పేదల బైక్ స్ప్లెండర్ ప్లస్‌ ధరకు వచ్చే బెస్ట్ టూ వీలర్స్ ఇవే.. బడ్జెట్ తక్కువ.. మైలేజ్ ఎక్కువ

భారతదేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. వారి అవసరాలకు తగ్గట్లు మీడియం రేంజ్ టూ వీలర్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. టా వీలర్ మార్కెట్లో హీరో స్ప్లెండర్ ప్లస్(Hero Splendor Plus) ఇటీవల కొన్ని అప్‌డేట్స్‌తో విడుదలైంది. ఈ కొత్త మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ. 79,096 నుండి గరిష్టంగా రూ. 85,001 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

ఇది 97.2సీసీ OBD 2B పెట్రోల్ ఇంజన్‌తో 70 కిమీ/లీటర్ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. అయితే, ఇదే ధరలో లేదా కొంచెం ఎక్కువ ధరలో లభించే ఇతర టూ వీలర్‌లు కూడా మీ రోజువారీ అవసరాలకు బెస్ట్ ఆఫ్షన్లను మారాయి. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Revolt

1. రివోల్ట్ ఆర్‌వి1 (Revolt RV1): ఇది ఒక ఎలక్ట్రిక్ బైక్. దీని ధర రూ. 89,999 (ఎక్స్-షోరూమ్). ఇది 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.

ఈ రివోల్ట్ ఆర్‌వి1 ఇ-మోటార్‌సైకిల్‌లో 2.8 kW మోటార్‌ను ఉపయోగించారు. ఇది బ్లాక్-రెడ్, టైటాన్ రెడ్ సిల్వర్, బ్లాక్ నియాన్ గ్రీన్ వంటి వివిధ రంగుల్లో లభిస్తుంది. 6-ఇంచుల డిజిటల్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో అనేక ఫీచర్లను కలిగి ఉంది.

Bajaj

2. బజాజ్ ఫ్రీడమ్ 125 (Bajaj Freedom 125): ఈ బైక్ ధర రూ. 90,272 నుండి రూ. 1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 125cc పెట్రోల్/CNG ఇంజన్‌తో 330 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. ఎల్‌ఈడీ హెడ్‌లైట్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు ఎల్‌సిడి డిస్‌ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉంది.

3. హోండా యాక్టివా 110 (Honda Activa 110): ఈ స్కూటర్ ధర రూ. 81,000 వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది 109.51సీసీ OBD-2B పెట్రోల్ ఇంజన్‌తో 42 కిమీ/లీటర్ వరకు మైలేజ్‌ను ఇస్తుంది. ఇది డీసెంట్ బ్లూ మెటాలిక్, పెర్ల్ సైరన్ బ్లూ, రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ ఆక్సిస్ గ్రే మెటాలిక్ వంటి ఎట్రాక్టివ్ రంగుల్లో లభిస్తుంది.

Honda Activa

కొత్త హోండా యాక్టివా 110 అనేక మంచి ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ బైకులో ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ అందించారు.

4. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125): ఈ స్కూటర్ ధర రూ. 86,481 నుంచి రూ. 98,083 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 125సీసీ పెట్రోల్ ఇంజన్‌తో లీటరుకు 47 కిమీ వరకు మైలేజ్‌ను ఇస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం దీనిలో ముందు వెనుక డ్రమ్ డిస్క్ బ్రేక్‌లు అందించారు.

5. టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125): ఈ బైక్ ధర రూ. 90,990 నుంచి రూ. 1.02 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 124.8సీసీ పెట్రోల్ ఇంజన్‌తో లీటరుకు 56 కిమీ వరకు మైలేజ్‌ను ఇస్తుంది. ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్, ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అనేక ఫీచర్లను కంపెనీ అందిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 22, 2025, 17:22 [IST]
English summary
2025 hero splendor plus alternatives top two wheelers at the same price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+