మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్‌తో అందుబాటు ధరలో సూపర్ స్టైలిష్ బైక్ లాంచ్.. పొల్యూషన్ కూడా తక్కువే!

దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్స్ (honda motorcycles) ఇటీవల కాలంలో తన దూకుడును పెంచింది. 2025లో తన అమ్మకాలను పెంచుకోడానికి భారతీయ వినియోగదారుల కోసం కొత్తగా పలు బైక్‌లను తీసుకురావడానికి ప్లాన్ చేసింది. ఈ క్రమంలో హోండా తాజాగా 2025 హోండా హార్నెట్ 2.0 (2025 honda hornet 2.0) ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. అధునాతన డిజైన్‌తో, లేటెస్ట్ టెక్నాలజీని కలిగిన బైక్ కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు ఈ కొత్త మోడల్‌ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. హోండా ఈ బైక్‌ను రెడ్ వింగ్, బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. హార్నెట్ 2.0 ప్రారంభ ధర రూ. 1,56,953. ఇది ఎక్స్‌ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో హోండా కంపెనీకి మంచి మార్కెట్ ఉంది.

అయితే దీనికి పోటీగా ఇతర కంపెనీల నుంచి సరికొత్త మోడళ్లు లాంచ్ అవుతున్న నేపథ్యంలో ఈ కొత్త బైక్‌ కంపెనీ మొత్తం అమ్మకాల సంఖ్యను పెంచడంలో సహయం చేయవచ్చు. ఇది కస్టమర్లను ఆకట్టుకునే అన్ని ఫీచర్స్‌ను కలిగి ఉంది. దీని గ్రాఫిక్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. ఇది మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, రేడియంట్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ కలర్స్‌లలో లభిస్తుంది.

2025 Honda Hornet 2 0 Design

కస్టమర్లను ఆకర్షించడానికి హోండా ప్రత్యేకంగా ఈ బైక్‌ను నాలుకు కలర్ వేరియంట్లలో అందిస్తుంది. ముఖ్యంగా ఇది కాలుష్య కారక ఉద్గారాలను తక్కువ స్థాయిలో విడుదల చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నిబంధనల మేరకు హోండా తన హార్నెట్ 2.0 లో ఇంజిన్‌ను OBD2B కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా అందించారు. ఇది 184.4 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.

ఈ ఇంజిన్‌కు స్లిప్, అసిస్ట్ క్లచ్, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ సెటప్‌ను జోడించారు. దీని పవర్ అవుట్‌పుట్ విషయానికి వస్తే, ఇది 16.76 bhp పవర్, 15.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌ పనితీరు చాలా సున్నితంగా మెరుగ్గా ఉంటుందని హోండా పేర్కొంది. ఇది చాలా లేటెస్ట్ ఫీచర్స్‌ను కలిగి ఉంది. ప్రధానంగా హోండా రోడ్‌స్టర్ స్మార్ట్‌ఫోన్ యాప్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ కావచ్చు.

2025 Honda Hornet 2 0 Price

ఇది 4.2-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. అలాగే పలు స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాల్ అలర్ట్, SMS అలర్ట్, నోటిఫికేషన్ అలర్ట్‌లను కూడా దీనిలో అందించారు. ఇవి రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. హార్నెట్ 2.0 ప్రీమియం USD, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్‌లను కలిగి ఉంది. బోల్డ్ లుక్‌ను మరింత పెంచడంలో ఫ్రంట్ ఫోర్క్స్‌ బంగారు రంగులో మెరుస్తాయి.

2025 హోండా హార్నెట్ 2.0 డ్యూయల్-ఛానల్ ABS సిస్టంతో వచ్చింది. గుంతలు ఉన్న రోడ్లపై కూడా ఇది చాలా సాఫీగా ప్రయాణిస్తుంది. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC)ను కూడా ఈ బైకులో ఇచ్చారు. రైడింగ్ సమయంలో సౌలభ్యంగా ఉండటానికి USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ అందించారు. దీంతో రైడింగ్‌లో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, February 20, 2025, 9:20 [IST]
English summary
2025 honda hornet 2 0 launched in india starting price at rs 1 56 lakh
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+