Yamaha NMax 155 యమహా నుంచి మరో కొత్త మ్యాక్సీ స్కూటర్‌.. మతి పోగొట్టే ప్రీమియం డిజైన్‌, ఫీచర్లు

ఇటీవల జరిగిన భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2024లో యమహా(Yamaha) తన కొత్త NMax 155 టూ వీలర్‌ను ఆవిష్కరించి.. స్కూటర్‌ ప్రియుల్లో ఆసక్తిని కలిగించింది. ఈ కొత్త మ్యాక్సీ స్కూటర్‌ను యమహా ఏరోక్స్‌ 155 మ్యాక్సీ స్కూటర్‌ ఆధారంగా రూపొందించారు. స్పోర్టియర్‌ డిజైన్‌, అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్‌ను సంస్థ పరిచయం చేసింది.

ప్రీమియం ఫీచర్లతో తన స్కూటర్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందకు యమహా యత్నిస్తోంది. ఈ క్రమంలో యమహా తాజాగా ప్రదర్శించిన ఫుల్‌ సైజ్‌ మ్యాక్సీ స్కూటర్‌ NMax 155 భారీ అంచనాలను కలిగిస్తోంది. డిజైన్‌ పరంగా ఈ స్టైలిష్‌ స్కూటర్‌.. పెద్ద ఫ్రంట్ ఫెయిరింగ్ మరియు డ్యూయల్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉండగా.. ఇది ఇంటిగ్రేటెడ్ విండ్‌స్క్రీన్‌తో వస్తుంది.

Yamaha-NMax-155

దీని వల్ల NMax 155 స్కూటర్‌(Yamaha Maxi NMax 155 Scooter) మరింత స్పోర్టీ లుక్‌తో పాటు మెరుగైన ఏరోడైనమిక్స్‌ను కలిగి ఉంటుంది. ఎలిమెంట్ స్టెప్డ్ సీటును పొందుపరచడం ద్వారా.. రైడర్ మరియు పిలియన్ ఇద్దరికీ మరింత సౌకర్యంగా ఉండటంతో పాటు మంచి రైడింగ్‌ అనుభూతిని కలిగిస్తుంది.

ఫీచర్ల పరంగా యమహా NMax 155 మ్యాక్సీ స్కూటర్‌ మరింత టెక్నాలజీ, కనెక్టివిటీని అందిపుచ్చుకుంది. NMax 155 Yamaha యొక్క MyRide యాప్‌కు అనుకూలమైన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కస్టమర్లు పొందుతారు. ఈ ఇంటిగ్రేషన్ బ్లూటూత్ కనెక్టివిటీని అందించడం కారణంగా.. రైడర్‌లు వారి స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ స్థాయిని స్కూటర్ డిస్‌ప్లే నుండి నేరుగా పర్యవేక్షించవచ్చు. ఇంకా ఇమెయిల్, కాల్ మరియు టెక్స్ట్ హెచ్చరికలను ప్రదర్శిస్తుంది.

యమహా ప్రవేశపెట్టిన కొత్త మ్యాక్సీ NMax 155 స్కూటర్‌ 155cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ 15 BHP మరియు 14 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రైడర్లకు ఇంజిన్‌ ఫంక్షన్‌ను సులభతరం చేసేందుకు స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌ను కలిగి ఉంటుంది.

ఇక కొత్త యమహా మ్యాక్సీ స్కూటర్ NMax 155 V-బెల్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. దీని ద్వారా రైడర్‌కు సేఫ్‌ రైడింగ్‌తో పాటు మంచి రైడింగ్‌ అనుభవాన్ని అందిస్తుందని సంస్థ తెలిపింది. పట్టణంలో ప్రయాణాలతో పాటు లాంగ్‌ జర్నీల్లో కూడా విసుగు లేని రైడింగ్‌ అనుభూతిని ఇస్తుందని సంస్థ వెల్లడించింది.

భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పోలో యమహా NMax 155 యొక్క సామర్థ్యాలు మరియు ఫీచర్లను ప్రదర్శించినప్పటికీ.. ఈ మ్యాక్సీ స్కూటర్‌ అధికారిక ప్రారంభ తేదీ గురించి ప్రకటించలేదు. ఈ సంవత్సరం చివర్లో భారత మార్కెట్లో(Yamaha NMax 155 Launch Date) ఈ స్కూటర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Yamaha Maxi Scooter NMax 155 అధునాతన ఫీచర్లు, స్పోర్టీ లుక్‌, అద్భుతమైన పనితీరు, కనెక్టివిటీ ఆధారంగా ప్రీమియం స్కూటర్‌ విభాగంలో తన ఉనికిని చాటుకునేందుకు యమహా యత్నిస్తోంది. భారత మార్కెట్లో స్కూటర్లకు డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంది. ఈ పోటీత్వ మార్కెట్లో ఈ ప్రీమియం స్కూటర్‌ ఎలా రాణిస్తుందో చూడాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 7, 2024, 14:29 [IST]
English summary
Yamaha launched nmax 155 maxi scooter with premium features at bharat mobility global expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+