రూ. 56,051 లకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. దీనిలో ఉండే స్మార్ట్‌ ఫీచర్లు లక్ష రూపాయల స్కూటర్లలోనూ లేవు!

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమలో జెలియో ఇ-బైక్స్ ఒకటి. 2021 లో స్థాపించబడిన ఈ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా సంస్థ నేడు దేశవ్యాప్తంగా 100 మందికి పైగా డీలర్లను కలిగి ఉంది. అంతే కాకుండా వేగంగా రెండు లక్షలకు పైగా హ్యాపీ కస్టమర్లను కలిగి ఉంది. ఆ కంపెనీ నుంచి గ్రేసీ సిరీస్, ఎక్స్‌మెన్ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వంటి మునుపటి మోడళ్ల సక్సెస్‌ తర్వాత జెలియో ఇ-బైక్స్ కొత్త ఈవా (Eeva) సిరీస్‌ స్కూటర్‌ని విడుదల చేసింది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను పలు నగరాల్లోని విద్యార్థులు, రోజువారి కార్మికులకు, అలాగే డెలివరీ బాయ్స్‌కి సరిపోతాయి. ఈ సిరీస్‌లో ఈవా, ఈవా ఎకో, ఈవా జెడ్ఎక్స్+ స్కూటర్లు ఉన్నాయి. ఈ స్కూటర్లకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

ఈ స్కూటర్లు ముఖ్యంగా రోజువారీ సిటీ రైడ్స్ కోసం జెలియో ఈవా మోడల్‌ని రూపొందించారు. ఇది స్ట్రాంగ్‌ BLDC మోటారుతో పనిచేస్తుంది. ఈవా ఇ-స్కూటర్ 180 కిలోల పే లోడ్‌ సామర్థ్యంతో మొత్తం 80 కిలోల బరువును కలిగి ఉంది. రెండు వైపులా డ్రమ్ బ్రేకుల ద్వారా స్టాపింగ్ చేయవచ్చు. అంతే కాకుండా గుంతల రోడ్లలోనూ సాఫీగా ప్రయాణించేలా హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లను అందించారు.

Zelio Electric Eeva Series Scooters launched

ఈ స్కూటర్‌లోని ఫీచర్ల జాబితా విషయానికి వస్తే యాంటీ-థెఫ్ట్ అలారం, రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్,USB ఛార్జర్ మరియు డిజిటల్ డిస్ప్లే ఉన్నాయి. బ్లూ, గ్రే, వైట్, బ్లాక్ రంగుల్లో లభించే ఈవా ఐదు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది.

ఇక ఈవా ఎకో వేరియంట్‌ స్టైలిష్ డిజైన్, మంచి ఫర్ఫామెన్స్‌ కోరుకునేవారికి ఇది సరైన మోడల్. 80 కిలోల బరువున్న ఈవా ఎకో 180 కిలోల లోడింగ్ కెపాసిటీని కలిగి ఉంది. వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్స్‌, ముందు భాగంలో డిస్క్ బ్రేకులతో ఇది మంచి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, USB ఛార్జర్ వంటి ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.

Zelio Electric Eeva Series ZX Plus

రెండు వైపులా హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లు సస్పెన్షన్ నిర్వహిస్తాయి. BLDC మోటార్ (48/60V) ఈవా ఎకోకు శక్తిని అందిస్తుంది. డిజిటల్ డిస్ప్లే, సెంట్రల్ లాకింగ్ దీని సెక్యూరిటీ ఫీచర్లను మెరుగుపరుస్తాయి. బ్లూ, గ్రే, వైట్, బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్లలో ఈవా ఎకో లభిస్తుంది. ఇందులో మూడు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి.

ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వారికి ఈవా జెడ్ఎక్స్ ప్లస్ సరైనది. ఈ స్కూటర్ శక్తివంతమైన BLDC మోటార్ (60/72 V) తో వస్తుంది. 90 కిలోల బరువున్న ఈవా జెడ్ఎక్స్ ప్లస్ ఈవీ 180 కిలోల పే లోడ్‌ కెపాసిటీని కలిగి ఉంది. జెడ్ఎక్స్ ప్లస్ ఈవీ అసాధారణ నియంత్రణ, భద్రత కోసం ముందు భాగంలో డిస్క్ బ్రేకులను వెనుక భాగంలో డ్రమ్ బ్రేకులను కలిగి ఉంది.

Zelio Electric Eeva Series Scooters launched

ఇందులో యాంటీ థెఫ్ట్ అలారం, డిజిటల్ డిస్ప్లే వంటి ఇతర మోడళ్లలో కనిపించే అన్ని అధునాతన ఫీచర్లను ఈ మోడల్ కలిగి ఉంది. సింటా లెడ్ యాసిడ్ (Sinta) మరియు లిథియం-అయాన్ బ్యాటరీలపై జెలియో ఒక సంవత్సరం లేదా 10,000 కిలోమీటర్ల వరకు వారంటీని అందిస్తుంది. దీంతో కస్టమర్లు ఎటువంటి భయం లేకుండా కొనుగోలు చేయవచ్చు.

అధునాతన టెక్నాలజీ, ఆధునిక స్టైలింగ్‌తో ఈ స్కూటర్లు మెరుగైన ప్రయాణానికి వీలు కల్పిస్తాయి. ఈ స్కూటర్ల ధరలు రూ. 56,051 నుంచి మొదలై రూ. 79,051 వరకు ఉన్నాయి. ఈవా, ఈవా ఎకో, ఈవా జెడ్‌ఎక్స్‌ ప్లస్‌ వేరియంట్లు, బ్యాటరీ ఆప్షన్స్‌ని బట్టి ధరలు మారుతాయి. కస్టమర్లు వారికి నచ్చిన మోడల్‌ని ఎన్నుకోవచ్చు. ఇవి 55 కి.మీ నుంచి 100 కి.మీ వరకు రేంజ్‌ని అందిస్తాయి.

More from DriveSpark

Article Published On: Thursday, August 29, 2024, 10:23 [IST]
English summary
Zelio electric eeva series scooters launched at rs 56051 check range and specifications here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+