మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లు విడుదల.. ఆకర్షణీయమైన ఫీచర్లు, అందరికీ అందుబాటు ధరలో..!

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌పై క్రేజ్ రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. ఫ్యూయల్ ఖర్చులు ఎక్కువ అయిపోవడంతో జనాలు కాలుష్యరహిత వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇంకా ఇలాంటి కారణాలు ఏవైనా కానీ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ని కొనేవారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇదే క్రమంలో వాహన తయారీ సంస్థలు కూడా సరికొత్త ఫీచర్లతో వాహనాలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ సంస్థ ఏథర్ ఎనర్జీ.. మరో కొత్త స్కూటర్‌తో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తమ 450 సిరీస్‌లో అప్డేటెడ్ వెర్షన్ అయిన 2025 ఏథర్ 450X 450 S ఎలక్ట్రిక్ స్కూటర్లను బెంగళూరులో లాంచ్‌ చేసింది.

ఏథర్ ఎనర్జీ అతి తక్కువ కాలంలోనే మార్కెట్లో మంచి మార్కెట్‌ని సొంతం చేసుకుంది. కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తూ ఉండడంతో ప్రతి నెలా సేల్స్ పెంచుకుంటూ వెళ్తోంది. యాక్టివా ఈవీ స్కూటర్.. త్వరలో లాంచ్‌ చేయబోతున్న తరుణంలో దాని కంటే ముందుగానే ఏథర్ ఇప్పుడు తమ అప్డేటెడ్ వెర్షన్ ఇ-స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని వల్ల పోటీలో మళ్లీ తామే ముందు నిలిచామని చాటింది.

Ather 450 Series Scooters Launch

ఏథర్ 450 X ఫీచర్లను గమనిస్తే... ముందుగా ఇది రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మ్యాజిక్ ట్విస్ట్ అనే కొత్త ఫీచర్‌ను జోడించి తీసుకువచ్చారు. ఏథర్ అపెక్స్‌ స్కూటర్‌లో ఇదివరకే ఉన్న ఈ ఫీచర్‌ను ఏథర్ 450Xలో ఇప్పుడు ప్రవేశపెట్టింది. అంతేగాకుండా ఇందులో 3 రకాల కొత్త ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్లైన.. రోడ్, రెయిన్, ర్యాలీ అనే‌ వాటిని జోడించింది ఏథర్ సంస్థ.

దీని వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా సురక్షితమైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందుతారు. ఈ ఫీచర్లతో తమ స్కూటర్ కస్టమర్స్‌ను విపరీతంగా ఆకర్షించగలదని భావిస్తోంది సదరు సంస్థ. ఏథర్ 450X స్కూటర్‌కి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో దీని సామర్థ్యాన్ని పరిశీలించేందుకు 4 రకాల రేసులు నిర్వహించారు. ఏథర్ 450X స్కూటర్‌తో పాటు, ఒక 160సీసీ బైక్, మరొక 125సీసీ స్కూటర్ కూడా పోటీ పడ్డాయి.

Ather Apex 450X

ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఏ వెహికిల్ బాగా పని చేస్తుంది?.. కఠినమైన రోడ్ల మీద ఏ వాహనం చక్కగా సరిపోతుంది?.. ఏ వాహనం వేగంగా దూసుకువెళ్తుంది?.. అదే విధంగా ఏ వాహనం అధిక టార్క్ ఉత్పత్తి చేస్తుంది? అనే నాలుగు రకాల పరీక్షలు చేశారు. అయితే ఆ వీడియోలో మొత్తం నాలుగు కాంపిటీషన్లలో మూడింట ఏథర్ 450ఎక్స్ ఇ-స్కూటర్ మెరుగైన పనితీరు కనబర్చి మొదటి స్థానంలో నిలించింది.

ఇక రెండో స్థానంలో 160 సీసీ బైక్ నిలిచింది. దీన్ని బట్టి చూస్తే ఏథర్ 450ఎక్స్ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందనే తెలుస్తోంది. ఏథర్ 450 స్కూటర్లకు సంబంధించిన ధరలను ఏథర్ సంస్థ ప్రకటించింది. ఏథర్ 450S మోడల్ స్కూటర్ ప్రొ ప్యాక్ లేకుండా రూ.1.29 లక్షల్లో లభిస్తుండగా.. 2.9 kWh తో ఉండే ఏథర్ 450X మోడల్.. రూ.1.46 లక్షల్లో అందుబాటులో ఉంది.

ఇక 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉండే ఏథర్ 450X మోడల్.. ధర రూ.1.56 లక్షలుగా ఉంది. ఈ వేరియంట్లన్నీ ప్రో ప్యాక్ లేకుండా ఉన్నాయి. అదే సమయంలో ప్రొ ప్యాక్‌తో ఉండే వెర్షన్లను చూస్తే... ఏథర్ 450S మోడల్ స్కూటర్ ధర రూ.1.43 లక్షలు కాగా.. 2.9 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉండే 450X మోడల్ స్కూటర్ ధర రూ.1.63 లక్షలుగా ఉంది.

అలాగే 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉండే 450X స్కూటర్ ధర రూ.1.76 లక్షలుగా ఉంది. ఇక చివరగా ఏథర్ అపెక్స్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ 1.99 లక్షల వద్ద లభిస్తోంది. ఈ ధరలన్నీ ఎక్స్- షోరూమ్ ధరలే కావడం గమనార్హం. దీని ఆన్- రోడ్ ధర మాత్రం ఒక్కో నగరంలో ఒక్కోలా ఉంటుంది. ఈ అప్డేటెడ్ స్కూటర్‌లో బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో తేడాలేమీ లేవు.

More from DriveSpark

Article Published On: Saturday, January 4, 2025, 23:47 [IST]
English summary
2025 ather 450 series electric scooter launched check range and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+