లీటరుకు 70 కి.మీల మైలేజ్ ఇచ్చే హీరో కొత్త బైక్.. దీని ధర తెలిస్తే అస్సలు కొనకుండా ఉండలేరు!

దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీదారు హీరో మోటోకార్ప్ (Hero Motocorp) భారతదేశంలో ప్రజల రోజువారి అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే బైక్‌లను విడుదల చేయడంలో ఎప్పుడు ముందు ఉంటుంది. మంచి మైలేజ్, ఆకట్టుకునే డిజైన్లతో ప్రతి ఏడాది సరికొత్త మోడళ్లను లాంచ్ చేస్తుంది. తాజాగా కంపెనీ అప్‌డేట్ ఫీచర్స్‌తో కూడిన 2025 ప్యాషన్ ప్లస్‌ (passion plus) బైకును విడుదల చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వ కొత్త OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించి తీసుకొచ్చింది. ఇటీవలి కాలంలో దాదాపు అన్ని టూవీలర్ తయారీ కంపెనీలు లాంచ్ చేస్తున్న మోడళ్లను పర్యావరణ హితంగా తయారు చేయాలన్న భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. 2025లో లాంచ్ అయిన దాదాపు అన్ని కూడా ఈ విధంగానే విడుదల అవుతున్నాయి.

ఒకప్పుడు ప్రజల్లో బాగా ఆదరణ సంపాదించిన ప్యాషన్ ప్లస్, ఇప్పుడు మరింత కొత్తగా, పర్యావరణానికి అనుగుణంగా, సరికొత్తగా మార్కెట్లోకి విడుదల అయింది. హీరో మోటోకార్ప్ ఎటువంటి ఆర్భాటం లేకుండా, సైలెంట్‌గా 2025 ప్యాషన్ ప్లస్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసిందని గాడివాడి నివేదించింది. OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా తయారైన ఈ మోడల్ ప్యాషన్ ప్లస్ సిరీస్‌కు లేటెస్ట్ టచ్ ఇచ్చినట్లయింది. ఇది రూ. 82,016 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల అయింది.

2025 Hero passion Plus

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్యాషన్ ప్లస్ ఒకే(i3S డ్రమ్ సెల్ఫ్-స్టార్ట్ అల్లాయ్) వేరియంట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ధర వచ్చేసి రూ.80,266 (ఎక్స్ షోరూమ్). పాత దానితో పోలిస్తే కొత్త మోడల్ ధర పెరిగినప్పటికి దానికి తగ్గట్టుగా ఇంజిన్, ఇతర ఫీచర్స్‌లో మార్పులు చూడవచ్చు. కలర్స్ పరంగా ఇప్పటికే ఉన్నవాటికి అదనంగా రెండు కొత్త కలర్ వేరియంట్లు జోడించారు. దీంతో వీటి లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది.

బ్లాక్ హెవీ గ్రే, బ్లాక్ నెక్సస్ బ్లూ కరల్స్‌కు తోడుగా బ్లూయిష్ టీల్, స్పోర్ట్స్ రెడ్ బ్లాక్ అనే రెండు కొత్త కలర్ వేరియంట్లను తీసుకొచ్చారు. అయితే, పాత మోడల్‌లో ఉన్న బ్లాక్ గ్రే స్ట్రైప్, స్పోర్ట్ రెడ్ కలర్స్‌లను తొలగించారు కొలతల విషయానికి వస్తే, 2025 ప్యాషన్ ప్లస్ పాత దానిలాగే సైజ్‌ను కొనసాగిస్తోంది: పొడవు 1982 మిమీ, వెడల్పు 770 మిమీ, ఎత్తు 1087 మిమీగా ఉంది.

Hero passion Plus Price

వీల్‌బేస్ 1235 మిమీ కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 168 మిమీగా ఉంది. ఇది భారత రోడ్లకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. సీటు ఎత్తు 790 మిమీగా ఉండటంతో, ఇది పొట్టిగా ఉన్నవారికి కూడా అనువుగా ఉంటుంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, 2025 ప్యాషన్ ప్లస్‌ మునుపటిలాగే 97.2cc కెపాసిటీ గల సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇంజిన్‌కి ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చారు.

ఈ ఇంజన్ 8000 rpm వద్ద 7.91 bhp శక్తిని, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4 స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జోడించారు. గ్రామాలతో పాటు పట్టణాలు, నగరాల్లో రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 70 కి.మీల వరకు మైలేజ్ అందించే అవకాశం ఉంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్ల వరకు ఉంది.

Hero passion Plus

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, April 10, 2025, 15:50 [IST]
English summary
2025 hero passion plus launched in india with updated engine features and new colours
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+