యమహా నుంచి FZ X Chrome ఎడిషన్‌ లాంచ్‌.. మొదటి 100 కస్టమర్లకు అదిరిపోయే వాచ్‌ గిఫ్ట్‌, త్వరపడండి.!!

భారత మార్కెట్లో యమహా మోటార్స్‌ కొత్త FZ-X క్రోమ్ ఎడిషన్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దీంతో పాటు కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ కూడా అందించింది. ఈ బైక్‌ను కొనుగోలు చేసే మొదటి 100 మంది కస్టమర్లు కొత్త Casio G-Shock వాచ్‌ని గిఫ్ట్‌గా పొందవచ్చు. కొత్త Yamaha FZ-X Chrome ధర, ఫీచర్లు, డిజైన్ పూర్తి వివరాలు ఈ కథనంలో..

Yamaha FZ-X Chrome యమహా మోటార్స్‌ రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. Yamaha FZ-X Chrome మెటాలిక్ బ్లాక్ కలర్ వేరియంట్ రూ. 1,36,200 ధర వద్ద అందుబాటులో ఉంది. కాగా మొదటి 100 యూనిట్ల Casio G-Shock వాచీలు Yamaha FZ-X Chrome ఎడిషన్ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేసే కస్టమర్లకు సంబంధిత డీలర్‌షిప్‌ల వద్ద డెలివరీ సమయంలో మొదటి అందజేస్తారు.

Yamaha-FZ-X-Chrome-Edition-Launch

ఇక Yamaha FZ-X Chrome ను సంస్థ కొత్త కలర్ స్కీమ్‌తో పరిచయం చేసినప్పటికీ, FZ-X దాని అసలు డిజైన్, ఫీచర్లు మరియు కొలతలను అలాగే కలిగి ఉంది. పెద్దగా మార్పులు ఏమీ కనబడవు. ఇంజిన్‌ విషయానికొస్తే ఇందులో అదే పవర్‌ట్రెయిన్‌ 149 cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. 12.4bhp మరియు 13.3Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్మూత్-షిఫ్టింగ్ ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

కాగా ఈ కొత్త Yamaha FZ-X క్రోమ్‌ ఎడిషన్‌(Yamaha FZ-X Chrome Launch)లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), ముందు భాగంలో సింగిల్-ఛానల్ ABS, మెరుగైన భద్రత కోసం వెనుక డిస్క్ బ్రేక్ మరియు మల్టీ-ఫంక్షన్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా దాని ఫీచర్ల శ్రేణితో వస్తుంది. సులభంగా యాక్సెస్‌ చేసుకునే ఫెసిలిటీని రైడర్లకు అందిస్తుంది.

Yamaha-FZ-X-Metallic-Black

అదనంగా, Yamaha FZ-X Chrome మోటారుసైకిల్‌లో రౌండ్ LED హెడ్‌లైట్, వెనుక మడ్‌గార్డ్, లోయర్ ఇంజిన్ గార్డ్ మరియు బ్లూటూత్‌తో కనెక్ట్‌ చేసుకునే Y-కనెక్ట్ యాప్, ఇంకా యువ రైడర్ల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇందులో అదిరిపోయే ఫీచర్లను అందించారు.

సస్పెన్షన్ సెటప్ పరంగా, FZ-X క్రోమ్‌ ఎడిషన్‌ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు మరియు వెనుక వైపున 7-దశల సర్దుబాటు మోనోక్రాస్ యూనిట్ కలిగి ఉంటుంది. ఇది రైడర్లకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు మంచి రైడింగ్ అనుభూతిని ఇస్తుంది.

బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే ABSతో 282 mm ఫ్రంట్ డిస్క్ మరియు వెనుక చక్రం వద్ద 220 mm డిస్క్‌తో వస్తుంది. దీని ద్వారా రైడర్లు అత్యుత్తమ స్టాపింగ్ పవర్‌ను పొందవచ్చు. అంతేకాకుండా, ఈ మోడల్ E20 ఇంధనానికి అనుకూలంగా ఉండటమే కాకుండా.. స్టెబిలిటీ పట్ల యమహా నిబద్ధతను ప్రదర్శిస్తోందని సంస్థ వెల్లడించింది.

యమహా FZ-X క్రోమ్ ఎడిషన్‌ను ఆకట్టుకునే ప్రారంభ బర్డ్ ఆఫర్‌తో పాటు లాంచ్ చేయడంతో యువ రైడర్లను విపరీతంగా ఆకట్టుకునేందుకు యత్నిస్తోంది. ఆకర్షణీయమైన ఫీచర్లు, స్టైలిష్‌ డిజైన్‌తో కలిగి ఉన్న బైక్‌ను సొంతం చేసుకోవాలనుకునేవారు దీనిపై ఓ లుక్కేయండి. ఇక మొదటి 100 కస్టమర్లలో మీరూ ఉన్నట్లయితే స్టైలిష్ క్యాసియో G-షాక్ వాచ్‌ మీ సొంతం.

More from DriveSpark

Article Published On: Wednesday, February 7, 2024, 18:33 [IST]
English summary
Yamaha fz x chrome edition launched casio g shock watch for first 100 customers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+