ఇప్పటి వరకు బుల్లెట్ వాడినవారు కూడా షాక్ అవ్వాల్సిందే! హోండా CB350RS అప్‌డేట్‌డ్ కలర్స్ అదుర్స్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అంటే ఇండియాలో క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్లాసిక్, బుల్లెట్ మోడళ్లకు బాగా డిమాండ్ ఉంటుంది. వీటికి పోటీగా ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హోండా (Honda) రెండు మోడళ్లు హైనెస్ CB350, CB350RS ఇంతకు ముందు విడుదల చేసింది. ఆకట్టుకునే డిజైన్‌తో ఇవి ఇప్పటికే దేశీయంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ రెండు కూడా వేరు వేరు డిజైన్లతో వినియోగదారులను ఆకర్షిస్తుండటంతో చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. మొదటి మోడల్ రెట్రో స్టైల్‌ డిజైన్‌ను కలిగి ఉండగా, CB350 RS స్క్రాంబ్లర్ స్టైల్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా కంపెనీ దీన్ని మరింత కొత్తగా అప్‌డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది.

2025 ఏడాది హోండా CB350RS అప్‌డేట్‌లో భాగంగా కొత్త కలర్స్‌ను జోడించారు. ఇవి DLX ప్రో వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్స్‌‌తో దీన్ని విడుదల చేశారు. మిడ్-కెపాసిటీ మోటార్‌సైకిల్ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు బలమైన పోటీగా నిలవడానికి తన బైక్‌కు హోండా కొత్త అప్‌డేట్‌లను అందించింది. కలర్ మాత్రమే కాకుండా మరికొన్ని మార్పులు కూడా చేసింది.

2025 Honda Cb350rs Design

హోండా CB350RS పెట్రోల్ ట్యాంక్‌పై భాగంలో గ్రాఫిక్స్‌లో కొంత మార్పు కనిపిస్తుంది. అలాగే దాని సైడ్ ప్యానెల్స్ కూడా అప్‌డేట్ అయ్యాయి. ఈ కొత్త మార్పులతో బైక్ మరింత ఆకర్షణీయంగా తయారైంది. 2025 అప్‌డేట్‌డ్ మోడల్‌ కస్టమర్లకు బాగా నచ్చుతుందని కంపెనీ భావిస్తుంది. అయితే ఈ మార్పులతో దాని ధర విషయంలో పెంపుదల ఏ మేరకు ఉందో తెలియదు. సమాచారం ప్రకారం, పెరుగుదల స్వల్పంగా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం హోండా CB350 RS మోడల్ ప్రారంభ ధర రూ.2.16 లక్షల నుంచి మొదలై రూ.2.19 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటాయి. కొత్త కలర్స్‌తో అప్‌డేట్ బైక్ ఇప్పటికే డీలర్‌షిప్‌ల వద్దకు రావడం మొదలైంది. కొద్ది రోజుల్లో కొనుగోలు చేసిన కస్టమర్లకు డెలివరీలు సైతం ప్రారంభిస్తారు.

2025 Honda Cb350rs Colours

ఈ కొత్త కలర్ రాకతో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్, బుల్లెట్ మోడళ్లకు గట్టి పోటీ తప్పేలా లేదు. ఇక హోండా CB350RS ఇతర వివరాల్లోకి వెళితే, ఇది DLX, DLX Pro అనే రెండు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. మొదటిది పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే కలర్స్‌లో లభిస్తుంది.

రెండోది పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ ఎల్లో, రెబెల్ రెడ్ మెటాలిక్ కలర్స్‌లో ఉంటుంది. ఈ రెండు వేరియంట్‌లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే ప్రధాన తేడా ఏమిటంటే DLX ప్రో మోడల్ హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ (HSVCS)ను కలిగి ఉంది.

ఇక దీని ఇంజిన్ విషయానికి వస్తే, CB350RS మోడల్ 348.36 cc, సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. దీనిలో హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) ట్రాక్షన్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి మొదలగు అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉన్నాయి.

గుంతలు ఉన్న రోడ్లపై కూడా రైడర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణించడానికి ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో డ్యూయల్ గ్యాస్-చార్జ్డ్ షాక్ అబ్జార్బర్‌లను అమర్చారు. అదనపు రక్షణ కోసం ముందు 310 mm డిస్క్ బ్రేక్, వెనుక 240 mm డిస్క్ ఉన్నాయి.హోండా CB350 బైక్‌లపై కంపెనీ 7 సంవత్సరాల పొడిగించిన వారంటీతో పాటు 3 ఏళ్ల ప్రామాణిక వారంటీ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 13, 2025, 7:15 [IST]
English summary
2025 honda cb350rs launched in india with new colour options more details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+