పెట్రోల్ బండ్లకు గుడ్‌బై చెప్పండి.. క్రేజీ లుక్, 100 కి.మీ రేంజ్ 'జెలియో మిస్టరీ స్కూటీ'కి జేజేలు కొట్టండి!
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పెరుగుతున్నాయి. జనాలు ఎక్కువగా టూవీలర్స్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ద్విచక్ర వాహనాలను జనాలు కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ సంస్థలు పదుల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం చిన్న స్టార్టప్ బ్రాండ్లు కూడా భారీ డిమాండ్ దిశగా సాగుతున్నాయి. ఈ పండుగ సీజన్‌లో అమ్మకాలను పెంచుకోవడానికి ఎలక్ట్రిక్ కంపెనీలన్నీ అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా జెలియో eబైక్స్ కంపెనీ కూడా సేల్స్‌ని పెంచుకునేందుకు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని విడుదల చేసింది. తక్కువ ధర, హై-రేంజ్‌తో ఈ స్కూటర్‌ని ప్రవేశపెట్టింది.
ఈ కంపెనీ హై-స్పీడ్, లో-స్పీడ్ వెహికిల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో మిస్టరీ (Mystery) అనే సరికొత్త మోడల్‌ని తీసుకువచ్చింది. దీని ధర కేవలం రూ .81,999 మాత్రమే కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ మంచి ఫర్ఫామెన్స్‌తో పాటు స్థిరమైన రైడింగ్ అనుభవాన్ని అందిచేలా రూపొందించారు. మహిళలు, పురుషులు, యువకులు, వృద్ధులు ఇలా ఏ వయసు వారైనా దీనిని సులభంగా డ్రైవ్ చేయవచ్చు.

ఈ మిస్టరీ ఎలక్ట్రిక్ స్కూటర్ 72V/ 29 AH లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో శక్తివంతమైన 72V మోటారుతో అందించబడుతుంది. ఈ కాంబినేషన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటకు 100 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ఇది మన రోజువారీ ఉపయోగానికి పూర్తిగా సరిపోయే ఈవీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ స్కూటర్‌ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 4-5 గంటల సమయం పడుతుంది. తక్కువ ఛార్జింగ్ సమయంతో వినియోగదారులు ఎటువంటి ఆందోళన లేకుండా సులభంగా 100 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఇలాంటి ఉత్పత్తులతో కంపెనీ బ్రాండింగ్‌ని పెంచుకోవాలని ఈ స్టార్టప్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ జెలియో eబైక్స్ మిస్టరీ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం బరువు 120 కిలోలుగా ఉంది.

ఇది 180 కిలోల లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ స్పష్టం చేసింది. కావున దీనిపై వ్యక్తిగత అవసరాలను తీర్చడంతో పాటు నిత్యావసర వస్తువులను తీసుకెళ్లడం సులభంగా ఉంటుంది. దీని ధర చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉండటం కలిసి వచ్చే అంశం అని చెప్పవచ్చు. ఈ జెలియో స్కూటర్ మునుపటి మోడళ్ల మాదిరిగానే మిస్టరీ బ్లాక్, సీ గ్రీన్, గ్రే, రెడ్ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో లభిస్తుంది.
ఈ మిస్టరీ స్కూటర్ మంచి లుక్‌తో పాటు హై ఫర్ఫామెన్స్ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఈ కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, USB ఛార్జింగ్, డిజిటల్ డిస్ప్లే వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది కస్టమర్లకు అడ్వాన్స్‌డ్ ఫీచర్ల అనుభూతిని అందిస్తాయి.

ఈ కొత్త జెలియో మిస్టరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డిజిటల్ డిస్ప్లే, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ మరియు యాంటీ థెఫ్ట్ అలారం వంటి అదనపు భద్రతా సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తుంది. 90 కిలోమీటర్ల రేంజ్, 150 కిలోల లోడ్ సామర్థ్యంతో హై-స్పీడ్ కార్గో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కూడా ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఈ మోడల్ ఒకట్రెండు నెలల్లో ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక ఇందులోని మెకానికల్ అంశాల విషయానికి వస్తే, జెలియో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు, వెనుక హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లను కలిగి ఉంటుంది. ఇది రైడర్లకు సాఫీ ప్రయాణాన్ని అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ స్కూటర్ కఠినమైన రోడ్లలో అనువుగా ఉంటుంది. ఇక సేఫ్టీ పరంగా స్కూటర్ కట్రోలింగ్ కోసం అధునాతన కాంబి బ్రేక్ సిస్టమ్‌ని కూడా అందించారు.


Click it and Unblock the Notifications








