ఇది కదా మిడిల్ క్లాస్ వాళ్ల బైక్ అంటే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160కిమీ.. టీవీఎస్, బజాజ్‎లకు పెద్ద షాకే

భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు (Electric Scooters) పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ టూవీలర్ తయారీదారు యమహా (Yamaha) సంస్థ తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ EC-06 ని విడుదల చేసింది. ఏరాక్స్ ఇ (Aerox E) స్కూటర్‌తో పాటు లాంచ్ అయిన ఈ మోడల్, దాని స్టైల్, పెర్ఫార్మెన్స్, రేంజ్ తో మార్కెట్‌ను శాసిస్తున్న టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube), బజాజ్ చేతక్ (Bajaj Chetak) వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. సిమ్ బేస్డ్ కనెక్టివిటీ, 160 కి.మీ రేంజ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన యమహా EC-06 పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యమహా సంస్థ తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యమహా EC06ను మార్కెట్‌లో విడుదల చేసింది. ఏరాక్స్ ఈ స్కూటర్‌తో పాటు విడుదలైన ఈ EC06, భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంది.

160 km Range on Single Charge 9 Hours Charging Full Details of Yamaha EC06

యమహా EC06 స్కూటర్ హారిజాంటల్ డిజైన్ లాంగ్వేజ్‌లో రూపొందించారు. షార్ప్ బాడీ లైన్స్‌తో భారతీయ వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులో 4.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు, ఇది 8.98 hp పవర్ ఉత్పత్తి చేస్తుంది.

4 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఇందులో అందించారు. ఈ బ్యాటరీ పర్ఫామెన్స్, శక్తి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసేలా రూపొందించారు. ఇది స్మూత్, దీర్ఘకాలిక పనితీరును అందిస్తుంది. రోజువారీ అవసరాలకు అనుగుణంగా చాలా దృఢంగా ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 160 కి.మీ.ల వరకు ప్రయాణించవచ్చు.

యమహా EC06 స్కూటర్‌లో రైడ్ మోడ్‌లను ఎంచుకునే ఆప్షన్ ఉంది. ఇది వివిధ డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా స్కూటర్ పనితీరును మార్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. పార్కింగ్ సౌలభ్యం కోసం రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ స్కూటర్ బ్యాటరీని ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 9 గంటల సమయం పడుతుంది.

160 km Range on Single Charge 9 Hours Charging Full Details of Yamaha EC06

సేఫ్టీ, అడ్వాన్సుడ్ ఫీచర్ల విషయంలో యమహా EC06 ఏమాత్రం రాజీ పడలేదు. రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను (Disc Brakes) అందించారు, ఇది మెరుగైన బ్రేకింగ్ సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది. LED హెడ్‌లైట్, టెయిల్ లైట్, ఇండికేటర్లు ఉన్నాయి. కలర్డ్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ (Colored LCD Instrument Cluster) కీలక సమాచారాన్ని అందిస్తుంది. ఈ స్కూటర్‌లో 24.5 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం ఉంది. ఇందులో హెల్మెట్ లేదా చిన్న లగేజీని పెట్టుకోవచ్చు.

యమహా EC06 ముఖ్య హైలైట్ దాని డిజిటల్ కనెక్టివిటీ (Digital Connectivity). ఇందులో ఇన్-బిల్ట్ టెలిమాటిక్స్ కనెక్టివిటీ ఉంది. SIM ఆధారిత కనెక్టివిటీని కూడా అందించారు. ఇది రియల్-టైమ్ డేటా యాక్సెస్, లొకేషన్ ట్రాకింగ్ (Location Tracking) కోసం ఉపయోగపడుతుంది. రైడ్ అనలిటిక్స్, సర్వీస్ అలర్ట్‌లు అందించడానికి ఈ స్కూటర్ సిస్టమ్ రూపొందించబడింది.

యమహా ఈ స్కూటర్‌ను 2026 మొదటి త్రైమాసికంలో మార్కెట్‌లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో ఈ స్కూటర్ ఒక విప్లవాన్ని సృష్టించి, ప్రస్తుతం బాగా అమ్ముడవుతున్న పోటీదారులకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి మార్కెట్ ఉంది. ఈ స్కూటర్లలో ఉన్న ఫీచర్లు ఖచ్చితంగా ప్రజలను ఆకర్షిస్తాయి. యమహా EC06 స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ అమ్మకాలపై ప్రభావం చూపుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, November 13, 2025, 7:17 [IST]
English summary
160 km range on single charge 9 hours charging full details of yamaha ec06
Read more on: #yamaha #new bike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+