చాలా తక్కువ రేటుకే కాలేజీ స్టూడెంట్స్ కోసం హోండా కొత్త స్పోర్టీ స్కూటర్.. ఫీచర్లకు ఎలాంటి ఢోకా లేదు

కొత్త ఏడాదిలో దేశీయ మార్కెట్లోకి వరుసగా స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి. టూవీలర్ తయారీలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ కంపెనీలు పోటా పోటీగా కొత్త స్కూటర్లను విడుదల చేస్తూ, తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. భారత్‌లో దిగ్గజ కంపెనీగా ఉన్నటువంటి హోండా తాజాగా కొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు 2025 హోండా డియో (Honda Dio).ఇప్పటికే హీరో కంపెనీ స్కూటర్ల విభాగంలో హోండాకు గట్టి పోటీ ఇవ్వడానికి డెస్టినీ మోడల్‌ను తాజాగా లాంచ్ చేయగా, ప్రత్యర్థి కంపెనీ హోండా ఇప్పుడు 2025 డియోను మార్కెట్లోకి దింపింది. ఈ కొత్త మోడల్‌ ఎంట్రీతో మార్కెట్లో పోటీ మరింత తీవ్రం అయింది. హోండా కంపెనీ ప్రసిద్ధ మోడల్ యాక్టివా 125 ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్‌గా ఉండగా, అదే ఊపును కొనసాగించడానికి 2025 డియోను కంపెనీ తీసుకొచ్చింది.

స్కూటర్ సెగ్మెంట్‌లో మరింత ఎక్కువ వాటాను పొందడమే లక్ష్యంగా హోండా విడుదల చేసిన కొత్త 2025 డియో ప్రారంభ ధర రూ.74,930 (ఎక్స్-షోరూమ్)కు లభిస్తుంది. ఇది కొత్తగా అధునాతన ఇంజిన్‌తో వచ్చింది. డజన్ల కొద్ది అప్‌డేట్‌లు ఉన్నాయి. ఈ ఇంజిన్‌ను OBD2B ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. దీంతో తక్కువ స్థాయిలో కాలుష్య ఉద్గారాలు బయటకు విడుదల అవుతాయి. 2025 డియో ఆకట్టుకునే డిజైన్‌తో చూపరులను ఆకర్షిస్తుంది.

2025 New Honda Dio Scooter Launched Price

కొత్త హోండా డియో ప్రధానంగా రెండు వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది. బేస్ మోడల్ STD ప్రారంభ ధర రూ. 74,930 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అదే, డియో డిఎల్ఎక్స్(DLX) ధర రూ.85,648 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 109.51 cc సింగిల్ సిలిండర్, PGM-FI ఇంజిన్‌‌ను కలిగి ఉంది. ఇంజిన్‌ 7.8 bhp పవర్, 9.03 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.

ఇంధన కెపాసిటీని మరింత మెరుగుపరచడానికి ఐడ్లింగ్ స్టాప్ ఫీచర్ కూడా ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, 4.2-అంగుళాల TFT డిజిటల్ డిస్‌ప్లే, దీనిలో ట్రిప్ మీటర్, మైలేజ్ ఇండికేటర్, ఎకో ఇండికేటర్ వంటి కనిపిస్తాయి. ప్రధానంగా టాప్ వేరియంట్‌ DLX‌లో అల్లాయ్ వీల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 2025 డియో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లుగా ఉంది.

2025 New Honda Dio Scooter Launched

స్పోర్టి డిజైన్‌‌తో ప్రాక్టికల్ స్ట్రక్చర్‌తో వచ్చినటువంటి 2025 డియో పొడవు 1808 mm, వెడల్పు 723 mm, ఎత్తు 1150 mmగా ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm, వీల్ బేస్ 1260 mm. ఇది మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ , పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్+పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే,పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ మార్వెల్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

2025 డియో లాంచ్‌పై హోండా సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, డియో యువశక్తి, ఆవిష్కరణలకు ప్రతీక అని అన్నారు. కొత్త ఏడాదిలో డియో ప్రారంభంతో స్కూటర్లకు ఉన్న డిమాండ్‌ను ఇది భర్తీ చేస్తుందని, మెరుగైన పనితీరు, ఆధునిక సాంకేతికత, తక్కువ కాలుష్య కారకాల విడుదల వంటి అంశాలతో 2025 డియో రైడర్లకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని అన్నారు.

2025 New Honda Dio Scooter All Details

ముఖ్యంగా ఈ కొత్త స్కూటర్‌లో ఇచ్చినటువంటి OBD2B ఇంజిన్‌ ప్రమాణాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది ఇంజిన్ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రైడింగ్ అనుభూతిని సరికొత్తగా అందించడానికి కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 15, 2025, 14:25 [IST]
English summary
2025 new honda dio scooter launched price engine features all top things check here
Read more on: #honda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+