సరికొత్త బజాజ్ సీఎన్‌జీ బైక్... తక్కువ ధరకు లభించే వేరియంట్ ఏదంటే?
బజాజ్ ఆటో ఎట్టకేలకు ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్‌జీ బైక్ 'ఫ్రీడమ్ 125' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ అత్యుత్తమ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ బైక్ 2 కేజీల సీఎన్‌జీ ట్యాంక్, 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ పొందుతుంది. ఇవి రెండూ కలిపి 330 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తాయని తెలుస్తోంది. ఈ కథనంలో బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ వేరియంట్స్ గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం..
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ డ్రమ్
బజాజ్ ఆటో లాంచ్ చేసిన సీఎన్‌జీ బైకులలో ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ డ్రమ్ అనేది ఎంట్రీ లెవెల్ మోడల్. దీని ధర రూ.95000 (ఎక్స్ షోరూమ్). ఇది హాలోజన్ హెడ్‌లైట్ మరియు ఫుల్ LCD కన్సోల్‌తో వస్తుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ ఆప్షన్ లేదు. బ్రేకింగ్ విధులు సీబీఎస్ (కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్)తో 130 మిమీ ఫ్రంట్ మరియు 110 మిమీ రియర్ డ్రమ్ బ్రేక్‌లచే నిర్వహించబడతాయి.

ఈ బైక్ ఇతర వేరియంట్‌ల మాదిరిగానే అదే 17 ఇంచెస్ ఫ్రంట్, 16 ఇంచెస్ రియర్ అల్లాయ్ వీల్స్ పొందుతాయి. కానీ డు చివర్లలో 80 సెక్షన్ టైర్‌లను పొందుతుంది. ఈ వేరియంట్ ట్యాంక్ కవర్ ఫ్లాప్‌ను కూడా కోల్పోతుంది. దీనికి షీట్ మెటల్ బాష్ ప్లేట్ ఉంది. ఇది రెండు రంగులలో మాత్రమే అందుబాటులో ఉంది. అవి ప్యూటర్ గ్రే/ఎల్లో మరియు ఎబోనీ బ్లాక్/రెడ్.
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ డ్రమ్ ఎల్ఈడీ
ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ డ్రమ్ ఎల్ఈడీ అనేది మిడ్ వేరియంట్. దీని ధర రూ. 105000 (ఎక్స్ షోరూమ్). ఇది ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్ (డేటైమ్ రన్నింగ్ లైట్స్) మరియు ట్యాంక్ కవర్ ఫ్లాప్‌తో వస్తుంది. ఇందులో కూడా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ ఆప్షన్ లేదు. అయితే పెరుగు తగ్గట్టుగానే ఇందుకు 130 మిమీ రియర్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ డ్రమ్ ఎల్ఈడీ వేరియంట్ ఘనమైన ప్లాస్టిక్ స్టీల్ బాష్ ప్లేట్ కలిగి ఉంది. ఈ వేరియంట్ మొత్తం ఐదు రంగులలో అందుబాటులో ఉంది. అవి కరేబియన్ బ్లూ, ఎబోనీ బ్లాక్ / గ్రే, ప్యూటర్ గ్రే / బ్లాక్, రేసింగ్ రెడ్ మరియు సైబర్ వైట్. ఇది ఐదు రంగులలో లభిస్తుంది కాబట్టి కస్టమర్ తనకు నచ్చిన కలర్ వేరియంట్ పొందవచ్చు.
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ డిస్క్ ఎల్ఈడీ
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ డిస్క్ ఎల్ఈడీ అనేది టాప్ వేరియంట్. ఇది దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 110000 (ఎక్స్ షోరూమ్). ఇది ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్‌తో అమర్చబడి ఉంటుంది. LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కాలర్ ఐడీ, మిస్డ్ కాల్ ఇండికేషన్ మరియు బ్యాటరీ లైఫ్‌తో కాల్ వార్ణింగ్ వంటి వాటి కోసం బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కలిగి ఉంది.

ఇది టాప్ వేరియంట్ కావడం వల్ల ఇందులో 240 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు 130 మిమీ రియర్ డ్రమ్ బ్రేక్ కలిగి ఉంది. ఇది 90 సెక్షన్ టైర్‌తో 17 ఇంచెస్ ఫ్రంట్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక 16 ఇంచెస్ అల్లాయ్ వీల్ 120 సెక్షన్ టైర్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది కూడా ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








