10 ఏళ్ళ వారంటీ, అదిరిపోయే మైలేజ్.. వెంటనే షోరూంలకు పరిగెత్తి కొత్త హోండా బైక్స్ కొనేయండి

భారతదేశంలో టూ వీలర్ మార్కెట్‌లో హోండా కంపెనీ హీరో మోటోకార్ప్‌తో పోటీ పడుతూ దూసుకుపోతోంది. 100 సీసీ నుంచి 350 సీసీ సెగ్మెంట్లలో అదరగొట్టేస్తుంది. అంతేకాదు, సూపర్ బైక్‌లు తయారు చేయడంలోనూ ఈ జపాన్ బ్రాండ్ దిట్ట అనే చెప్పాలి. రకరకాల మోడళ్లతో కస్టమర్లను ఖుషీ చేసే బ్రాండ్లలో హోండా కూడా ఒకటి. హీరోతో పోటీ పడటానికి హోండా తీసుకొచ్చిన పాపులర్ బైక్ SP125.

ఇది సూపర్ హిట్ అవ్వడంతో SP160 మోడల్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. యూనికార్న్ ఇంజిన్‌తో వచ్చిన ఈ బైక్ సామాన్యుల్లో కూడా బాగా పాపులర్ అయింది. ఈ మధ్య హోండా తమ బైక్ మోడల్స్‌లో చాలా మార్పులు తీసుకొస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తమ SP 125, SP 160 బైకుల్లో సరికొత్త TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రవేశపెట్టింది.

New Honda Bikes

అంతేకాదు, బైకులకు కొత్తదనం తీసుకురావడానికి కొన్ని కాస్మెటిక్ మార్పులు కూడా చేశారు. SP125 మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.92,678 నుంచి మొదలవుతుండగా, SP160 వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,22,478 నుంచి మొదలవుతుంది. ఈ రెండు మోటార్‌సైకిళ్లు ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న కొత్త TFT మీటర్‌తో వస్తున్నాయి.

ఇది చాలా మంది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ స్క్రీన్‌ను హోండా రోడ్‌సింక్ అప్లికేషన్తో కనెక్ట్ చేస్తే, టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా చూసుకోవచ్చు. స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటి బేసిక్ సమాచారంతో పాటు, లైవ్ మైలేజ్, రేంజ్, యావరేజ్ ఫ్యూయెల్ ఎఫీషియన్సీ లాంటి వివరాలు కూడా ఈ TFT క్లస్టర్ ద్వారా తెలుసుకోవచ్చని హోండా చెబుతోంది.

Honda Bikes

గియర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉండటం వల్ల బైక్ నడపడం మరింత సులభం అవుతుంది. ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడే ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫీచర్తో ఈ బైక్‌లు వస్తున్నాయి. ట్రాఫిక్‌లో లేదా ఎక్కడైనా ఆగినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. దీనివల్ల పెట్రోల్ ఆదా అవుతుంది. ఇంజిన్ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చే కుదుపులు తగ్గించే సైలెంట్ స్టార్టర్ని కూడా SP సిరీస్‌లో అమర్చారు.

అంతేకాదు, SP125 మోడల్‌కు కొత్త గ్రాఫిక్ డిజైన్లు కూడా ఇచ్చారు. SP160 లో అయితే కొత్త LED హెడ్‌ల్యాంప్ కూడా ఉంది. బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీ, యమహా ఎఫ్‌జెడ్, హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, సుజుకి జిక్సర్ వంటి పెద్ద బైకులతో పోటీ పడుతున్న SP160 మోడల్ కొత్త 2025 వెర్షన్‌ను కూడా హోండా ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చింది.

New Honda

ఈ బైక్ ఇంజిన్‌ను OBD2B స్టాండర్డ్స్‌కు అప్‌డేట్ చేయడం ఇందులో కీలక విషయం. 162.71 సీసీ సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఈ బైక్‌కు పవర్ ఇస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‎తో కలిపి పనిచేసే ఈ ఇంజిన్ 7,500 ఆర్‌పిఎమ్‌లో 13 బిహెచ్‌పి పవర్, 5,250 ఆర్‌పిఎమ్‌లో 14.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

రేడియంట్ రెడ్ మెటాలిక్ , పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో హోండా SP160 ని కొనుగోలు చేయవచ్చు. ఇరువైపులా కవర్లు ఉన్న మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, ఒక అండర్‌కౌల్, ఎగ్జాస్ట్ మఫ్లర్‌పై క్రోమ్ కవర్, LED టెయిల్‌లైట్ వంటివి ఈ మోడల్ ముఖ్యమైన ప్రత్యేకతలు.

మెకానికల్ విషయానికి వస్తే, హోండా SP160 ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ తో వస్తుంది. బ్రేకింగ్ కోసం ముందు వైపు 276 మి.మీ. డిస్క్, వెనుక వైపు 220 మి.మీ. డిస్క్ లేదా 130 మి.మీ. డ్రమ్ను హోండా ఉపయోగించింది. హోండా స్టాండర్డ్‌గా సింగిల్-ఛానెల్ ABSను కూడా అందిస్తోంది కాబట్టి సేఫ్టీ గురించి ఎలాంటి చింత అవసరం లేదు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: కొత్త TFT క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఐడిల్ స్టార్ట్/స్టాప్, మెరుగైన భద్రతా ఫీచర్లతో హోండా SP125, SP160 బైక్‌లు యువతను, అలాగే మైలేజ్, పర్ఫార్మెన్స్‌ కోరుకునే వారిని బాగా ఆకట్టుకుంటాయి. ఈ అప్‌డేట్స్‌తో హోండా మళ్ళీ మార్కెట్‌లో తన పట్టును పెంచుకునే అవకాశం ఉంది. 10 ఏళ్ళ వారంటీ అనేది కస్టమర్లకు మరింత నమ్మకాన్ని ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 18, 2025, 17:45 [IST]
English summary
10 year warranty superb mileage why wait for these new honda bikes
Read more on: #honda #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+