లో-స్పీడ్ కార్గో స్కూటర్ విడుదల.. వ్యవసాయ అవసరాలకు కూడా బెస్ట్.. 3 యూరియా బస్తాలు తీసుకెళ్లవచ్చు!
దేశంలో చాలా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రస్తుతం కమర్షియల్ అవసరాల కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. డెలివరీలు, ఇతర కార్గో సర్వీసుల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ఉన్న డిమాండ్‌ని గమనించిన దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జెలియో ఇ-బైక్స్ (Zelio eBikes) అత్యాధునిక కార్గో ఈవీ స్కూటర్‌ని (Zelio LOGIX Cargo) మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్కూటర్ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్‌గా కార్గో సర్వీసులు, ఇతర వ్యాపార రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇది కార్గో సర్వీసుల్లోనే అత్యంత శక్తివంతమైన, సమర్థవంతమైన, యూజర్ ఫ్రెండ్లీ స్కూటర్‌గా దీనిని తీసుకువచ్చింది. వివిధ రకాల చిన్న వ్యాపార యజమానులకు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు ఈ స్కూటర్ అనువుగా ఉంటుంది.
గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ స్కూటర్ ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్‌పై దాదాపు 150 కిలోల బరువును సులభంగా తీసుకెళ్లవచ్చు. రోజువారీ కార్యకలాపాల కోసం ఇది అనువుగా ఉంటుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌పై 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ ప్రస్తుతం కంపెనీకి చెందిన డీలర్‌షిప్స్, షోరూమ్లలో కొనుగోలుకి అందుబాటులో ఉంది. వీటిని తక్కువ ఈఎంఐలో సైతం సొంతం చేసుకోవచ్చు.

ఈ లో-స్పీడ్ కార్గో ఈవీ స్కూటర్ ఢిఫరెంట్ డిజైన్, ఆకట్టుకునే పనితీరుతో పాటు రోడ్లపై మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా అందిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ కొత్త లో-స్పీడ్ ద్వారా ముఖ్యంగా కార్గో, లాస్ట్ మైల్ డెలివరీలో చిన్న వ్యాపారాలు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్లను పరిష్కరిస్తుందని జెలియో ఇ-బైక్స్ సహ వ్యవస్థాపకుడు కునాల్ ఆర్య అన్నారు. భారీ లోడ్లతో నగరాల్లో అసాధారణ పనితీరును కనబరుస్తుందని ఆయన చెప్పారు.
తాజా ఎలక్ట్రిక్ వాహనాలు: జెలియో ఇ-బైక్స్ తాజాగా కొత్త కార్గో స్కూటర్‌ని లాంచ్ చేయడమే కాకుండా.. ఇటీవలె గ్రేసీ సిరీస్‌లో (GRACY) లో-స్పీడ్ స్కూటర్లను కూడా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో గ్రేసీ, గ్రేసీ ప్రో, గ్రేసీ ప్లస్ మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ. 59,273 నుంచి రూ. 83,073 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ సీరీస్ స్కూటర్లు మార్కెట్‌లో మంచి మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.
ఈ కంపెనీ లైనప్ నుంచి దీని తర్వాత ఎక్స్-మెన్ (X-Men) స్కూటర్లను ప్రవేశపెట్టారు. వీటి ధరలు రూ. 64,543 నుంచి రూ.87,573 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. హై ఎండ్ లైనప్ ఈవా (Eeva) సిరీస్‌లో ఈవా, ఈవా జెడ్ఎక్స్, ఈవా జెడ్ఎక్స్ ప్లస్ మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ. 56,051, నుంచి రూ.90,500 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
లో-స్పీడ్ కార్గో ఈవీలను ఎక్కువగా ఈ కంపెనీ తీసుకురావడం ద్వారా ఈ విభాగంలో సక్సెస్ అయ్యిందని చెప్పాలి. జనాలు కూడా వీటిని ఎక్కువగా కొంటున్నారు. లో-స్పీడ్ ఎలక్ట్రిక్ టూవీలర్స్ ప్రస్తుతం జెలియో ఇ బైక్స్ అగ్రస్థానంలో ఉంది. మార్కెట్‌లో వస్తున్న ఆదరణ డిమాండ్‌కి తగినట్లుగా అవసరాలను తీర్చడానికి సరికొత్త అప్‌డేట్స్‌తో స్కూటర్లను విడుదల చేస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








