బైక్ లవర్స్ కోసం ఇంట్రెస్టింగ్ కంపారిజన్! బెస్ట్ మైలేజ్ బైక్ ఏది? హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్

భారతదేశంలో రోజువారీ ప్రయాణాలకు తప్పనిసరిగా టూవీలర్ ఉండాల్సిందే. బడ్జెట్ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లకు డిమాండ్ బాగా ఉంటుంది. అందుకే 100సీసీ మోడళ్లను పేద, మధ్యతరగతి వారు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. సాధారణంగా ఈ ఇంజిన్ కెపాసిటీ కలిగిన టూవీలర్స్ మంచి మైలేజ్ అందిస్తుంటాయి. పైగా వీటి ధరలు కూడా రూ.లక్షలోపు ఉంటాయి. పెర్ఫామెన్స్ విషయంలో ఏ లేటు ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన చాలా 100సీసీ బైక్స్‌ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

వీటిలో హీరో స్ప్లెండర్ 100 (Hero Splendor 100), హోండా షైన్ 100 (Honda Shine 100) దేశంలో ప్రజల ఫేవరెట్ బైక్స్‌గా ఉన్నాయి. ఇవి పేద, మధ్య తరగతి వినియోగదారులకు తక్కువ ధరలో లభించడంతో పాటు మైలేజ్ కింగ్‌లు కూడా అందుకే జనాలకు ఇవి విపరీతంగా నచ్చాయి. ఈ రెండు మోడళ్ల గురించి ఈ కథనంలో ఇవ్వడం జరిగింది.

Honda And Hero Comparision

ఇటీవల హోండా కంపెనీ కొత్తగా 2025 షైన్ 100 బైక్‌ను విడువల చేసింది. దాని పాత మోడల్‌తో పోలిస్తే, ఇది పూర్తిగా OBD-2 ప్రమాణాలతో కూడిన ఇంజిన్‌తో వచ్చింది. ఈ బైక్ తక్కువ స్థాయిలు కాలుష్య కారకాలను విడుదల చేస్తుంది. అప్‌డేట్‌లో భాగంగా కొత్త కలర్‌ను కూడా జోడించారు. రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఇది బాగా సెట్ అవుతుంది. 2025 హోండా షైన్ 100 ధర రూ. 68,767(ఎక్స్-షోరూమ్).

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త దాని ధర రూ.1,867 ఎక్కువ ఉంటుంది. అప్‌డేట్‌లో భాగంగా బైక్ ఇంధన ట్యాంక్‌పై గ్రాఫిక్స్‌లో కొన్ని మార్పులు చేయడంతో ఇది మరింత అందంగా కనిపిస్తుంది. అదే, హీరో స్ప్లెండర్ ప్లస్ విషయానికి వస్తే, దీని ధర మార్కెట్లో ప్రస్తుతం రూ.75,441 నుండి రూ.82,911 వరకు ఉంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది.

025 Honda Shine 100 Vs Hero Splendor Plus

స్ప్లెండర్ ప్లస్ 97.2cc ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇండియాలో ఈ బైక్‌ను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. పేద, మధ్యతరగతి అన్నివర్గాల వారికి ఫేవరెట్ మోడల్. ఈ బైక్‌ను పడగొట్టే బండి ఇప్పటి వరకు పుట్టలేదు మామ అనే మీమ్స్ కూడా దీనిపై ఉన్నాయి. సోషల్ మీడియాలో స్ప్లెండర్ ప్లస్ లవర్స్ ఫ్యాన్స్ పేజీలు కూడా ఉన్నాయి. నగరాలు, హైవేలు, పట్టణ, గ్రామీణ రోడ్లపై కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది.

హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ సీటు ఎత్తు తక్కువగా ఉంటుంది. ఇది 785 మిమీ ఎత్తు, 112 కిలోల బరువు మాత్రమే కలిగి ఉంటుంది. దీంతో తక్కువ హైట్ ఉన్నవారు కూడా దీనిని ఈజీగా రైడ్ చేయవచ్చు. హోండా షైన్ 786 మిమీ ఎత్తును కలిగి ఉంది. దీంతో హైట్ తక్కువగా వారికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.

మైలేజ్ విషయానికి వస్తే, స్ప్లెండర్ ప్లస్ లీటర్ పెట్రోల్‌కు దాదాపు 70 కి.మీల వరకు ఇస్తుంది. అదే హోండా షైన్ 100 బైక్ దాదాపు 65 kmpl మైలేజ్‌ను అందిస్తుంది. ఇది 98.98cc సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇపుడు ఈ ఇంజిన్ OBD-2Bకి అనుగుణంగా ఉంది. అదే హీరో స్ప్లెండర్ 97cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.

Take a Poll

హీరో స్ప్లెండర్ ప్లస్, 2025 హోండా షైన్ 100 స్పీడోమీటర్, ఓడోమీటర్, సెల్ఫ్-స్టార్ట్ వంటి వాటిని కలిగి ఉన్నాయి. ఈ రెండు బైక్స్ కూడా ఇరుకైన ప్రాంతాల్లో కూడా ఈజీగా ప్రయాణించడానికి , అలాగే సులభంగా పార్క్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. పెర్ఫామెన్స్ విషయంలో ఈ రెండు కూడా సాటిలేనివి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 19, 2025, 7:15 [IST]
English summary
2025 honda shine 100 comparison with hero splendor plus all top things details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+