Yezdi Adventure Bike Full Review Video యెజ్డీ అడ్వెంచర్‌తో ప్రపంచాన్ని చుట్టేయొచ్చా? రివ్యూ వీడియో చూసేయండి!
రైడింగ్ ఔత్సాహికుల కోసం యెజ్డీ మోటార్‌సైకిల్ అప్‌డేడెటెడ్ అడ్వెంచర్ బైక్‌ని (Yezdi Adventure) విడుదల చేసింది. పూర్తి ఆఫ్‌రోడ్ సామార్థ్యాలతో ఈ బైక్‌ని సంస్థ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కఠినమైన రోడ్లు, కొండలు, ఇతర ఎత్తు పల్లాల వద్ద ఈ బైక్ అందుబాటులో ఉన్న అడ్వెంచర్ బైక్స్ కంటే ఎక్కువగా రాణించగలదు. ఈ బైక్‌ని మా డ్రైవ్స్‌పార్క్ టీమ్ టెస్ట్‌డ్రైవ్ చేసింది. ఈ బైక్ ఎలా ఉంది? నిజంగానే అడ్వెంచర్ అనుభూతిని అందించిందా? లేదా అనే విషయాన్ని మా టీమ్ రివ్యూ చేసింది.
ఈ కంపెనీ ముఖ్యంగా యువ రైడర్లను టార్గెట్ చేస్తూ ఉత్పత్తులను అందిస్తుంది. అందువల్ల ఎక్కువగా జనాలు ఈ బైక్‌లను సెర్చ్ చేస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కి ప్రత్యామ్నాయంగా ఈ బైక్‌లను కొంటున్నారు. అందువల్ల కంపెనీ సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ సరికొత్త అడ్వెంచర్ బైక్‌లో శుద్ధి చేయబడిన ఇంజిన్, మెరుగైన ఛాసిస్, పూర్తి స్థాయిలో అడ్వెంచర్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేలా బైక్‌ని అప్‌డేట్ చేసింది.
ఈ అడ్వెంచర్ బైక్ అభివృద్ధి చేసిన ఆల్ఫా-2 ఇంజిన్‌ని కలిగి ఉంది. ఈ లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పవర్‌హౌస్ మెరుగైన పనితీరుని అందిస్తుంది. ఈ బైక్ ఇంజిన్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ మంచి పవర్‌ని, హై స్పీడ్‌లో వైబ్రేషన్‌ని కూడా తగ్గిస్తుంది. ఇందులోని కొత్త లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ 334cc ఇంజిన్ 30.2 PS, 29.9 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఈ బైక్ ఆన్ మరియు ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌లకు అనువుగా ఉండనుంది. ఈ బైక్ కలిగి ఉన్న 220mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలకు అనువుగా ఉంటుంది. ఇందులో ఉండే భారీ 15.5-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ లాంగ్ జర్నీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఈ బైక్ 188 కిలోల బరువు, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుకవైపు మోనోషాక్‌లు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది.



Click it and Unblock the Notifications








