ఈ యమహా స్కూటర్లలో ప్లాబ్లమ్.. కంపెనీ చరిత్రలో అతిపెద్ద రీకాల్!

అద్భుతమైన టూ వీలర్స్ ప్రవేశపెడుతూ, అత్యుత్తమ అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న యమహా (Yamaha) ఇప్పుడు ఏకంగా 3 లక్షల స్కూటర్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ ఏ మోడల్స్‌కు రీకాల్ ప్రకటించింది? రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం ఏంటని.. ఈ కథనంలో చూసేద్దాం..

దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన యమహా కంపెనీ ఇప్పుడు తన 'రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ' (Ray ZR Fi) మరియు ఫాసినో 125 ఎఫ్ఐ (Fascino 125 Fi) స్కూటర్లకు రీకాల్ ప్రకటించింది. 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 4 మధ్యలో తయారైన ఈ మోడల్స్‌లో బ్రేక్ లివర్ ఫంక్షన్‌లో సమస్యను పరిష్కరించడానికి ఈ రీకాల్ ప్రకటించినట్లు స్పష్టమవుతోంది.

Yamaha Fascino 125 FI

ఇప్పటి వరకు కంపెనీ యొక్క ఈ స్కూటర్లలో సమస్య ఉన్నట్లు ఎవరూ కంప్లైంట్ చేయనప్పటికీ యమహా స్వచ్చందంగా రీకాల్ ప్రకటించి సమస్యను పరిష్కరించడానికి సన్నద్ధమైంది. ఈ సమస్యను స్కూటర్లలో గుర్తించి కావాల్సిన పరికరాలను ఉచితంగా కంపెనీ రీప్లేస్ చేస్తుంది. దీనికోసం కస్టమర్ లేదా వినియోగదారుడు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. రీకాల్ కోసం వినియోగదారుడు యమహా మోటార్ అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.

వినియోగదారుడు తన స్కూటర్లో సమస్యను పరిష్కరించుకోవడం కోసం సమీపంలోని యమహా సర్వీస్ సెంటర్‌ను సందర్శించవచ్చు, లేదా యమహా మోటార్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్ 18004201600 కు కాల్ చేసి కావలసిన వివరాలు వివరంగా తెలుసుకోవచ్చు. కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని యమహా సంస్థ ఈ రీకాల్ ప్రకటించింది. అంతే కాకుండా త్వరలోనే ఈ సమస్యను ఉచితంగానే పరిష్కరిస్తుంది.

Yamaha RayZR 125 FI

నిజానికి యమహా కంపెనీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఇంత పెద్ద రీకాల్ ప్రకటించలేదు. రెండు స్కూటర్లలో సమస్యను పరిష్కరించడానికి 300000 యూనిట్లకు రీకాల్ ప్రకటించడం ఇదే మొదటి సారి. అయితే ఇప్పటి వరకు గతంలో కంపెనీ 63977 యూనిట్లకు రీకాల్ ప్రకటించింది. దీంతో యమహా రీకాల్స్ సంఖ్య 363977 యూనిట్లకు చేరింది. ఇప్పటి వరకు ఎక్కువ రీకాల్ ప్రకటించిన కంపెనీల జాబితాలో హోండా మోటార్‌సైకిల్ మొదటి స్థానం స్థానంలో ఉంది.

దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న యమహా రే జెడ్ఆర్ 125 మరియు ఫాసినో 125 మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందాయి. ధరల విషయానికి వస్తే.. రే జెడ్ఆర్ 125 డ్రమ్ మరియు డిస్క్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ.73330 మరియు రూ.76330. ఫాసినో 125 ధరల విషయానికి వస్తే రూ.72030 (డ్రమ్ వేరియంట్) రూ.74530 (డిస్క్ వేరియంట్).

యమహా కంపెనీ భారతీయ విఫణిలో ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరించడంతో భాగంగా కొత్త బైకులు, స్కూటర్లు లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో వేదికపై యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైకును కొత్త కలర్ ఆప్షన్లలో ఆవిష్కరించింది. చూడటానికి చాలా ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొంది ఉన్నట్లు.. ఇంజిన్ మరియు పనితీరు పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుందని సమాచారం.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, February 17, 2024, 14:00 [IST]
English summary
Yamaha recalled 3 lakh units of ray zr and fascino scooters
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+