ఇది బైక్ కాదు బుల్లెట్! రేసింగ్ DNAతో వచ్చిన రోడ్ రాకింగ్ నింజా.. ఒకసారి చూస్తే మర్చిపోలేరు

భారత టూవీలర్ విభాగంలో కవాసకి (Kawasaki) పేరు చెప్పగానే ప్రీమియం బైక్స్ గుర్తుకువస్తాయి. దేశీయంగా ఉన్నటువంటి దిగ్గజ టూవీలర్ కంపెనీలకు ధీటుగా యువతను ఎక్కువగా టార్గెట్ చేస్తూ అదిరిపోయే మోడళ్లను విడుదల చేస్తుంది. ఓ సమయంలో బజాజ్‌తో కలిసి విడుదలైన 'కాలిబర్' మోడల్‌తో ఇండియన్ రోడ్లపై అడుగుపెట్టిన కవాసకి, అప్పటి నుంచి తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ముందుకు సాగుతోంది. ఆ కాలిబర్ నెమ్మదిగా చరిత్రలో నిలిచిపోగా, నింజా సిరీస్ ఆ బ్రాండ్‌కు పూర్తిగా కొత్త ముఖాన్ని ఇచ్చింది. ఇప్పుడు కవాసకి, డుకాటి, ట్రయంఫ్, BMW మోటోరాడ్ వంటి గ్లోబల్ సూపర్‌బైక్ బ్రాండ్‌లతో పోటీపడుతూ, సాంకేతికత, వేగం, స్టైల్ పరంగా తనదైన మార్కును ఏర్పరుస్తోంది. సాధారణంగా ఈ బైకుల చాలా ఖరీదులో లభిస్తాయి. అయినప్పటికి చాలా మంది యువత వీటి కోసం పోటిపడుతుంటారు.

కంపెనీ వినియోగదారులను మరింత మందిని పెంచుకోవడానికి కొత్తగా 2025 నింజా 650 KRT ఎడిషన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. నింజా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.27 లక్షలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త మోడల్, స్టాండర్డ్ నింజా 650 మాదిరిగానే శక్తివంతమైనది. ముఖ్యంగా దాని లుక్స్ లో KRT ఎడిషన్‌కు ప్రత్యేకమైన కాస్మెటిక్ అప్‌గ్రేడ్లు ఉన్నాయి.

2025 Kawasaki New Bike Ninja 650 Krt Edition

కవాసకి రేసింగ్ టీమ్ నుంచి స్ఫూర్తి పొందిన గ్రాఫిక్స్, బాడీపై అట్రాక్టివ్‌‌‌గా కనిపించే లైన్లు, స్పోర్టీ ఫినిష్ వంటి అంశాలు ఆకట్టుకునే విధంగా మార్చాయి. ఇది అదనంగా మెటాలిక్ రాయల్ పర్పుల్, క్యాండీ స్టీల్ ఫర్నేస్ ఆరెంజ్, మెటాలిక్ స్పార్క్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ప్రీమియం స్పోర్ట్స్ బైక్‌లలో ఉండే టెక్నాలజీ, భద్రతా ప్రమాణాలు, స్టైల్ అన్నింటిని కూడా 2025 నింజా 650 KRT ఎడిషన్‌‌లో అందించారు.

ఈ బైక్‌లోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ఆకర్షణీయమైన 4.3-అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది, దీని ద్వారా మీరు మీ మొబైల్‌ను బైక్‌తో కనెక్ట్ చేసుకుని, మెసేజ్‌లు, కాల్స్ వంటి ముఖ్య సమాచారం డాష్‌పై చూసేయొచ్చు. ప్రయాణంలోనూ కనెక్ట్‌గా ఉండాలనుకునే వారి కోసం ఇది బాగా ఉపయోడపడుతుంది. పూర్తిగా LED లైటింగ్‌తో వచ్చిన ఈ బైక్, దృష్టిని ఆకర్షిస్తుంది.

2025 Kawasaki New Bike Ninja 650 Krt Edition Details

ఇక భద్రత విషయానికి వస్తే, కవాసకి నింజా 650 KRT ఎడిషన్‌లో డ్యూయల్-ఛానల్ ABS తో పాటు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా అందించారు. ప్రత్యేకంగా ఈ ట్రాక్షన్ కంట్రోల్‌లో రెండు మోడ్‌లు ఉన్నాయి. మోడ్ 1 తక్కువగా కలుగజేసుకునే విధంగా ఉండి, ప్రత్యేకించి కార్నర్లను ఎఫెక్టివ్‌గా మారుస్తుంది. ఇది ప్రతీ మూల మలుపులోనూ అదుపును బైక్‌‌ను మీ కంట్రల్లో ఉంచుతుంది.

మోడ్ 2, ప్రత్యేకించి తడిగా ఉన్న రోడ్లపై ప్రయాణించేటప్పుడు అదుపు కోల్పోవడాన్ని చాలా వరకు తగ్గించేందుకు డిజైన్ చేయబడింది. ఇది అధిక చక్రాల స్పిన్‌ను తగ్గించడమే కాదు, ఇంజిన్ శక్తిని కూడా సమర్ధవంతంగా నియంత్రించి రైడర్‌కు మరింత కంట్రోలింగ్ ఇస్తుంది.. తడిగా ఉండే వాతావరణాల్లో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరమని కంపెనీ చెబుతోంది.

Ninja 650 Krt Edition

దీని ఇంజిన్ విషయానికి వస్తే, 649cc లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీనికి -స్పీడ్ గియర్‌బాక్స్‌ జత చేశారు. ఇది స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ సాయంతో రైడింగ్‌ను మరింత సులభతరం అవుతుంది. ఇంజిన్ 8,000 rpm వద్ద 67.3 bhp పవర్, 6,700 rpm వద్ద 65.76 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా బైక్‌ మూడు వేర్వేరు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, April 18, 2025, 11:00 [IST]
English summary
2025 kawasaki new bike ninja 650 krt edition launched in india features price details here
Read more on: #kawasaki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+