ప్రపంచంలో ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్ ఇదే! ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు

ద్విచక్ర వాహనాలను అనేక రకాలుగా ఉపయోగిస్తున్న సంగతి అందరికి తెలుసు. అయితే ఇవన్నీ లిమిటెడ్ లోడ్ కెపాసిటీ కలిగి ఉంటాయి. కానీ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్గో టూ వీలర్ (Cargo Two-Wheeler) ఇప్పటివరకు ఉన్నవాటికంటే భిన్నంగా ఉంటుంది.

సాధారణంగా ఒక స్కూటర్ లేదా బైకులో లగేజ్ తక్కువగానే తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టూ వీలర్ ద్వారా ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలి అనేది అసాధ్యమైన విషయమే. కానీ దీన్ని సాధ్యం చేయడానికి 'కార్గోస్' (Qargos) సంస్థ ఓ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కార్గో టూ వీలర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ టూ వీలర్ ఎక్కువ లగేజీని ఒకేసారి తీసుకెళ్లాడనికి అనుమతిస్తుంది. తద్వారా డెలివరీ సమస్యలు తీరుతాయి.

Worlds First Electric Cargo Scooter Spied

పూణేకు చెందిన స్టార్టప్ కంపెనీ 'కార్గోస్' లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్ ప్రస్తుతం అభివృద్ధి చివరి దశలో ఉంది. కంపెనీ గత ఆరు సంవత్సరాల నుంచి ఈ వెహికల్ తయారు చేయడానికి శ్రమిస్తూనే ఉంది. కాగా ఈ స్కూటర్ ఉత్పత్తి ప్రస్తుతం ఇప్పుడు చివరి దశకు చేరింది. కంపెనీ దీన్ని పలు విధాలుగా టెస్ట్ చేస్తూ అవసరమైన సవరణలు చేయడానికి పూనుకుంది.

విడుదలకు సిద్దమవుతున్న ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్లో ఫ్రెంచ్ కంపెనీ అయిన 'డయాల్స్ సిస్టమ్' రూపొందించిన 6.1 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉపయోగించారు. ఈ బ్యాటరీ 3.4 కిలోవాట్ మోటారుకు జతచేయబడి మంచి పనితీరుని అందిస్తుంది. సుమారు 145 కేజీల బరువున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 225 లీటర్ల కంపార్ట్‌మెంట్‌ కలిగి.. ఒకే సారి 120 కేజీల సరుకులను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది.

qargos

రేంజ్ లేదా పరిధి

150 కిమీ రేంజ్ అందించే కార్గో ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిమీ కావడం గమనార్హం. ఈ స్కూటర్ స్టాండర్డ్ AC పవర్ సాకేట్ పొందుతుంది. దీంతో ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటల 15 నిముషాలు. అయితే ఈ ఛార్జింగ్ సమయాన్ని 3 గంటలకు తగ్గించడానికి సంస్థ DC ఛార్జింగ్ క్యాపబిలిటీని కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతోంది.

సాధారణ టూ వీలర్లతో పోలిస్తే ఈ కార్గో ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు రేట్లు ఎక్కువ లగేజ్ ఒకేసారి తీసుకెళ్లడానికి అనుమతిస్తుంది. కాబట్టి డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఇప్పుడు భారీ బ్యాగులను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నిజానికి ఒక బ్యాగులో అన్ని వస్తువులను వేసుకుంటే అవసరమైన వస్తువును గుర్తించడానికి కొంత సమయం పడుతుంది, కానీ ఈ బైక్ కంపార్ట్‌మెంట్‌లో అలాంటి వస్తువులను గుర్తించడం చాలా సులభం.

ఇక్కడ కనిపించే కార్గో ఎలక్ట్రిక్ బైకు కంపార్ట్‌మెంట్‌ను లాక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇందులోని వస్తువులు దొంగలు తీసుకెళ్తారనే భయం అవసరం లేదు. అన్ని విధాలా చాలా ఉపయోగకరంగా ఉండే ఈ బైక్ టెస్టింగ్ మరియు ధ్రువీకరణ త్వరలోనే పూర్తవుతుందని, త్వరలోనే ఈ స్కూటర్ కోసం కంపెనీ బుకింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్ లాంచ్ ఎప్పుడనేది కంపెనీ త్వరలోనే వెల్లడిస్తుంది.

అంచనా ధర

కార్గోస్ కంపెనీ కార్గో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 2 లక్షల ధర వద్ద లాంచ్ చేసే అవకాశం ఉంది. సంస్థ ఈ ఏడాది చివరి నాటికి 250 యూనిట్లను.. భవిష్యత్తులో డిమాండ్ పెరిగితే.. 2025లో 12000 యూనిట్లను ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. సంస్థ రాబోయే ఈ కార్గో స్కూటర్‌ను పూణేలోని కంపెనీ పెసిలిటీలో ఉత్పత్తి చేయనుంది. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కార్గోస్ కంపెనీ ఇప్పటి వరకు కార్గో ఎలక్ట్రిక్ టూ వీలర్ ప్రాజెక్టు కోసం 1 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఇంకా ఉత్పత్తి మరియు మార్కెటింగ్ కోసం మరింత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో కంపెనీ చిన్న కంపార్ట్‌మెంట్‌లను కలిగిన రెండు సీట్ల ఎలక్ట్రిక్ వెర్షన్ అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

Source

More from DriveSpark

Article Published On: Wednesday, February 14, 2024, 12:45 [IST]
English summary
World first electric cargo scooter expected price and range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+