యహహా RX100 బైక్‌ నుంచి కీలక అప్‌డేట్‌.. అందుకే బైక్‌ లాంచ్‌ ఆలస్యం

మన దేశంలో RX100కి క్రేజ్ ఎక్కువ. అప్పుడప్పుడు ఈ బైక్స్‌ రోడ్లపై కనిపిస్తాయి. 90'sలో ఈ బైక్స్‌ కొన్ని రోజులు టూ-వీలర్‌ మార్కెట్‌ని శాసించాయనే చెప్పాలి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంటే కూడా యువత దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు కూడా మార్కెట్‌లో వందలాది అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అయినా కానీ యమహా ఆర్ఎక్స్ 100 కోసం ఎంతో మంది వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ బైక్‌ మళ్లీ రాబోతుందని పుకార్లు వచ్చాయి. కొన్ని నెలల క్రితం దీనికి సంబంధించి కంపెనీ సూత్రపాయంగా లీక్‌లను కూడా అందించింది. దీంతో RX100 మళ్లీ రోడ్లపై సందడి చేయనుందని అంతా భావిస్తున్నారు.

అయితే తాజాగా ఆ కంపెనీ ఇండియా ప్రెసిడెంట్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక విషయాలను వెళ్లడించాడు. దీంతో అతని మాటలకు యమహా RX100 అమ్మకానికి వస్తుందా అనే సందేహం కలుగుతోంది. ఈ బైక్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఇది పెద్ద భారీ షాక్ అని చెప్పవచ్చు. అసలు ఆయన ఏం చెప్పాడు. నిజంగా RX100 విడుదల ఉందా? లేదా అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.

Yamaha-RX-100-Re-Launch
ఆర్ఎక్స్ 100 విడుదల తేదీ ఇప్పుడు అనే విషయాన్ని మోటారుసైకిల్ ప్రేమికులు ఎక్కువగా ఇంటర్‌నెట్‌లో వెతికారు. దీని ప్రకారం ఔత్సాహికులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుంది. తాజాగా దీనిపై యమహా ఇండియా ప్రెసిడెంట్ ఎషిన్ చిహానా మాట్లాడుతూ.. ఆర్ఎక్స్ 100 కోసం యమహా ప్రధాన అప్‌గ్రేడ్‌ సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. అయితే ఈ బైక్‌ని అభివృద్ధి చేసే పనిలో కంపెనీ ఉందని ఆయన ధృవీకరించారు.

ప్రస్తుతం ఈ బైక్‌ పునరుత్పత్తిలో గణనీయమైన సవాళ్లు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్ఎక్స్ 100కు భారీ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. దీని నుంచి వచ్చే ప్రత్యేకమైన సౌండ్ మరియు పెర్ఫార్మెన్స్ కారణంగా చాలా మంది ఈ బైక్‌ని ఇష్టపడతారు. అయితే, ఆర్ఎక్స్ 100 2స్ట్రోక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. అందువల్ల ఎక్కవ సౌండ్‌ మరియు శక్తిని అందిస్తుంది. అయితే, ఈ ఇంజిన్లు కాలుష్యానికి కారణమవుతున్నాయని వాటి వాడకాన్ని నిషేధించారు.

ఇప్పుడు టూ-స్ట్రోక్ ఇంజిన్లకు బదులుగా అన్ని ద్విచక్ర వాహనాలు ఇప్పుడు పర్యావరణ అనుకూలమైన ఫోర్-స్ట్రోక్ మోటార్లను ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల యమహా ఆర్ఎక్స్ 100 బైకుల మాదిరిగానే శబ్దం మరియు అధిక పికప్ శక్తిని విడుదల చేయవు. ముఖ్యంగా పాత యమహా ఆర్ఎక్స్ 100లో వచ్చే శబ్దాన్ని మళ్లీ కొత్త దాంట్లో కూడా తీసుకురావడం అసాధ్యమని కంపెనీ అభిప్రాయపడింది. ఉద్గార నిబంధనలను పాటించడంలో ఆర్ఎక్స్ 100 చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది.

దీంతో ఆర్ఎక్స్ 100 కూడా గతంలో అమ్మకానికి ఉన్న పెర్ఫామెన్స్, సౌండ్ కెపాసిటీతో వస్తుందా లేదా అనే అనుమానన కలుగుతోంది. కొత్తగా రాబోయే యమహా ఆర్ఎక్స్ 100 బైక్ 200సీసీ ఇంజిన్‌ని వినియోగించే అవకాశం ఉంది. ఇది మరింత మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుంది. అదే సమయంలో ఇది వరకు బైక్‌ ఉన్న బరువుతో రానుంది.

ఒకవేళ ఇప్పుడున్న ఉద్గార నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తే ఆర్ఎక్స్ 100 బైక్ ప్రియులకు నచ్చుతుందా లేదా అనే విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతుంది. అదే సమయంలో ఇప్పుడున్న రెట్రో లుక్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఇది మార్కెట్‌లో రాకముందే సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంది. అయితే కంపెనీ ఇస్తున్న లీక్స్ ప్రకారం అచ్చం మునుపటి సౌండ్‌ మరియు ఫర్ఫామెన్స్‌ అసాధ్యమని చెబుతుండటం బైక్‌ ప్రియులను కాస్త నిరాశకు గురిచేస్తుందని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 19, 2024, 9:15 [IST]
English summary
Yamaha rx100 updated version facing issues in production before launch
Read more on: #yamaha #two wheeler #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+