్స్ ఛార్జర్‌తో బండిల్ ఆప్షన్‌తో వస్తుంది. దీని ద్వారా ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారు మూడు గంటలు పడుతుంది. ఈ స్కూటర్లో ఎల్ఈడీ లైట్స్, 5 ఇంచెస్ కలర్ TFT డ్యాష్‌బోర్ట్ స్మార్ట్ అనుభూతిని అందిస్తుంది.
ఈ స్కూటర్‌ని 5 డిగ్రీల సెల్సియస్ 45 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆపరేట్ చేయవచ్చు. ఈ స్కూటర్ మార్కెట్‌లో నేరుగా బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, విడా వి 1, ఏథర్ రిజ్టా వంటి స్కూటర్లకు పోటీని ఇస్తుంది. వీటితో పోల్చితే దీని ధర కాస్త ఎక్కువే. అంతే కాకుండా ఇవి పెద్ద బ్యాటరీ ఆప్షన్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








