Free Offer ఈ అడ్వెంచర్‌ బైక్‌ కొంటే రూ. 17,000 విలువ చేసే టూరింగ్‌ యాక్ససిరీస్‌ ఉచితం

భారతీయ మిడ్-అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్ విభాగంలో సరసమైన మోటార్ సైకిళ్లను అందిస్తున్న సంస్థల్లో యెజ్డీ ఒకటి. ఆ సంస్థ నుంచి యెజ్డీ అడ్వెంచర్ బైక్‌ అందుబాటులో ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 411కు ఇది ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. అందరికీ అడ్వెంచర్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ బైక్‌లను సంస్థ రూపొందిస్తుంది. తాజాగా యెజ్డీ అడ్వెంచర్‌ బైక్‌కి సంబంధించి భారీ ఆఫర్‌ని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్‌ అందరికీ అందుబాటులో ఉండనుంది. ఈ బైక్‌ కొనుగోలు చేసే వారందరికీ కంపెనీ ఈ ఆఫర్‌ని ప్రకటించింది. ఆ ఆఫర్‌ ఏంటంటే..

యెజ్డీ అడ్వెంచర్ బైక్ కొనుగోలు చేసేవారికి ఉచిత మౌంటైన్ ప్యాక్ యాక్ససరీలను యెజ్డీ మోటార్స్ అందిస్తోంది. ట్రావెల్‌ ఔత్సాహికుల కోసం ఈ బంపర్‌ ఆఫర్‌ని ప్రకటించింది. ఎక్కువ మంది యువతను ఆకర్షించే విధంగా ఈ యాక్సెసరీలను ఉచితంగా అందిస్తోంది. మరి ఈ మౌంటైన్ ప్యాక్ యాక్సెసరీస్‌లో అడ్వెంచర్‌ల కోసం ఎలాంటి వస్తువులను అందిస్తున్నారో చూద్దాం..

Yezdi-Adventure-Touring-Accessories

ఇందులో జెర్రీ క్యాన్ హోల్డర్స్, 5-లీటర్ జెర్రీ క్యాన్లు, క్రాష్ గార్డ్, బార్-ఎండ్ వెయిట్‌ (బరువులతో) కూడిన హ్యాండ్ గార్డ్స్ మరియు హెడ్ ల్యాంప్ గ్రిల్ వంటి ప్రాక్టికల్ టూరింగ్ యాక్ససరీలను సంస్థ అందిస్తోంది. టూరింగ్‌ ఔత్సాహికల కోసం మౌంటెన్ ప్యాక్ యెజ్డీ అడ్వెంచర్‌ రైడర్లు మెరుగైన అనుభూతిని అందించనుంది. ఈ అదనపు ఫీచర్లను పూర్తి ఉచితంగా సంస్థ అందిస్తుంది.

వీటి ధరలను కూడా పెంచలేదు. కలర్ వేరియంట్ (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ను బట్టి రూ.2.16 లక్షల నుంచి ప్రారంభమై రూ.2.20 లక్షల వరకు ఉంటుంది. 1990వ దశకంలోనే ఈ బైక్‌ సంస్థ మార్కెట్‌లోకి వచ్చిన బైక్ ప్రియుల నుంచి ఆశించినంత స్పందన రాకపోవడంతో మార్కెట్ నుంచి వైదొలిగింది. ఆ తరువాత మహీంద్రా యాజమాన్యంలోని క్లాసిక్ లెజెండ్ యెజ్డీ బ్రాండ్‌ని కొత్త లుక్‌తో ఆ సంస్థ తిరిగి మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

యెజ్డీ అడ్వెంచర్ మూడు బైక్ మోడళ్లలో ఒకే ఇంజిన్ ఆప్షన్‌ను అందించింది. అయితే పనితీరు వివిధ మోడళ్లలో మార్పులు కలిగి ఉన్నాయి. ఇది 334 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇంకా 6-స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్‌తో ఈ బైకులు వస్తాయి. అన్ని మోడళ్లలో ఫర్ఫామెన్స్‌ భిన్నంగా ఉండనుంది. కస్టమర్లు తమ అభిరుచికి తగినట్లుగా సరిపడా మోడళ్లను ఎంచుకోవచ్చు.

యెజ్డీ రోడ్‌స్టర్‌, యెజ్డీ స్క్రాంబ్లర్ మరియు యెజ్డీ అడ్వెంచర్ బైక్ మోడళ్లను ఆ సంస్థ విక్రయిస్తోంది. ఫర్ఫామెన్స్‌ పరంగా చూస్తే రోడ్‌స్టర్ 29.3 bhp పవర్ మరియు 29nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, స్క్రాంబ్లర్ మోడల్ 28.7bhp పవర్ మరియు 28.2nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ అడ్వెంచర్ మోడల్ 29.7bhp పవర్ మరియు 29.9nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అన్ని బైక్స్‌ మోడళ్లు మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తాయి.

ఈ అడ్వెంచర్ మోడల్‌ ప్రత్యేకంగా సుదూర ప్రయాణం మరియు అడ్వెంచర్‌ బైక్ రైడింగ్ కోసం అభివృద్ధి చేయబడింది. డబుల్ క్రెడిల్ ఛాసిస్ ఉన్న అడ్వెంచర్ బైక్ మోడల్ రోడ్‌స్టర్ మరియు స్క్రాంబ్లర్ మోడళ్ల కంటే శక్తివంతమైనది. ఆఫ్-రోడ్ మరియు ఆన్-రోడ్ రెండింటిలోనూ ఈ బైక్‌ బెస్ట్‌ ఫర్ఫామెన్స్‌ని అందిస్తుంది. అందుకే ఈ బైక్‌ అడ్వెంచర్‌కి తగినట్లుగా డిజైన్‌ చేయబడింది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, May 31, 2024, 11:59 [IST]
English summary
Yezdi adventure bike you will get free touring accessories at no extra cost
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+