మరింత కలర్‌ఫుల్‌గా యమహా FZ-S Fi ఎడిషన్ 4.0 DLX.. కొత్త కలర్స్, ధర వివరాలివే.??

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ యమహా మోటార్స్.. 'ది కాల్ ఆఫ్ ది బ్లూ' బ్రాండ్ ప్రచారంతో పాటు, యువ రైడర్‌ల కోసం దాని ప్రసిద్ధ స్ట్రీట్ ఫైటర్ మోడల్ లో సరికొత్త మార్పులు చేసింది. యువ రైడర్ల అభిరుచికి అనుగుణంగా సరికొత్త కలర్స్‌లో ఈ బైక్‌ను పరిచయం చేసింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

FZ-S Fi ఎడిషన్ 4.0 DLX మోడల్ కోసం కొత్త ఐస్ ఫ్లూ-వెర్మిలియన్ మరియు సైబర్ గ్రీన్ రంగులను పరిచయం చేసింది. వీటి ధర రూ. 1,29,700/- (ఎక్స్-షోరూమ్) గా ఉంది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఈ రెండు వైబ్రెంట్ కలర్స్‌ను ఆకర్షణీయంగా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.

Yamaha-FZS-FI-Edition-DLX

ఈ రెండు కొత్త కలర్స్ పరిచయంతో FZ-S Fi ఎడిషన్ 4.0 DLX బైక్ మొత్తం ఆరు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. తాజా ఐస్ ఫ్లూ-వెర్మిలియన్, సైబర్ గ్రీన్, స్ట్రైకింగ్ మెజెస్టి రెడ్, రేసింగ్ బ్లూ మరియు క్లాసిక్ ఆప్షన్ - మ్యాట్ బ్లాక్ & క్రోమ్ గ్రే వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

యమహా యొక్క ఐకానిక్ FZ సిరీస్‌లో భాగంగా, FZ-S Fi ఎడిషన్ 4.0 DLX దాని 149cc ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్‌తో ప్రత్యేకంగా కనిపిస్తుంది. బైక్‌లోని మోనోక్రాస్ సస్పెన్షన్ బ్రేకింగ్ సమయంలో అద్భుతమైన పనితీరు మరియు స్థిరత్వాన్ని అందించడంతో రైడర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సింగిల్ ఛానల్ ABSతో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉండటం వల్ల జారే రోడ్లపై కూడా మీకు మరింత పట్టును, నియంత్రణను అందిస్తుంది.

Yamaha-FZS-FI-Edition-DLX

FZ-S Fi ఎడిషన్ 4.0 DLX బైక్‌లో బ్లూటూత్ యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. e20 అనుకూల బైక్ డిజైన్‌లో భాగంగా క్లాస్ D హెడ్‌లైట్, LED ఫ్లాషర్ మరియు LED టెయిల్-లైట్ ను చూడవచ్చు. క్రోమ్ డక్ట్ ప్లేటింగ్ మరియు 3D లోగో, ఆకర్షణీయమైన కలర్స్ వీల్స్, రెండు-దశల సీటు, 135 కిలోల తేలికపాటి బరువుతో రైడర్‌కు మంచి రైడింగ్ అనుభూతిని ఇస్తుంది.

FZ-S Fi ఎడిషన్ 4.0 DLX బైక్ కొత్త రంగుల పరిచయంపై యమహా మోటార్ ఇండియా ప్రెసిడెంట్ ఐషిన్ చిహానా మాట్లాడారు. ప్రస్తుత తరం యువ రైడర్లు.. కేవలం రవాణా కోసం మాత్రమే కాకుండా వారి జీవన శైలికి అనుగుణంగా బైక్, వాటిలో కలర్స్ ఎంచుకుంటున్నారని గమనించినట్లు చెప్పారు. వారి అభిరుచులు మరియు ప్రాధాన్యతలు విభిన్నంగా ఉంటున్నాయని పేర్కొన్నారు.

Yamaha-FZS-FI-Edition-DLX

అంతేకాకుండా భారత యువత కొత్త కలర్ ట్రెండ్‌ని చాలా దగ్గరగా అనుసరిస్తూ తమ వ్యక్తిత్వంతో దాన్ని అనుసంధానం చేసుకుంటున్నారని వెల్లడించారు. ఈ స్థిరమైన మార్పు దేశంలో నూతన ఆవిష్కరణలకు శక్తిని ఇస్తుందని స్పష్టం చేశారు. వారి అభిరుచి, అంచనాలను అందుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

FZS-FI DLX పోర్ట్‌ఫోలియోలో ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌ల పరిచయంతో, యమహా బ్రాండ్ మరియు ఆఫర్‌లను ఎల్లప్పుడూ కస్టమర్లకు నిత్యం అందుబాటులో ఉంచుతుందని ఐషిన్ చిహానా అన్నారు. వారి అభిరుచికి అనుగుణంగా తమ ఉత్పత్తులను అప్‌డేట్ చేయడానికి, మెరుగుపరచడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 8, 2024, 19:13 [IST]
English summary
Yamaha introduced vibrant colours in fzs fi edition 4 0 dlx check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+