లీటర్ పెట్రోల్‌కు 69 కి.మీల మైలేజ్ ఇచ్చే కొత్త బైక్.. రోజువారి వాడకానికి బెస్ట్ మోడల్.. అదిరిపోతున్న హీరో బైక్

దేశంలో అతిపెద్ద టూవీలర్ వాహన తయారీ సంస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్న హీరో మోటోకార్ప్ దేశవ్యాప్తంగా అమలవుతున్న కొత్త కాలుష్య నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా తన వాహనాలన్నింటినీ అప్‌డేట్ చేయడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా, చాలా కాలంగా ప్రజాదరణ పొందిన స్ప్లెండర్ ప్లస్, ప్యాషన్ ప్రో, గ్లామర్ వంటి కమ్యూటర్ మోడళ్లను ఇప్పటికే మార్పులు చేసింది. ఇప్పుడు కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ 125cc సెగ్మెంట్‌లో ఉన్న హీరో సూపర్ స్ప్లెండర్ XTEC బైక్‌కు కూడా 2025 మోడల్ అప్‌డేట్ మార్పులు అందించింది. కొత్త ఇంజిన్ బీఎస్6 ఫేజ్ 2 ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉండేలా రూపొందించబడింది. దీంతో పాటు, ఈ మోడల్‌లో మరికొన్ని చిన్నచిన్న టెక్నాలజీ ఆధారిత మార్పులు తీసుకువచ్చారు.

కొత్త టెక్నాలజీ, నిబంధనల అమలుతో, కంపెనీ దాని ధరలో రూ. 2,000 వరకూ పెంపుదల కూడా చేసింది. ఈ తాజా మార్పులతో హీరో మోటోకార్ప్ మరోసారి తన వినియోగదారులకు కొత్త స్ప్లెండర్ XTEC బైక్‌‌ను పరిచయం చేసింది. ధరల్లో చిన్న పెరుగుదల కనిపించినప్పటికీ, దీనికి ప్రధాన కారణం తాజా కాలుష్య నియంత్రణ ప్రమాణాలు అయిన OBD-2B మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంజిన్‌లో కంపెనీ చేసిన సాంకేతిక మార్పులే.

2025 Hero Super Splendor Price Xtec

తాజా మోడల్‌లో, డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర ప్రస్తుతం రూ. 88,128గా ఉంది. డిస్క్ బ్రేక్ వేరియంట్ (OBD-2B వెర్షన్) కోసం మాత్రం వినియోగదారులు రూ. 92,028 చెల్లించాల్సి ఉంటుంది. అప్పట్లో డ్రమ్ బ్రేక్ మోడల్ ధర రూ. 86,128 కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 90,028 (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. కొత్త మార్పులను కంపెనీ ప్రధానంగా ఇంజిన్‌లో మాత్రమే చేసింది.

దీని కెపాసిటీ అదే 124.7 సీసీ సామర్థ్యం గల, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. పర్యావరణానికి అనుగుణంగా రూపొందించబడిన ఈ బైక్ ఇప్పటికీ ఓ మంచి ఎంపికగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ ఇంజిన్, 5-స్పీడ్ కాన్‌స్టంట్ మెష్ గేర్‌బాక్స్‌తో 10.7 bhp పవర్, 10.6 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రోజువారి అవసరాలకు బాగా అనుకూలంగా ఉంటుంది.ఇది లీటరు పెట్రోల్‌కు సుమారు 69 కి.మీ మైలేజీని అందించగలదు.

2025 Hero Super Splendor Xtec Design

ఇంకా, 2024 మోడల్ స్టాక్‌లు పూర్తిగా అమ్ముడుపోయే వరకు, కంపెనీ వాటిని కొనసాగిస్తూ ఉంటుంది వినియోగదారులకు మంచి అవకాశం. తక్కువ ధరల్లో బైక్ కొనే అవకాశం లభించడంతో పాటు, పాత మోడల్స్‌కి ఎక్స్చేంజ్ లేదా క్యాష్ డిస్కౌంట్ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. ఈ కొత్త బైక్ మ్యాట్ గ్రే, బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మ్యాట్ నెక్సస్ బ్లూ లాంటి షేడ్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

బాడీ కలర్‌తో సింక్ అయ్యేలా ఫ్రంట్ ఫెండర్, హెడ్‌ల్యాంప్ కౌల్ డిజైన్ ఈ బైక్‌కు అదనపు స్టైలిష్ లుక్‌ను ఇస్తోంది. 2025 హీరో సూపర్ స్ప్లెండర్ XTEC ఇప్పుడు ఫీచర్ల పరంగా కూడా మరింత లేటెస్ట్‌గా, వినియోగదారులను ఆకట్టుకునేలా తయారైంది. ఇది LED హెడ్‌ల్యాంప్‌‌తో రాత్రివేళల్లో మెరుగైన విజిబిలిటీతో పాటు మోడర్న్ లుక్‌ను కూడా అందిస్తుంది. అంతేకాక, పూర్తిగా డిజిటల్ స్పీడోమీటర్‌ కొత్తగా అప్‌డేట్ అయింది.

2025 Hero Super Splendor Xtec

వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లు స్క్రీన్‌పై ప్రత్యక్షంగా చూడవచ్చు. సరికొత్త ఫ్యూయల్ ఇంజెక్షన్ (FI) వ్యవస్థ, నగర ట్రాఫిక్‌లో కంఫర్ట్‌‌గా ఉండటానికి వెట్ మల్టీ-ప్లేట్ క్లచ్, హైవేలపై కూడా మెరుగైన డ్రైవింగ్‌ను ఇస్తుంది. ఇది సస్పెన్షన్ సెటప్‌కు ముందు భాగంలో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్, వెనుక 5-స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌ను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 16, 2025, 10:55 [IST]
English summary
2025 hero super splendor xtec obd 2b updated model launched in india more details
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+