రూ.68 వేలకే కొత్త హోండా షైన్ లాంచ్.. రోజువారి ప్రయాణానికి బెస్ట్! పేద-మధ్యతరగతి వారికి సూపర్ బడ్జెట్ బైక్

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దేశంలో అత్యంత ప్రముఖమైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా ఉంది. తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే టూవీలర్స్‌ను విడుదల చేస్తుంది. ఈ కంపెనీకి చెందిన హోండా షైన్ 100 (Honda Shine) మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న వాటిలో ఇది ఒకటి. ఉద్యోగస్తులు, చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, మధ్యతరగతి కుటుంబ ప్రజలు తమ రోజువారి అవసరాల కోసం ఈ బైక్‌నే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఇది ఒకటిగా ఉంది.

ప్రతినెలా ఈ బైక్ సేల్స్ పరంగా మెరుగైన గణాంకాలను నమోదు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ విక్రయాలు మరింత పెంచుకోవడానికి తాజాగా 2025 మోడల్ షైన్ 100 బైక్‌ను విడుదల చేసింది. పాత మోడల్‌కు దేశంలో ఏ విధంగా డిమాండ్ ఉందో ఇది అంతకంటే ఎక్కువ ఆదరణ సంపాదిస్తుందని కంపెనీ అంచనా వేస్తుంది.

2025 Honda Shine 100 Price

2025 Honda Shine 100 దాని పాత మోడల్‌తో పోలిస్తే డిజైన్ పరంగా కొన్ని మార్పులు కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. గ్రాఫిక్స్‌ను మరింత అట్రాక్టివ్‌గా మార్చారు. కొత్త ట్రెండ్‌కు అనుగుణంగా తీసుకొచ్చిన మోడల్ కాబట్టి. దీనిలో అందించిన అన్ని ఫీచర్స్ కూడా అధునాతనమైనవే. పాత మోడల్‌ను వాడిన వారు దీన్ని రైడ్ చేసినట్లయితే మరింత కొత్త అనుభూతిని పొందుతారు. దీన్ని నడపడం చాలా ఈజీ. సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

దీని ధర విషయానికి వస్తే, ఇది ప్రారంభ ధర రూ. 68,767 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). భారతదేశంలో ఉన్నటువంటి పేద, మధ్యతరగతి వారికి ఇది ఫేవరెట్ మోడల్ కావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. తక్కువ ధరలో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చే టూవీలర్స్‌కు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన 2025 హోండా షైన్ బైక్ రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసే అవకాశం ఉంది.

2025 Honda Shine 100 Design

షైన్ 100 కొత్త వెర్షన్ దాని పాత మోడల్ లాగే, అదే 98.98cc, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వచ్చింది. ఇది 7.38PS పవర్, 8.05Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. కొత్తగా కీలక మార్పు ఏమిటంటే 2025 మోడల్‌ ఇంజిన్‌ను OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా తీసుకొచ్చారు. దీంతో బైక్ నుంచి తక్కువ స్థాయిలో కాలుష్య కారకాలు ఉత్పత్తి అవుతాయి. రైడర్లకు సులభంగా ఉండటానికి 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జతచేశారు.

ఇది బూడిదతో నలుపు, నారింజతో నలుపు, ఎరుపుతో నలుపు, ఆకుపచ్చతో నలుపు వంటి కలర్స్‌తో దీని బాడీ ప్యానెల్‌లపై రిఫ్రెష్ చేయబడిన గ్రాఫిక్స్‌ను అందించారు. ఇది ఒకే వేరియంట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బుకింగ్స్ అన్ని షోరూమ్‌లలో మొదలయ్యాయి. బుకింగ్ చేసుకున్న కస్లమర్లకు డెలివరీలను ఏప్రిల్ మొదటి వారం నుండి ప్రారంభించే అవకాశం ఉంది.

Take a Poll

ఈ కొత్త అప్‌డేటెడ్ 2025 Honda Shine 100లో మునుపటిలాగే అదే టెలిస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను అమర్చారు. ఇది 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌‌తో నడుస్తుంది. సీటు ఎత్తు 786mm, గ్రౌండ్ క్లియరెన్స్ 168mmగా ఉంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, CBS (కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్)తో ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లను ఇచ్చారు.

ఫీచర్ల విషయానికొస్తే, దీనిలో స్పీడోమీటర్, ఓడోమీటర్, పెట్రోల్ గేజ్‌తో సహా రెగ్యులర్ రీడౌట్‌లను చూపించే అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. రైడర్లు మెరుగైన సేఫ్టీ కోసం బైక్‌లో సైడ్-స్టాండ్ ఇంజిన్ కటౌట్ ఫీచర్‌ను కూడా ప్రత్యేకంగా అందించారు. 2025 హోండా షైన్ 100 ప్రస్తుతం దేశీయంగా హీరో స్ప్లెండర్, HF100, బజాజ్ ప్లాటినా 100లకు గట్టి పోటీ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 17, 2025, 16:22 [IST]
English summary
2025 honda shine 100 new bike launched in india design booking price and all top things
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+