బైకర్ల కల నిజమైంది.. కార్లలో ఉండే ఫీచర్‌‌ ఇప్పుడు బైక్‌లో.. మరింత పవర్‌ఫుల్‌గా KTM 390 డ్యూక్!

ఇండియాలో గత కొన్నేళ్లుగా స్పోర్ట్స్ మోడల్ తరహా బైకులకు ఆదరణ పెరుగుతుంది. మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ వచ్చిందంటే చాలు దాని గురించి వాకబు చేసుకుని కొనుగోలు చేసి రోజు రైడ్స్ వేయాల్సిందే. ముఖ్యంగా దేశంలో కేటీఎం(KTM) ఇలాంటి మోడళ్లను విడుదల చేయడంతో బాగా ప్రసిద్ధి. ఈ కంపెనీ నుంచి వచ్చే బైక్స్‌కు డిమాండ్ మాములుగా ఉండదు. ప్రధానంగా KTM డ్యూక్ (duke) అనే పదం వినగానే యువత కళ్లలో ఏదో తెలియని ఆనందం. చాలా మంది రైడర్లు ఇష్టంగా డ్యూక్‌ను కొనుగోలు చేస్తుంటారు. రోడ్లపై ఈ బైక్‌తో యువత రయ్ మంటూ దూసుకుపోతుంటారు. నగరాల్లో కొందరు ఈ మోడల్‌తోనే ఎక్కువగా రేసింగ్‌లలో పాల్గొంటారు. దీని ఇంజిన్ అత్యంత శక్తివంతమైనది. అలాగే పెర్ఫామెన్స్ విషయంలో దీనికి ఏదీ సాటిరాదు.

ఈ మోడల్ మాత్రమే కాకుండా భారతీయ మార్కెట్లో ఆస్ట్రియన్ కంపెనీ KTM ఇతర బైక్‌లను కూడా విక్రయిస్తుంది. ఇటీవల కొత్తగా 250 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ మెడళ్లను విడుదల చేసి ఈ ఏడాదిని రెండు కొత్తగా ఘనంగా ప్రారంభించింది, త్వరలో మరిన్నింటిని తీసుకురావాలని చూస్తుంది. ఇదిలా ఉంటే కంపెనీ కొత్తగా KTM 390 డ్యూక్‌ను మరింత అప్‌డేట్ చేసింది. పాత దానితో పోలిస్తే, ఇది మెరుగైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

2025 Ktm 390 Duke Updated With New Colour

అప్‌డేట్ చేసిన 2025 KTM 390 డ్యూక్‌ బైక్‌ను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తుంది. దీనిలో ప్రధానంగా రైడర్లకు అవసరమైన ప్రధాన ఫీచర్స్‌ను జోడించారు. క్రూయిజ్ కంట్రోల్ ఫంక్షన్‌ను ఈ బైక్‌లో అందించారు. దీని కోసం బటన్‌లను కలిగి ఉన్న కొత్త స్విచ్‌గేర్‌ను కూడా జోడించారు. కొత్త బైక్ ఫోటోలను చూసినట్లయితే ఈ ఆప్షన్‌కు సంబంధించిన ఫంక్షన్‌ హ్యండిల్ బార్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది.

క్రూయిజ్ కంట్రోల్ అనేది రైడింగ్‌ను మరింత సులభంగా, సౌకర్యంగా మార్చే టెక్నాలజీ. ఇది ముఖ్యంగా లాంగ్ రైడ్స్ లేదా హైవే జర్నీలో ఉపయోగపడుతుంది. స్పీడ్ లాక్ ద్వారా రైడర్ నిర్దిష్ట వేగాన్ని సెట్ చేస్తే, బైక్ అదే స్పీడ్‌లో వెళ్తుంది. క్రూయిజ్ కంట్రోల్ ఒకసారి ఆన్ చేస్తే, రైడర్ థ్రోటిల్‌ను వదిలినా కూడా దాని వేగంలో మార్పు ఉండదు. రైడర్ బ్రేక్/క్లచ్ లీవర్ ఉపయోగిస్తే క్రూయిజ్ కంట్రోల్ ఆఫ్ అవుతుంది.

2025 Ktm 390 Duke

ఈ ఆప్షన్‌ను ప్రధానంగా హైవేలపై లాంగ్ రైడ్స్ చేసే సమయంలో అలాగే, ట్రాఫిక్ తక్కువగా ఉన్న రోడ్లపై, వేగాన్ని ఒకే విధంగా ఉంచాలని చూసినప్పుడు దీన్ని ఉపయోగించాలి. అదే దీన్ని ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, గుంతల రోడ్లు లేదా గుట్టలపై, వరద, మంచు లేదా స్కిడ్ అయ్యే రోడ్లపై మాత్రం అస్సలు ఉపయెగించకూడదు. రెగ్యులర్‌గా రైడింగ్‌లకు వెళ్లే వారికి దీని గురించి ఒక ఐడియా ఉంటుంది.

ఈ ఫీచర్‌ను KTM 390 డ్యూక్‌‌లో ఇవ్వడం ద్వారా దేశీయ రైడర్లు దీన్ని కొనుగోలు చేయడానికి మరింత ఆసక్తి చూపిస్తారు. ఈ అప్‌డేట్‌తో పాటు గన్‌మెటల్ గ్రే అనే కొత్త కలర్‌ను కూడా జోడించారు. ప్రస్తుతం KTM డ్యూక్ 390 ఎలక్ట్రానిక్ ఆరెంజ్, అట్లాంటిక్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.2.95 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను జోడించడంతో ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

2025 Ktm 390 Duke Updates

KTM 390 డ్యూక్‌లో 390 అడ్వెంచర్ మాదిరిగానే 399సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌‌ను కలిగి ఉంది. ఇది 46hp పవర్, 39 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌‌ను ఇంజిన్‌కు జోడించారు. క్రూయిజ్ కంట్రోల్, కొత్త కలర్ యాడ్ చేయడం మినహా 2025 KTM 390 డ్యూక్‌లో పెద్దగా ఎలాంటి మార్పులు లేవని తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 11, 2025, 15:30 [IST]
English summary
2025 ktm 390 duke updated with cruise control and new colour option
Read more on: #ktm #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+