వరల్డ్ ఫస్ట్ సిఎన్‌జీ బైక్ డెలివరీ స్టార్ట్.. దేశ వ్యాప్తంగా బుకింగ్స్ షురూ!

సుదీర్ఘ కాలం నిరీక్షించిన తరువాత ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) గత కొన్ని రోజులకు ముందు ప్రపంచంలోనే మొట్ట మొదటి సిఎన్‌జీ బైక్ 'ఫ్రీడమ్ 125' (Freedom 125) లాంఛ్ చేసింది. కంపెనీ ఈ బైకును లాంచ్ చేయడానికి ముందే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారభించింది. అయితే బజాజ్ ఆటో తన సిఎన్‌జీ బైకును లాంచ్ చేసిన కొన్ని రోజులకే డెలివరీలు కూడా ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బజాజ్ కంపెనీ ఫ్రీడమ్ 125 బైకును లాంచ్ చేసిన రెండు వారాల తరువాత డెలివరీలను ప్రారంభించింది. ఫస్ట్ యూనిట్ డెలివరీను పూణేలో ప్రారంభించారు. కాగా కంపెనీ ఈ బైక్ కోసం దేశ వ్యాప్తంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి ఆసక్తి కలిగిన కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా వేగంగా జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ డెలివరీలు కేవలం పూణేలో మాత్రమే జరుగుతున్నాయి.

Bajaj Freedom 125 Deliveries Start

బజాజ్ ఆటో తన సిఎన్‌జీ బైకును డ్రమ్, డ్రమ్ ఎల్ఈడీ, డిస్క్ ఎల్ఈడీ అనే మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 95000, రూ. 1.05 లక్షలు మరియు రూ. 1.10 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఇవన్నీ చూడటానికి మంచి డిజైన్ కలిగి. ఉత్తమ ఫీచర్స్ పొందుతాయి. కాబట్టి ఇవి తప్పకుండా గణనీయమైన బుకింగ్స్ పొందుతాయని తెలుస్తోంది.

బజాజ్ యొక్క ఫ్రీడమ్ 125 బైక్ సీఎన్‌జీ ట్యాంక్ మరియు పెట్రోల్ ట్యాంక్ రెండూ పొందుతుంది. ఇందులో సీఎన్‌జీ ట్యాంక్ కెపాసిటీ రెండు కేజీలు, పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కూడా రెండు లీటర్లు మాత్రమే. పెట్రోల్ ద్వారా వంద కంటే ఎక్కువ కిమీ.. సీఎన్‌జీ ద్వారా రెండు వందల కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. మొత్తం మీద ఈ బైక్ 330 కిమీ మైలేజ్ అందిస్తుందని ధృవీకరించబడింది.

Bajaj Freedom 125

చూడటానికి ఇతర బైకుల మాదిరిగానే కనిపించే బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ పరిమాణం పరంగా కొంత పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే సీఎన్‌జీ ట్యాంక్ సీటు కింద అమర్చబడి ఉంటుంది. ఈ కారణంగానే ఇది కొంత ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని తెలుస్తోంది. ఈ బైక్ ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఫ్రీడమ్ 125 బైక్ లాంచ్ సమయంలో చెప్పినట్లు మొదటి డెలివరీలు మహారాష్ట్ర మరియు గుజరాత్ ప్రాంతాల్లో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. చెప్పినట్టుగానే ఈ బైక్ డెలివరీలు మొదలైపోయాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభమయ్యాయి. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. కాబట్టి ఇప్పుడు బుక్ చేసుకుంటే డెలివరీ ఆలస్యమవుతుందనే భావన గానీ సంకోచం గానీ అవసరం లేదు.

Bajaj Freedom 125

నిజానికి ప్రభుత్వం భారతదేశంలో ఫ్యూయెల్ వాహనాల వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీ తన వాహనాలను ఎలక్ట్రిక్ లేదా సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే బజాజ్ ఆటో తన సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసింది. టీవీఎస్ కంపెనీ కూడా సీఎన్‌జీ విభాగంలో స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, July 18, 2024, 15:30 [IST]
English summary
World first cng bike freedom 125 deliveries start and bookings open in pan india
Read more on: #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+