యమహా నుంచి త్వరలో విడుదల కానున్న రెండు స్కూటర్లు.. మార్కెట్‌ని శాసించే అవకాశం!!
యమహా ఎన్‌మాక్స్ 155 మరియు గ్రాండ్ ఫిలానో స్కూటర్‌లను విడుదల చేయనుంది. దీనితో కలిపి ప్రస్తుతం దేశంలో ఈ సంస్థ మూడు స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిలో రెండు స్కూటర్‌లు 125సీసీ మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. అవి ఫాసినో క్లాసిక్ స్కూటర్ మరియు రేజెడ్ఆర్ స్పోర్టీ స్కూటర్. మరో స్కూటర్ ఏరోక్స్ 155.
యమహా యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ R15 లిక్విడ్-కూల్డ్ పవర్‌ట్రెయిన్‌తో ఏరోక్స్ 155 పాలుపంచుకుంటుంది. అయితే ఇటీవల భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో యమహా రెండు కొత్త స్కూటర్లను ప్రదర్శించింది. గ్రాండ్ ఫిలానో 125సీసీ మరియు ఎన్‌మాక్స్ 155సీసీ స్కూటర్లు ఎక్స్‌పోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గ్రాండ్ ఫిలానో మరియు ఎన్‌మాక్స్ 155 లపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.

గ్రాండ్ ఫిలానో మరియు ఫాసినో రెండూ క్లాసిక్ స్కూటర్ నియో-రెట్రో డిజైన్ థీమ్‌ను కలిగి ఉండనున్నాయి. రెండు స్కూటర్లు క్లాసీ లుక్‌తో సంస్థ తీసుకువస్తుంది. ఫాసినో మరియు గ్రాండ్ ఫిలానోలు 125cc ఇంజిన్‌తో పనిచేస్తాయి. అంతే కాకుండా (8.2 PS వద్ద 10.3 Nm) టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి.
ఈ స్కూటర్లలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, 90/90-12 ట్యూబ్‌లెస్ టైర్‌తో 12-అంగుళాల అల్లాయ్ వీల్, 110/90-10 టైర్‌తో వెనుక 10-అంగుళాల అల్లాయ్ వీల్‌తో రానుంది. స్వింగార్మ్-మౌంటెడ్ రియర్ సస్పెన్షన్ కూడా అందిస్తోంది. ఇందులో ఆప్షనల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది మరియు ఫాసినో కేవలం 99 కిలోల బరువుని కలిగి ఉంది.

గ్రాండ్ ఫిలానో స్కూటర్ పూర్తిగా ఫాసినోకి అప్‌గ్రేడ్ వెర్షన్ ని పోలినట్లు ఉంటుంది. ఫిలానోలో అదనపు స్మార్ట్ ఫీచర్లు మరియు డిజైన్‌లో కొన్ని మార్పులు మాత్రమే చేయబడ్డాయి. ఫాసినోను పోలినట్లు ఉండే ఈ స్కూటర్ కస్టమర్లకు అమితంగా నచ్చే అవకాశం ఉంది. అలాగే ఎన్‌మాక్స్ కొద్దిగా ఢిపరెంట్ లుక్‌తో దర్శనమివ్వనుంది.
గ్రాండ్ ఫిలానో TFT స్క్రీన్, హజార్డ్ లైట్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఆప్రాన్ వెనుక ఫ్రంట్ స్టోరేజ్, స్మార్ట్ కీతో కీలెస్ స్టార్ట్ మరియు ఫాసినో లేని ఇతర ఫీచర్లతో పాటు అప్‌గ్రేడెడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. యమహా 125సీసీ ప్రీమియం స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుండటంతో గ్రాండ్ ఫిలానోను త్వరలోనే భారతీయ మార్కెట్‌లో విడుదలచేసే అవకాశం ఉంది. యమహా ఎన్‌మాక్స్ 155 ఆ తర్వాత భారత్‌లో అరంగేట్రం చేయనుంది.

Nmax 155 ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. ఇది ఒక మ్యాక్సీ స్కూటర్‌గా కనిపిస్తుంది. Yamaha Nmax 155 మరియు Aerox 155 రెండూ R15 మోటార్‌సైకిల్ ఉపయోగిస్తున్న 155cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. 155cc యూనిట్ లిక్విడ్ కూలింగ్ హార్డ్‌వేర్, DOHC సెటప్, 4V హెడ్, యమహా యొక్క ప్రఖ్యాత VVA (వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్) వంటివి గమనించవచ్చు.
ఇది 14.75 bhp వద్ద 13.9 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. యమహా ఈ స్కూటర్లు భారత్‌లో ప్రీమియం స్కూటర్లుగా గట్టిపోటినిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం, యమహా యొక్క 155cc స్కూటర్‌లు అప్రిలియా SXR 160 ప్రత్యర్థి స్కూటర్‌గా ఉండనుంది. మార్కెట్‌లో యమహా బ్రాండ్‌కి ఉన్న క్రేజ్ ఆధారంగా ఈ స్కూటర్లు కూడా త్వరలోనే మంచి హిట్ సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








