రూ .64,543 లకే ఎలక్ట్రిక్ స్కూటర్.. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా నడపవచ్చు!!
దేశీయ ఎలక్ట్రిక్ టూవీలర్ స్టార్టప్ జెలియో ఇ-బైక్స్ కొత్త ఎక్స్ మెన్ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని విడుదల చేసింది. కొత్త జెలియో ఎక్స్ మెన్ ఇ-స్కూటర్లు తక్కువ వేగంతో నడిచే ఈ-స్కూటర్లు కావడంతో వాటిని పబ్లిక్ రోడ్లపై నడపడానికి యజమానులకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఎంట్రీ లెవల్ ఎక్స్-మెన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ .64,543 ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉండనుంది. ఇది 55-60 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఫుల్ ఛార్చ్ అయ్యేందుకు 7-8 గంటల సమయం పడుతుంది. 60V/ 32Ah లెడ్-యాసిడ్ బ్యాటరీని ఇందులో వినియోగించారు.
ఇక మిడ్ వేరియంట్ ధర రూ .67,073 గా ఉంది. 72V / 32 Ah లెడ్-యాసిడ్ బ్యాటరీని ఇందులో వినియోగించారు. దీనిని ఛార్జ్ చేసేందుకు 7-9 గంటల ఛార్జింగ్ సమయం పడుతుంది. ఫుల్ ఛార్జ్‌పై 70 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇక టాప్ వేరియంట్ ధర రూ .87,673గా ఉంది. 60V / 32 Ah లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది.

టాప్ వేరియంట్ 80 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీనిని ఛార్జ్ చేసేందుకు కేవలం నాలుగు గంటల సమయం పడుతుంది. ఈ-స్కూటర్లు శక్తివంతమైన 60/72 V BLDC మోటారును ద్వారా శక్తిని పొందుతాయి. దీని ఛార్జింగ్ కోసం 1.5 యూనిట్ల విద్యుత్తును ఉపయోగిస్తుందని జెలియో వెల్లడించింది. ఇది స్లో-స్పీడ్ ఇ-స్కూటర్ కావడంతో, గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లకు లిమిట్‌గా ఉంది.
అన్ని మోడళ్ల స్థూల బరువు 80 కిలోలు కాగా, పేలోడ్ సామర్థ్యం 180 కిలోలుగా ఉంది. విభిన్న బ్యాటరీ కాన్ఫిగరేషన్స్‌తో పాటు మెరుగైన పనితీరుని అందించే విధంగా మొత్తం ఐదు వేరియంట్లను అందిస్తోంది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. జెలియో ఎక్స్ మెన్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో యాంటీ-థెఫ్ట్ అలారం, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్ డ్రమ్ బ్రేక్స్ మరియు ముందు భాగంలో అల్లాయ్ వీల్ ఉన్నాయి.

అంతే కాకుండా ఈ మోడళ్లలో రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, USB ఛార్జింగ్ మరియు హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. స్కూటర్లలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సెంట్రల్ లాకింగ్ కూడా ఉన్నాయి. బ్లాక్, వైట్, సీ గ్రీన్, రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. చూడటానికి అచ్చం సాంప్రదాయ లుక్‌తో ఈ స్కూటర్లు భారీ లుక్‌ని కలిగి ఉన్నాయి.
"ఎక్స్ మెన్ వేరియంట్లు లో-ఎండ్ కేటగిరీలలోను అధిక పేలోడ్‌తో నిర్మించడం మా ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్ధం పడతాయని మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య తెలిపారు. ఇది అద్భుతమైన పనితీరుతో పాటు స్పోర్టీ లుక్‌ని కలిగి ఉందని ఆయన చెప్పారు. ముఖ్యంగా యువకులను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్లు తయారు చేసినట్లు చెప్పారు. ఆధునిక రైడర్ల అవసరాలను తీర్చే అత్యుత్తమ ఉత్పత్తులను అందించడంలో మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

కొత్తగా విడుదలనై ఎక్స్ మెన్ లైనప్ గ్రేసీ, గ్రేసీ ప్రో మరియు గ్రేసీ ప్లస్ మోడల్ సిరీస్‌లో చేరాయి. గ్రేసీ శ్రేణి ధరలు రూ .59,273 నుంచి ప్రారంభమై రూ .83,073 (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను హర్యానాలోని హిసార్‌లో ఉన్న కంపెనీ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు, ప్రతి షిఫ్టులో 1.5 లక్షల వాహనాలను ఉత్పత్తి సామర్థ్యం ఈ ప్లాంట్‌కి ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








