రూ. 67,500 లకే రివర్స్‌ మోడ్‌లో వెళ్లే స్కూటర్‌ లాంచ్‌.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 100 కి.మీ తిరగవచ్చు!

దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జెలియో ఇబైక్స్‌ (Zelio eBikes) ఇప్పుడిప్పడే మార్కెట్‌లో నిలదొక్కుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న టాప్‌ కంపెనీలకు సైతం ఈ స్కూటర్లు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్‌తో అందుబాటు ధరల్లో స్కూటర్లను ఈ సంస్థ అందిస్తోంది. అందువల్ల మార్కెట్‌లో ఈ స్టార్టప్ కంపెనీ స్కూటర్లు తక్కువ కాలంలోనే మంచి మార్కెట్‌ని సాధించాయి. ప్రస్తుతం కొత్త ఉత్పత్తులపై ఫోకస్‌ పెట్టిన ఈ కంపనీ రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో మార్కెటింగ్‌ని విస్తరించనుంది. తాజాగా జెలియో ఈవా జెడ్‌ఎక్స్‌ ప్లస్‌ (Eeva ZX+ EV) స్కూటర్‌ని కంపెనీ ఆవిష్కరించింది. ఈవా సిరీస్‌లో ఇది వరకే ఇతర మోడళ్లను కలిగి ఉంది. తాజాగా కొత్త ఈవా జెడ్ఎక్స్ ప్లస్ ను ఆవిష్కరించింది. విద్యార్థులు, ప్రొఫెషనల్స్తో సహా ఆధునిక పట్టణ ప్రయాణికుల కోసం ఈవీని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

కొత్తగా రీడిజైన్ చేయబడిన ఈవా జెడ్‌ఎక్స్‌+ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటాయి. ఈ స్కూటర్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ స్ట్రాంగ్‌ BLDC మోటార్ (60/72V) తో పనిచేస్తుంది. అంతే కాకుండా ఈ స్కూటర్‌ 90 కిలోల నుంచి 180 కిలోల లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ZELIO Eeva ZX Low-Speed Scooter

ఈ స్కూటర్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్‌, రియర్ డ్రమ్ బ్రేక్స్‌ ముందు వెనుక భాగంలో హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంది. ఈ Eeva ZX+కి సంబంధించిన సేఫ్టీ, కంఫర్ట్‌కి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. అంతే కాకుండా దీని ఫర్ఫామెన్స్‌, విశ్వసనీయతతో పాటు మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది.

ఈవా ZX+ లో యాంటీ థెఫ్ట్ అలారం, రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ డిస్ ప్లే వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి ఈ స్కూటర్‌ బ్లూ, గ్రే, వైట్, బ్లాక్ కలర్‌ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయడానకి సిద్ధంగా ఉంది. ఈ స్కూటర్‌ని ఒక సంవత్సరం లేదా 10,000 కిలోమీటర్ల వారంటీతో వస్తుంది.

ZELIO Eeva ZX Low-Speed Scooter

వేరియంట్ల వారిగా ధరలు: ఈ స్కూటర్ వివిధ రకాల బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ధరను కంపనీ నిర్ణయించింది. ముందుగా ఈ స్కూటర్ 60 వి / 32 AH లెడ్ యాసిడ్ బ్యాటరీతో 60 నుంచి 70 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. దీని ధర రూ.67,500 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 7 నుంచి 8 గంటలు పడుతుంది.

ఈ స్కూటర్ 72 వి / 32 AH లెడ్ యాసిడ్ బ్యాటరీతో 80 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. దీని ధర రూ.70,000 లుగా ఉంది. ఈ స్కూటర్‌ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ 60 వి / 38 AH లెడ్ యాసిడ్ బ్యాటరీతో 80 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. దీని ధర రూ.73,300 కాగా, 7 నుంచి 8 గంటల వరకు ఛార్జింగ్ సమయం ఉంటుంది.

ZELIO Eeva ZX Low-Speed Scooter

72 వి / 38 AH లెడ్ యాసిడ్ బ్యాటరీతో మరో స్కూటర్‌ 100 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. రూ.77,000 ధర కలిగిన స్కూటర్‌ని ఛార్జ్‌ చేయడానికి 9 నుంచి 10 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ 60V / 30AH లిథియం-అయాన్ బ్యాటరీతో 80 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుంది. రూ.90,500 ధర కలిగిన ఈ స్కూటర్‌ని ఛార్జ్‌ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 2, 2024, 11:48 [IST]
English summary
Zelio ebikes unveils eeva zx plus low speed scooter promising 100 km range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+