ఆ కంపెనీ టూవీలర్స్‌పై బంపర్‌ ఆఫర్‌.. అస్సలు మిస్‌ చేసుకోకండి.. కేవలం రూ. 2,999 కట్టండి ఇంటికి పట్టుకెళ్లండి!

పండుగ సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే ప్రముఖ వాహన తయారీ సంస్థలు డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగానే జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా దేశంలో కస్టమర్లను ఆకర్షించేలా సరికొత్త స్కీమ్స్‌ని ప్రారంభించింది. యమహా టూవీలర్స్‌లోని పాపులర్ 150 సీసీ FZ సిరీస్ మోటార్‌ సైకిల్స్‌, అలాగే 125 సీసీ Fi హైబ్రిడ్ స్కూటర్లపై క్యాష్ బ్యాక్‌తో పాటు తక్కువ డౌన్ పేమెంట్ ఆప్షన్‌లతో ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ పండుగ సీజన్‌లో సేల్స్‌ పెంచుకునేందుకు యమహా అందిస్తున్న పండుగ సీజన్ ఆఫర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

యమహా ప్రస్తుతం FZ సిరీస్‌పై రూ .7,000 వరకు క్యాష్‌బ్యాక్‌ని అందిస్తోంది. FZ-S Fi వెర్షన్ 4.0, FZ-S Fi వెర్షన్ 3.0, FZ-S Fi ఉన్నాయి. ఈ క్యాష్‌బ్యాక్ ద్వారా ఆదా అయిన డబ్బుతో కస్టమర్లు కంపెనీ ప్రొవైడ్‌ చేసే క్వాలిటీ హెల్మెట్లు, ఇతర కాస్మోటిక్స్‌ కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా కేవలం రూ .7,999 డౌన్‌ పేమెంట్‌ చెల్లిస్తే సరిపోతుంది.

Yamaha FZ Series Festive Offers

మార్కెట్‌లో చాలా పాపులర్‌గా ఉన్న ఈ మోటార్ సైకిల్స్‌ ఇంత తక్కువ డౌన్‌ పేమెంట్‌తో అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ఈ పండుగ సీజన్‌లో కస్టమర్ల ఆర్థిక భారాన్ని తగ్గించాలని లక్ష్యంతో డౌన్‌ పేమెంట్‌ని తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. యమహా FZ- S Fi V4 ధర రూ.1.29 లక్షలు, అలాగే వెర్షన్ 3 ధర రూ .1.06 లక్షలు (ఎక్స్‌-షోరూమ్)గా ఉంది.

ఇక ఈ కంపెనీ స్కూటర్లను ఇష్టపడేవారికి ఫాసినో 125 Fi హైబ్రిడ్, RayZR 125 Fi హైబ్రిడ్ వంటి హైబ్రిడ్ స్కూటర్లపై కూడా ప్రత్యేక ఆఫర్‌ని అందిస్తుంది. వీటి కొనుగోళ్లపై రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే కేవలం రూ.2,999 డౌన్ పేమెంట్ చెల్లించి ఈ స్కూటర్లను ఇంటికి తీసుకెళ్లవచ్చు.

Yamaha RayZR Festive Offers

ప్రస్తుతం RayZR 125 Fi హైబ్రిడ్ ధర రూ.85,030 గా ఉంది. అలాగే ఫాసినో 125 Fi హైబ్రిడ్ ధర రూ.79,900 నుంచి ప్రారంభమవుతాయి. ఈ తగ్గింపు యమహా పోర్ట్ ఫోలియో విస్తరణకు దోహదపడనుంది. యమహా FZ-సిరీస్ మోటార్‌సైకిల్స్‌ గత కొంతకాలంగా భారత మార్కెట్‌లో దుమ్మురేపుతున్నాయి. సకాలంలో అప్‌డేట్స్ ద్వారా ఈ సిరీస్ స్థిరమైన అమ్మకాలను సాధించగలిగింది.

స్టైలిష్ డిజైన్, 149 సీసీ ఇంజిన్లలోనే ఈ బైకులు సరికొత్త స్టైలింగ్‌ని కలిగి ఉన్నాయి. ఇది 149 సీసీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 12 bhp పవర్‌ని 13.3 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. డిస్క్ బ్రేక్స్‌ స్టాపింగ్ డ్యూటీని సమర్థవంతంగా నిర్వహిస్తాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్‌, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్‌తో వస్తుంది.

Yamaha Fascino Festive Offers

ఇక యమహా RayZR 125 Fi హైబ్రిడ్ స్కూటర్‌ విషయానికి వస్తే ఇది ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ (Fi), 125 సీసీ బ్లూ-కోర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8.2 bhp పవర్, 10.3 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ హైబ్రిడ్ సిస్టమ్‌ కలిగిన స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) సిస్టమ్‌తో వస్తుంది.

ఇక యమహా ఫాసినో 125 Fi హైబ్రిడ్ స్కూటర్‌ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ (Fi) 125 సీసీ పవర్‌ట్రైన్‌తో పనిచేస్తుంది. ఇందులోనూ యమహా బ్లూ-కోర్ ఇంజిన్ టెక్నాలజీ కలదు. ఈ ఇంజిన్ గరిష్టంగా 8.2 bhp పవర్, 10.3 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోనూ స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) సిస్టమ్ ఉంది. ఈ రెండు స్కూటర్లు 58 నుంచి 66 కి.మీ మైలేజీని ఇస్తాయి.

More from DriveSpark

Article Published On: Thursday, September 26, 2024, 16:50 [IST]
English summary
Yamaha india special festive offers on fz series and fascino ray zr scooters
Read more on: #yamaha #diwali #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+